BigTV English

DC vs RCB Wpl 2024: లాస్ట్ బాల్ టెన్షన్ టెన్షన్.. ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ విజయం!

DC vs RCB Wpl 2024: లాస్ట్ బాల్ టెన్షన్ టెన్షన్.. ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ విజయం!

DC vs RCB Wpl 2024


Delhi Capitals vs Royal Challengers Bangalore: వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బాల్ వరకు నువ్వా నేనా? అన్నట్టు జరిగింది. వుమన్స్ 2024 ఐపీఎల్ సీజన్ కే హైలైట్ గా నిలిచింది. స్టేడియంలో అభిమానులైతే అలా ఊపిరిబిగపట్టి మరీ చూశారు. టీవీలు, మొబైల్ ఫోన్లలో చూసేవారు అలా వాటికి అతుక్కుపోయి చూశారు. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించి హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 181 పరుగుల భారీ స్కోరు చేసింది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 180 పరుగుల వద్ద ఆగిపోయింది. కేవలం ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ విజయం సాధించింది.


టాస్‌ నెగ్గి మొదట ఢిల్లీ  బ్యాటింగ్ తీసుకుంది.  ఓపెనర్లు మెగ్‌ లానింగ్‌ (29), షఫాలీ వర్మ (23) చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత జెమీమా రోడ్రిగ్స్‌ కేవలం 36 బంతుల్లో 8 ఫోర్లు… ఒక సిక్సుతో ధనాధన్ 58 పరుగులు చేసింది. తర్వాత వచ్చిన అలీస్‌ క్యాప్సీ ( 48) కూడా ధాటిగా ఆడింది. వీరిద్దరి అదిరే ఆటతో  ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానకిి 181 పరుగులు చేసింది.

ఆర్సీబీ శ్రేయంకా పాటిల్ నాలుగు, శోభన ఒక వికెట్ పడగొట్టారు.

Read More: ప్రపంచ క్రికెట్ లో రారాజు.. టీమ్ ఇండియా అన్నింటా మనమే టాప్

182 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ కూడా ధీటుగానే బదులిచ్చింది. కానీ ఓవర్లు అయిపోవడంతో చివరికి 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసి విజయానికి ఒక్క పరుగు ముందు ఆగిపోయింది.

రిచాఘోష్ చివరి వరకు బాగా ఆడింది. తను 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 పరుగులు చేసింది. సరిగ్గా ఆఖరి బాల్ కి రెండు పరుగులు చేయాల్సిన సమయంలో రనౌట్ అయిపోయింది. దాంతో ఆర్సీబీ కథ ముగిసిపోయింది.

నిజానికి ఆర్సీబీ ఒక దశలో 18 బంతుల్లో 40 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దశలో ఎవరూ ఆ జట్టు గెలుస్తుందని అనుకోలేదు. కానీ రిచా ఘోష్ ధనాధన్ ఆడింది. చివరి రెండు ఓవర్లలో 23 పరుగులు చేసింది. దాంతో ఆఖరి ఓవర్ లో 17 పరుగులు అవసరం అయ్యాయి.

ఇక్కడ నుంచి అసలైన హైడ్రామా మొదలైంది. తొలి బంతినే సిక్సుగా మలచిన రిచా… మూడో బంతికి పరుగు తీసే క్రమంలో దిశా కాసత్‌ రనౌట్‌ అయింది. లక్ష్యం మూడు బంతుల్లో 10 పరుగులుగా మారింది. నాలుగో బంతికి రెండు పరుగులు తీయగా, ఐదో బంతిని రీచా మళ్లీ సిక్స్‌ కొట్టింది. సమీకరణం  చివరి బంతికి రెండు పరుగులుగా మారింది.

అంతే, అందరిలో ఒకటే టెన్షను మొదలైంది. అసాధ్యం అనుకున్నది సుసాధ్యమైంది. మరి గెలుస్తుందా? లేదా? అని అందరిలో సందేహం… కానీ చివరి బంతికి పరుగు తీసే క్రమంలో రిచా రనౌట్  అయ్యింది..  విజయం కోసం ఆఖరి బంతి వరకు పోరాడి చివరకు ఓడిపోయింది.

బెంగళూరు బ్యాటర్లలో ఎలిస్‌ పెర్రీ(49), సోఫీ మోలినెక్స్‌ (33), సోఫీ డివైన్‌ (26) పరుగులు చేశారు.

ఢిల్లీ బౌలర్లలో మారిజానె కాప్‌, ఎలిస్‌ క్యాప్సీ, షిఖా పాండే, అరుంధతీ రెడ్డి తలో వికెట్‌ తీశారు.
తేడాతో విజయం సాధించింది.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×