BigTV English

Bigg Boss Buzz: దానివల్లే జీవితం తలకిందులు అయ్యింది.. అందరినీ అలా రెచ్చగొట్టింది, నా మాట రాసిపెట్టుకోండి: బేబక్క

Bigg Boss Buzz: దానివల్లే జీవితం తలకిందులు అయ్యింది.. అందరినీ అలా రెచ్చగొట్టింది, నా మాట రాసిపెట్టుకోండి: బేబక్క

Bigg Boss Buzz Promo: బిగ్ బాస్ సీజన్ 8లో మొదటి ఎలిమినేషన్ ముగిసింది. అంటే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలు మొదలయ్యే టైమ్ వచ్చింది. మామూలుగా బిగ్ బాస్ బజ్ షోను మునుపటి సీజన్స్‌కు సంబంధించిన కంటెస్టెంట్స్ హోస్ట్ చేయడం కామన్. అలా ఈసారి బిగ్ బాస్ బజ్‌ను బిగ్ బాస్ సీజన్ 7కు సంబంధించిన టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఒకడైన అర్జున్ హోస్ట్ చేస్తున్నాడు. బేబక్క ఎలిమినేట్ అవ్వడంతో అర్జున్‌తో కలిసి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. బేబక్క ఎలిమినేట్ అవుతూ నిఖిల్, సోనియాపై కోపం అలాగే ఉండిపోతుందని చెప్పకనే చెప్పింది. బజ్‌లో కూడా అదే విషయాన్ని మాట్లాడింది.


నమ్మి వెళ్లాను

ముందుగా బిగ్ బాస్ బజ్ ప్రోమో మొదలవ్వగానే ఒకవారం బిగ్ బాస్ హౌజ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందని బేబక్కను అడిగాడు అర్జున్. ‘‘కొత్తగా ఉంది. అర్థమయ్యేలోపు బయటికి వచ్చేశాను’’ అని నవ్వుతూ పాజిటివ్‌గా సమాధానమిచ్చింది బేబక్క. ‘‘ఒకరి చేత ప్రభావితం అవ్వకుండా ఉండుంటే నిజంగా మీరు ఈరోజు బయటికి వచ్చేవారు కాదు’’ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు అర్జున్. ‘‘ఇష్టపడి నిఖిల్‌లోకి వచ్చాను కదా. ముళ్లకిరీటాన్ని తీసుకొచ్చి తలపై పెట్టుకున్నాను. తను ఎంతసేపు సోనియానే తన టీమ్‌లో ఉండాలి, సోనియానే స్ట్రాంగ్ అనుకుంటూ ఉండేవాడు’’ అని స్పష్టం చేసింది బేబక్క.


Also Read: బిగ్ బాస్‌కు బేబక్క బైబై.. వెళ్లేటప్పుడు కూడా నిఖిల్, సోనియాపై అవే వ్యాఖ్యలు

అందరినీ రెచ్చగొట్టింది

‘‘సోనియాకు మీరెందుకో భయటపడినట్టు అనిపించింది’’ అని అర్జున్ అనగా.. ‘‘తను గట్టిగా పాయింట్ మాట్లాడి అందరినీ రెచ్చగొడితే అందరికీ అదే అనిపించింది’’ అంటూ సమాధానాన్ని స్పష్టంగా చెప్పింది బేబక్క. సోనియా, నిఖిల్ క్లోజ్‌నెస్ చూసి వారిద్దరూ బయట నుండి ఫ్రెండ్స్ అని చాలామంది అనుకోవడం మొదలుపెట్టారు. ఈ విషయంపై బేబక్క కూడా స్పందించింది. ‘‘బిగ్ బాస్ హౌజ్‌లో వాళ్లిద్దరూ క్లోజ్‌గా ఉండడం అందరు గమనిస్తున్నారు’’ అని తెలిపింది. ‘‘నిఖిల్, సోనియా ఇద్దరూ తేనె పూసిన కత్తి టైపా’’ అని సూటిగా ప్రశ్నించాడు అర్జున్. ‘‘నా మాట రాసుకోండి. వెయ్యి శాతం అదే’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది బేబక్క.

కావాలనే చేస్తుంది

ఆ తర్వాత అర్జున్ కొన్ని ఫోటోలు చూపించి, అవి చూస్తే ఏం గుర్తొస్తుందని బేబక్కను అడిగాడు. ముందుగా కుక్కర్ చూపించగానే.. తన జీవితాన్ని అది తలకిందులు చేసిందని ఆ ఫోటోకు దండం పెట్టింది. కుకింగ్ సెక్షన్‌లో తను లేదు కాబట్టి ప్రెజర్ అంతా సీత మీద పడొచ్చని జాలి చూపించింది. నిఖిల్.. అందితే జుట్టు లేకపోతే కాలు టైప్ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. బిగ్ బాస్ హౌజ్‌లో మసాలా ఎవరంటే విష్ణుప్రియా అని చెప్పింది. మిరపకాయ్ ఫోటో చూపించగానే అది సోనియానే అంటూ ‘‘ఆమె దగ్గరకు వెళ్లినా మిరపకాయ్ పేలినట్టు పేలుతుంది. కావాలనే ట్రిగర్ చేయాలని చేస్తుంది. మామూలుగా లేదు’’ అని చెప్పుకొచ్చింది బేబక్క.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×