BigTV English

Jr.NTR: జూ.ఎన్టీఆర్ దాతృత్వం.. తెలుగు రాష్ట్రాలకు భారీగా విరాళం

Jr.NTR: జూ.ఎన్టీఆర్ దాతృత్వం.. తెలుగు రాష్ట్రాలకు భారీగా విరాళం

NTR donates one crore to Telugu states: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలతో చాలామంది నిరాశ్రయులుగా మారారు. ముఖ్యంగా విజయవాడ, ఖమ్మం జిల్లాల్లో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమంలో రెండు ప్రభుత్వాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు సైతం తనవంతుగా సహాయం చేస్తున్నాయి. తాజాగా, ఎన్టీఆర్ కూడా భారీగా విరాళం ప్రకటించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.


గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల బీభత్సం తనను ఎంతోగానో కలిచివేసిందని టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎం సహాయనిధికి జూనియర్ ఎన్టీఆర్ రూ.కోటి విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.

‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతోగానే కలిచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.’ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నా వంతుగా చెరొక రూ.50 లక్షలు విరాళం ప్రకటిస్తున్నానని ఆయన తెలిపారు.


అలాగే టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ కూడా రెండు రాష్ట్రాలకు కలిపి రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా బాధితులకు నా వంతుగా సహాయం అంటూ పోస్ట్ చేశారు. ‘ ఈ విపత్తు సమయంలో రాష్ట్రంలో నెలకొన్న వరదలకు సహాయక చర్యలు అవసరం. ఈ మేరకు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.5 లక్షల విరాళం ఇస్తున్నా. వరద బాధితులకు నా వంతుగా ఈ సహకారం.’ అంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి రూ.5లక్షలు విరాళంగా ఇస్తున్నాను. వరదలతో నష్టపోయిన వారి బాధలను తగ్గించే దిశగా ఈ సహకారం ఒక చిన్న అడుగు.’ అని పోస్టు చేశారు.

అంతకుముందు పలువురు సినీ ప్రముఖులు సైతం విరాళాలు ప్రకటించారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు నిర్మాత అశ్వనీదత్ రూ.25 లక్షలు విరాళం ప్రకటించారు. అలాగే ‘ఆయ్’ మూవీ మేకర్స్ వారంతపు వసూళ్లలో 25 శాతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేస్తున్నట్లు ప్రకటించారు.

Also Read:  క్యాస్టింగ్ కౌచ్ పై స్వీటీ కూడా స్పందించేసింది.. సమంతకు మద్దతుగా

ఇదిలా ఉండగా, గత మూడు రోజులుగా తెలంగాణ, ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు రెండు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. అలాగే పలు ప్రాంతాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఇప్పటికీ లోతట్టు ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. దీంతో ఆ ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు.

మరోవైపు బాధితులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక విజయవాడ, ఖమ్మం జిల్లాల్లో పరిస్థితులు దయనీయంగా మాారాయి. కుండపోత వానలు, భారీ వరదలతో పెద్దఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. రెండు రాష్ట్రాల్లో కలిపి 25కు పైగా మృత్యువాత పడ్డారు. దాదాపు రూ.10వేల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×