BigTV English

Duleep Trophy 2024: వాళ్లు తప్ప.. అందరూ వస్తున్నారు: అనంతపురంలో క్రికెట్ శోభ

Duleep Trophy 2024: వాళ్లు తప్ప.. అందరూ వస్తున్నారు: అనంతపురంలో క్రికెట్ శోభ

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఐదు జోన్ల మధ్య నిర్వహించే దేశవాళీ క్రికెట్. సెప్టెంబరు 5 నుంచి ప్రారంభం కానుంది. అయితే అయ్యింది. ఎందుకంత ఆనందం అంటారా? ఎందుకంటే టీమ్ ఇండియా క్రికెటర్లలో వాళ్లు తప్ప.. అందరూ వస్తున్నారు.


ఇక్కడ ఒక నిజం ఏమిటంటే.. జాతీయ జట్టుకి ఎంపికైన క్రికెటర్లు తమ స్థాయి పెరిగిపోయిందని భావించి లోకల్ క్రికెట్ ఆడటం మానేస్తున్నారు. దానిని చిన్నచూపు చూస్తున్నారు. మరికొందరు యువ క్రికెటర్లు వైట్ బాల్ క్రికెట్ తో ఆడుతూ, ఐపీఎల్ టీ 20 మోజులో పడి దేశవాళి క్రికెట్ వైపు చూడటం లేదు.

అందుకే ఇలాంటివాళ్లందరిని మళ్లీ జుత్తు పట్టుకుని లాగి ఆడిస్తున్న టోర్నమెంటు.. ఈ దులీప్ ట్రోఫీ. టోర్నమెంటులో భాగంగా నాలుగు జట్లను ఎంపిక చేశారు. మ్యాచ్ లు నిర్వహించేందుకు బీసీసీఐ రెండు వేదికలను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి బెంగళూరు, రెండోది ఏపీలోని అనంతపురం.


Also Read: పాకిస్తాన్ కు.. మరో అవమానం తప్పదా?

అయితే.. విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా, సిరాజ్, రవీంద్ర జడేజా వీళ్లు మాత్రం దులీప్ ట్రోఫీ ఆడటం లేదు. మిగిలిన అందరూ నాలుగు టీమ్ ల్లో ఉన్నారు. అనంతపురం క్రికెట్ స్టేడియంలో సౌకర్యాలు, మౌలిక వసతులన్నీ ఉన్నాయి. అన్నింటికీ మించి బ్యాటర్లు, బౌలర్లకు అనుకూలంగా ఉండేలా పిచ్ లను తయారుచేయడంలో ఇక్కడ క్యూరేటర్లు నిష్ణాతులుగా చెబుతారు.

రూరల్ డవలప్ మెంట్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ క్రీడా మైదానం నడుస్తోంది. వారే ఈ స్టేడియం మంచీ చెడులు చూస్తుంటారు. అన్నింటికి మించి ఆంధ్రా క్రికెట్ సంఘానికి మద్దతుగా నిలుస్తుంటుంది. అయితే అనంతపురంలోని పిచ్ ని చూసినవాళ్లు అనేమాటేమిటంటే..ఇది ఆస్ట్రేలియాలోని పెర్త్ ని పోలి ఉంటుందని చెబుతుంటారు.

అనంతపురం ట్రాక్ రికార్డు చాలా ఘనంగా ఉంటుంది. ఇంత వరకు ఇక్కడ 15 మ్యాచ్ లు జరిగాయి. తర్వాత కొంతకాలం గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ 2024లో మొదలవనుంది. దులీప్ ట్రోఫీ లో మ్యాచ్ నాలుగు రోజులే ఉంటుంది. ఇక్కడ జరిగిన మ్యాచ్ ల్లో పేసర్లు 345 వికెట్లు తీస్తే, స్పిన్నర్లు 96 వికెట్లు మాత్రమే తీశారు. అంటే ఇది పేసర్లకు అనుకూలించే పిచ్ గా చెబుతున్నారు.

ఇకపోతే ఇక్కడ ఒక్కసారే 100 పరుగుల్లోపు ఒక జట్టు ఆలౌట్ అయ్యింది. కొందరు క్రికెటర్లు 400కు పైగా స్కోర్ కూడా చేశారు. రెండ్రోజుల్లో పేసర్లకు అనుకూలించే పిచ్ పై జరిగే దులీప్ ట్రోఫీ ఆసక్తికరంగా సాగనుందని నెటిజన్లు అంటున్నారు.

Related News

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

Big Stories

×