BigTV English

Dinesh Karthik: అందరూ బాదుడే.. కానీ వీరిలో దినేశ్ బెస్ట్

Dinesh Karthik: అందరూ బాదుడే.. కానీ వీరిలో దినేశ్ బెస్ట్

Dinesh Karthik IPL 2024 Latest Sports News: ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య మ్యాచ్ యమా జోరుగా సాగింది. రెండు జట్లలో ఆరుగురు ఆటగాళ్లు అదరగొట్టాడు. ఆర్సీబీలో ముగ్గురు, ముంబై ఇండియన్స్ లో ముగ్గురు ధనా ధన్ ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ 5 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 34 బంతుల్లో 69 పరుగులు చేశాడు. తర్వాత సూర్యా వచ్చాడు. తను కేవలం 19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసి వెళ్లిపోయాడు. తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చాడు. తను కేవలం 6 బంతుల్లోనే 21 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు.


అంతకుముందు ఆర్సీబీ విషయానికి వస్తే కెప్టెన్ డుప్లెసిస్ 40 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 61 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రజత్ పటీదార్ ఫామ్ అందుకున్నాడు. తను 26 బంతుల్లోనే 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత అసలు సిసలైన హీరో వచ్చాడు. తనే దినేశ్ కార్తీక్..

Also Read: విరాట్ మాట విన్న అభిమానులు పాండ్యా కి నిరసనల బదులు జేజేలు


ఈ మ్యాచ్ లో వీరందరి మీదా తను ఆడిన ఇన్నింగ్సే కళాత్మకంగా సాగింది. బాదుడంటే ఏదో రొడ్డ కొట్టుడు, గుడ్డిగా కొట్టడం కాదు.  కరెక్టు షాట్, ఏదో కొలత వేసినట్టు కొట్టాడు. దాన్ని ఎంత పవర్ తో కొట్టాలో,  ఫీల్డర్స్ మధ్యలోంచి ఎలా కట్ చేసి  పంపించాలో అలాగే చేశాడు. తను  ఆడిన ఆట న భూతో న భవిష్యత్ అన్నట్టు ఉండటమే కాదు, క్రికెట్ బ్యాటింగ్ కి సరికొత్త నిర్వచనం చెప్పేలా ఆడాడు. దాన్ని ఒక సిలబస్ గా కూడా చూడవచ్చునని సీనియర్లు అంటున్నారు.

ముఖ్యంగా 18 వ  ఓవర్ లో కోయిట్జీ బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్  ఒక సిక్స్ కొట్టాడు. తర్వాత 19వ ఓవర్ వేసిన బుమ్రా రెండు వికెట్లు తీసినా,. తనకి కూడా ఒక సిక్సర్ తగిలించాడు. ఇక ఆకాశ్ మధ్వాల్ వేసిన చివరి ఓవర్‌లో 6, 6, 4 బాది జట్టుకు 196 పరుగుల భారీ స్కోర్ అందించాడు.

Tags

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×