BigTV English
Advertisement

Rohit Sharma : పాండ్యాకి చెక్ పెడుతున్న రోహిత్..? హార్ధిక్ రీప్లేస్‌మెంట్ ఇతనేనా..?

Rohit Sharma : పాండ్యాకి చెక్ పెడుతున్న రోహిత్..? హార్ధిక్ రీప్లేస్‌మెంట్ ఇతనేనా..?

Rohit Sharma : ఇండోర్ లో జరిగిన రెండో టీ 20లో రోహిత్ శర్మ(Rohit Sharma) చేసిన బౌలింగ్ ఛేంజ్ వివాదాస్పదం అవుతోంది. డెత్ ఓవర్ల అయిన 19 ఓవర్ ని శివమ్ దూబె(Shivam Dube)కి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆ ఓవర్ లో శివమ్ 20 పరుగులు ఇచ్చాడు. ఎందుకిలా రోహిత్ శర్మ చేశాడని నెట్టింట అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి.


తొలి టీ 20లో శివమ్ దూబె ఇరగదీశాడు. 40 బంతుల్లో 60 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 9 పరుగులు ఇచ్చి, ఒక వికెట్టు కూడా తీశాడు. ఇండోర్ వేదికగా జరిగిన రెండో టీ20లో కూడా 32 బంతుల్లో 63 పరుగులు చేశాడు. 3 ఓవర్లు వేసి 36 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీశాడు. రెండు మ్యాచ్‌ల్లో దూబె నాటౌట్‌గా నిలవడం విశేషం.

2019లోనే శివమ్ దూబె అరంగేట్రం చేశాడు. అయినాసరే, ఈ ఐదేళ్లలో 20 మాత్రమే.. టీ 20 మ్యాచ్ లు ఆడాడు. కరోనా లాక్‌డౌన్ తర్వాత మళ్లీ శివమ్ దూబెకి పిలుపు రాలేదు. ఎందుకంటే అప్పటికే టీ 20 ఫుల్ ప్యాక్ తో ఉంది. జట్టులో ఆల్రడీ ఉన్నవాళ్లు, సీనియర్లతో కిక్కిరిసి పోయి ఉంది. దీంతో శివమ్ దూబెకి అవకాశం అంత త్వరగా రాలేదు.


కానీ వచ్చే టీ 20 వరల్డ్ కప్(T20 World Cup, 2024) నేపథ్యంలో ఒకొక్కరికి అవకాశాలు ఇస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే శివమ్ దూబెకి ఇచ్చారు. కానీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇరగ్గొట్టి వదిలేస్తున్నాడు.

అయితే 2023 వన్డే వరల్డ్ కప్‌ ముందు బుమ్రా(Jasprit Bumrah) సారథ్యంలో ఐర్లాండ్ సిరీస్‌కు ఎంపిక అయ్యాడు. ఆ తర్వాత నిలకడ లేమితో జట్టులో శాశ్వత స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని మెరుపు ఇన్నింగ్స్ తో తన అవసరం టీమ్ ఇండియాకు ఎంతో ఉందని చెప్పకనే చెబుతున్నాడు.

హార్దిక్ పాండ్యా(Hardik Pandya) వారసుడు.. శివమ్ దూబె అని నెట్టింట జనం పోస్ట్ లు పెడుతున్నారు.  స్టార్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ టీమ్ ఇండియాలో కొనసాగుతున్నాడు. కానీ గాయాల బారిన పడటంతో జట్టులో సమతుల్యత లోపిస్తోంది. ఆ స్థానాన్ని భర్తీ చేసేవారు కనిపించడం లేదు. వన్డే వరల్డ్ కప్ లో హార్దిక్ గాయపడిన దగ్గర నుంచి ఇదే తీరు నడుస్తోంది.

 మరోవైపున రోహిత్ శర్మపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. హార్దిక్‌కు పోటీగా శివమ్ దూబెకు అవకాశాలు వస్తున్నాయని అంటున్నారు. ఇందులో రోహిత్ పాత్ర ఉందా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంపికలో తన పాత్ర లేకపోయినా, మ్యాచ్ లో మాత్రం శివమ్ దూబెకు ప్రాధాన్యత ఇస్తున్నాడని అంటున్నారు. బ్యాటింగ్ ఆర్డర్ లో కూడా ముందుకు రావడం అందులో భాగమే అంటున్నారు.

అఫ్గాన్ తో జరిగిన రెండో టీ 20లో, స్పెషలిస్ట్ బౌలర్ ముకేశ్ కుమార్‌(Mukesh Kumar)ను కాదని, శివమ్ దూబెతో డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయించాడని అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చే సమయానికి శివమ్ దూబె, తన స్థానానికి ఎసరు పెట్టడు కదా.. అంటున్నారు.  

Rohit Sharma, Hardik Pandya, Shivam Dube

Related News

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Hong Kong Sixes 2025: దినేష్ కార్తీక్ చెత్త కెప్టెన్సీ.. కువైట్, UAE చేతిలో వ‌రుస‌గా ఓడిన టీమిండియా

Womens World Cup 2029: వ‌చ్చే వ‌ర‌ల్డ్ క‌ప్ 2029పై ఐసీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇకపై 8 కాదు 10 జ‌ట్లకు ఛాన్స్‌, ఫాకిస్తాన్ కు నో ఛాన్స్ !

Big Stories

×