BigTV English

Duleep trophy 2024: వారెవ్వా.. ధ్రువ్ మామూలోడు కాదు.. ధోని రికార్డుకే ఎసరు పెట్టాడు!

Duleep trophy 2024: వారెవ్వా.. ధ్రువ్ మామూలోడు కాదు.. ధోని రికార్డుకే ఎసరు పెట్టాడు!

Duleep trophy 2024 Dhoni Record Equal to Dhruv: టీమిండియా యువ కీపర్ ధ్రువ్ జురెల్ అదరగొడుతున్నాడు. ఏకంగా భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రికార్డులపై కన్నేశాడు. తాజాగా, జరిగిన దులీప్ ట్రోఫీలో ధ్రువ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.


భారత క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ సాధించిన అరుదైన ఫీట్‌ను ధ్రువ్ జురెల్..దులీప్ ట్రోఫీలో సమం చేశాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఇండియా ఏ తరఫున బరిలోకి దిగిన ధ్రువ్ అద్భుతంగా కీపింగ్ చేశాడు.

ఈ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ప్రత్యర్థి జట్టుకు సంబంధించిన ఏడుగురు బ్యాటర్ల క్యాచ్‌లను పట్టుకున్నాడు. దీంతో దులీప్ ట్రోఫీలో గతంలో ధోనీ పేరిట ఉన్న ఏడు క్యాచ్‌ల రికార్డును ధ్రువ్ సమం చేశాడు. అంతకుముందు 2004 -05లో ధోనీ 7 క్యాచ్‌లు అందుకున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో బెంజమిన్, విశ్వనాథ్ ఆరు క్యాచ్‌ల చొప్పున పట్టుకున్నారు.


23 ఏళ్ల ఈ కుర్ర వికెట్ కీపర్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్క క్యాచ్ మాత్రమే పట్టుకున్నాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం యశస్వీ, సర్ఫరాజ్, ముషీర్ ఖాన్, నితీశ్ రెడ్డి, నవదీప్ సైని వంటి వారిని ఔట్ చేయడంలో కీలక పాత్రం పోషించాడు. కాగా, గత కొంతకాలంగా ధ్రువ్ జురెల్ మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ పై టీమిండియా టెస్ట్ జట్టులో చోటు సంపాదించుకున్నాడు.

Related News

Haris Rauf’s wife : హారిస్ రౌఫ్ భార్యకు పెను ప్రమాదం… తుక్కుతుక్కు అయిన కారు !

SL VS PAK : ఆసియా క‌ప్ లో నేడు శ్రీలంక‌-పాక్ మ‌ధ్య పోరు.. చావో రేవో..!

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

Big Stories

×