BigTV English

ENG vs NED : మళ్లీ ‘టైం అవుట్’ చూసేవాళ్లమే.. అంపైర్లను రిక్వెస్ట్ చేసిన క్రిస్ వోక్స్..

ENG vs NED : మళ్లీ ‘టైం అవుట్’ చూసేవాళ్లమే.. అంపైర్లను రిక్వెస్ట్ చేసిన క్రిస్ వోక్స్..
ENG vs NED Match Update

ENG vs NED Match Update(World cup today news) :

బాబోయ్..నా హెల్మెట్ కూడా బాగాలేదు..ఇంగ్లండ్-నెదర్లాండ్ మధ్య జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచ్ లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అందరిలో నవ్వులు పూయించింది. ఇంతకీ విషయం ఏమిటంటే ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తుండగా 35 ఓవర్ లో క్రిస్ వోక్స్ బ్యాటింగ్ కి వచ్చాడు. క్రీజులోకి కూడా వచ్చేశాడు.


అంపైర్ల దగ్గర గార్డు కూడా తీసుకున్నాడు. తీరా ఆడే సమయంలో చూస్తే తన హెల్మెట్ బాగా లేదన్న సంగతి గుర్తించాడు. వెంటనే తమ వాళ్లకి సిగ్నల్ ఇద్దామని సడన్ గా ఆగిపోయాడు. అయ్యబాబోయ్..ఇదేదో టైమ్డ్ అవుట్ వ్యవహారంలా ఉందని భావించి..వెంటనే అంపైర్ల దగ్గరికి పరుగెత్తాడు.

ఎల్ కేజీ పిల్లవాడు క్లాస్ రూమ్ లో .. సడన్ గా లేచి ‘టీచర్..టీచర్..వాటర్..’ అని బొటన వేలు చూపించి అడిగినట్టు.. బుద్ధిమంతుడైన ఆటగాడిలా అంపైర్ వద్దకు వెళ్లి, హెల్మెట్ చూపించి రిక్వెస్ట్ చేశాడు.


సార్, నా హెల్మెట్ బెల్ట్ కూడా తెగిపోయింది. వెళ్లి మార్చుకుని వస్తా! అన్నాడు. ఈ ఘటనతో ఒక్కసారి అంపైర్ల ముఖాలపై నవ్వులు పూశాయి. స్టోక్స్ ముఖంలో కూడా నవ్వులు, అటు నెదర్లాండ్స్ జట్టులో కూడా ముసిముసి నవ్వులు..మొత్తమ్మీద హెల్మెట్ వ్యవహారంతో  అందరూ సరదాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడీ ఘటనతో మీమర్స్ కి మంచి పని తగిలింది. తెగ మీమ్స్ వదులుతున్నారు.

కానీ షకీబ్ చేసిన పనికి అందరూ తిడుతున్నారుగానీ, ఒక మంచి కూడా జరిగిందని అంటున్నారు. క్రికెటర్లు అందరిలో ఒక అలర్ట్ నెస్ అయితే తీసుకొచ్చాడని అంటున్నారు. లేకపోతే గ్రౌండ్ లో అవుట్ కాగానే, అప్పుడు కొందరు ప్యాడ్స్ కడుతుంటారు. తాపీగా వెళతారు. చూద్దాం లే, వెళదాం లే, అని నిర్లక్ష్యంగా కొందరు కదులుతుంటారు.

కాన్ఫిడెన్స్ మంచిదే కానీ, చాలా సందర్భాల్లో అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనే బిల్డప్ ని చూపిస్తుంటుంది. కానీ ఇప్పుడు టైమ్డ్ అవుట్ వ్యవహారంతో ఆటగాళ్లందరికీ కరెంట్ షాక్ తగిలినట్టయ్యింది. ఈసారి నుంచైనా కొంచెం వళ్లు దగ్గర పెట్టుకుని ఉంటారని అంటున్నారు. ఏదైనా మన మంచికే అంటారు అందుకే కాబోలు కదండీ.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×