BigTV English

David Warner: విజయంతో వీడ్కోలు పలికిన డేవిడ్ వార్నర్.. 12 ఏళ్ల టెస్టు కెరీర్ లో ఎన్నో అద్భుతాలు

David Warner: విజయంతో వీడ్కోలు పలికిన డేవిడ్ వార్నర్.. 12 ఏళ్ల టెస్టు కెరీర్ లో ఎన్నో అద్భుతాలు

David Warner: టెస్టు క్రికెట్‌నుంచి తప్పుకున్నాడు ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌. సొంత మైదానంలో కుటుంబ సభ్యుల మధ్య విజయంతో వీడ్కోలు పలికాడు. సిడ్నీలో చివరి టెస్టు ఆడిన వార్నర్ కు అభిమానులు అనూహ్యరీతిలో వీడ్కోలు పలికారు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం వేలాది మంది అభిమానులు వార్నర్‌ను అభినందించేందుకు మైదానంలోకి వచ్చారు. కెరీర్‌లో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు డేవిడ్‌ వార్నర్‌.


వార్నర్‌ అంటే ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చి ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చలాయిస్తూ.. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగే ఆటగాడే గుర్తుకొస్తాడు. అతని 12 ఏళ్ల టెస్టు కెరీర్‌లో ఎన్నో అద్భుత ప్రదర్శనలు.. చిరకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌లు.. అలాగే మరిచిపోదగ్గ వివాదాలూ ఉన్నాయి. 132 ఏళ్ల చరిత్రలో ఎలాంటి ఫస్ట్ క్లాస్ క్రికెట్ అనుభవం లేకుండా ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఎంపికైన మొదటి ఆటగాడు వార్నర్.

2011లో న్యూజిలాండ్‌పై టెస్టుతో అరంగేట్రం చేసిన 37 ఏళ్ల వార్నర్‌ 112 మ్యాచ్‌ల్లో 26 సెంచరీలు, 37 అర్ధసెంచరీలతో 8 వేల 786 పరుగులు చేశాడు. 2019లో పాకిస్థాన్‌పై తొలి ఇన్నింగ్స్‌లో అజేయంగా 335 పరుగులు సాధించాడు. తన వందో టెస్టులో దక్షిణాఫ్రికాపై తొలి ఇన్నింగ్స్‌లో 200 పరుగులు చేశాడు. గతేడాది ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా నిలిచిన ఆసీస్‌ జట్టులోనూ ఉన్నాడు. 2014 నుంచి 2018 వరకు వార్నర్‌ కెరీర్‌..దూసుకెళ్లింది. మూడు ఫార్మాట్లోనూ వార్నర్‌ కీలక ఆటగాడిగా ఎదిగాడు. కానీ అతని దూకుడు స్వభావంతో ఆసీస్‌కు కెప్టెన్‌ అయ్యే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×