Big Stories

Virat Kohli : విరాట్ మాట విన్న అభిమానులు పాండ్యా కి నిరసనల బదులు జేజేలు

MI vs RCB- Virat Kohli Gestures Wankhede Crowd to stop Booing Hardik Pandya:

అదీ అభిమానం అంటే, అదీ నమ్మకం అంటే, అదీ ప్రేమంటే.. అదీ విరాట్ అంటే..
నిజానికి విరాట్ కొహ్లీకి ఉన్న శక్తి తనకి తెలీదు. కానీ ఆర్సీబీతో జరిగిన ముంబై మ్యాచ్ లో మరోసారి అది నిరూపితమైంది.

- Advertisement -

విషయం ఏమిటంటే వాంఖేడి స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్ ముంబై మధ్య మ్యాచ్ జరిగింది. ఎప్పటిలా బ్యాటింగ్ చేయడానికి హార్దిక్ పాండ్యా వచ్చినప్పుడు అభిమానులు ట్రోలింగ్ మొదలుపెట్టారు. చాలా తీవ్రంగా విమర్శించడం ప్రారంభించారు.

- Advertisement -

బౌండరీ లైను దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కొహ్లీ అది చూసి, అభిమానులకు సైగల ద్వారా సంకేతాలు పంపించాడు. అలా చేయడం తప్పు, హార్దిక్ ని డౌన్ చేయకండి. .ప్రోత్సహించండి.. అంటూ తెలియజేయడంతో అభిమానులు వాటిని రిసీవ్ చేసుకుని , క్షణాల్లో తమ స్టాండ్ మార్చుకున్నారు. అప్పటివరకు హార్దిక్ ని ఆటపట్టించిన వాళ్లు వెంటనే జేజేలు పలకడం మొదలుపెట్టారు.

Also Read: నేడు లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్

దీంతో హార్దిక్ రెట్టించిన ఉత్సాహంతో 6 బంతుల్లోనే 21 పరుగులు చేసి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ ని గెలిపించాడు.ఈ నేపథ్యంలో  నెట్టింట విరాట్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. క్రీడాస్ఫూర్తిని విరాట్ చాటాడని అంటున్నారు. ఇటీవల రోహిత్ శర్మ కూడా అభిమానులను ఊరుకోమని చెప్పడంతో వాళ్లు కూడా శాంతించారు. అయితే గ్రౌండులోపల కాకుండా బయట కూడా రోహిత్ చెప్పాలని నెటిజన్లు కోరుతున్నారు.

ఎందుకంటే రోహిత్ పబ్లిక్ గా చెప్పాలని, హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా ఒప్పుకోవాలని, అతన్ని కించపరచడం కరెక్టు కాదని, తను ఒక్కసారి చెబితే అంతా సర్దుకుంటుందని అంటున్నారు. ఆ పని మాత్రం తను చేయడం లేదు. కానీ విరాట్ కొహ్లీ మాత్రం తనకి సంబంధం లేకపోయినా సరే, మ్యాచ్ ఓడిపోతున్నా సరే, హార్దిక్ క్రీడా జీవితానికి జరుగుతున్న అన్యాయానికి తన వంతు చేయాల్సింది చేశాడు.

ఇప్పుడీ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అందరూ విరాట్ క్రీడాస్పూర్తికి జేజేలు పలుకుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News