BigTV English

England Vs Afghanistan: ఇంగ్లాండ్ కు షాక్.. ఆఫ్ఘనిస్థాన్ సంచలన విజయం..

England Vs Afghanistan: ఇంగ్లాండ్ కు షాక్..  ఆఫ్ఘనిస్థాన్ సంచలన విజయం..

England vs Afghanistan: అది డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండు జట్టు.. ఇటు చూస్తే అంతర్జాతీయ క్రికెట్ లో ఒక పిల్ల జట్టు  ఆఫ్ఘనిస్తాన్. అయితే చాలా సందర్భాల్లో వారు సంచలనాలు నమోదు చేశారు. పెద్ద పెద్ద జట్లకే మంచినీళ్లు తాగించారు. అందులో మన ఇండియా కూడా ఉందనుకోండి.


ఇప్పుడీ 2023 ప్రపంచకప్ లో మాత్రం ఇది స్పెషల్ అనుకోవాలి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లాంటి జట్టు 2019 వరల్డ్ కప్ విజేత ఇంగ్లాండ్ ని మట్టికరిపించడం అంటే చిన్న విషయం కాదు.  ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్ 285 భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండు ముందు ఉంచింది. తర్వాత లక్ష్య సాధనలో పడుతూ లేస్తూ సాగిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ 215 పరుగులు వద్ద ముగిసింది. చివరికి 69 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం సాధించింది.

టాస్ ఓడిపోయినా సరే ఎంతో ఆత్మ విశ్వాసంతో ఆఫ్గాన్ ఓపెనర్లు బరిలోకి దిగారు. రహ్మానుల్లా గుర్భాజ్ ఉన్నంత సేపు ఇంగ్లాండ్ బౌలర్లకి చుక్కలు కనిపించాయి. 57 బంతుల్లో 4 సిక్సర్లు, 8 ఫోర్లతో 80 పరుగులు చేసి అనుకోకుండా రనౌట్ అయ్యాడు. మిడిల్ ఆర్డర్ లో వచ్చిన ఇక్రామ్ 58 పరుగులు చేసి స్కోరు బోర్డులో రన్ రేట్ పడిపోకుండా చూసుకున్నాడు. చివర్లో రషీద్, ముజీబ్ మెరుపులు తోడవడంతో ఆఫ్గాన్ 285 పరుగుల భారీ టార్గెట్ ను ఇంగ్లాండ్ ముందు ఉంచింది. అయితే ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ మూడు వికెట్లు పడగొట్టాడు. మార్క్ ఉడ్ రెండు వికెట్లు తీసుకున్నాడు.  


సెకండ్ బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లండ్ అప్పటికే మానసికంగా ఓటమికి సిద్ధమై ఉన్నట్టుగా కనిపించింది. ఇది నిజమే అన్నట్టుగానే రెండో ఓవర్ లో బెయిర్ స్టో (2) అవుట్ అయ్యాడు. తర్వాత 6.5 ఓవర్ల దగ్గర రెండో వికెట్ జోయ్ రూట్ (11) పడింది. అలా క్రమం తప్పకుండా పడుతూనే వెళ్లాయి. తర్వాత సీరియల్ లో డేవిడ్ మలన్ (32), జాస్ బట్లర్ (9) వికెట్లు పడ్డాయి. అప్పటికి 17 ఓవర్లు అయ్యేసరికి 91 పరుగులు, 4 వికెట్లతో ఇంగ్లాండ్ స్కోరు బోర్డు ఉంది. తర్వాత నుంచి ఏ దశలోనూ కోలుకోలేదు.

హ్యారీ బ్రూక్ 66 పరుగులు చేసి 8వ వికెట్టుగా వెనుతిరిగాడు. తనొక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అతనికి సపోర్ట్ ఇచ్చేవారే కరవయ్యారు. చివరికి 215 పరుగుల వద్ద ఇంగ్లాండ్ కథ ముగిసింది.అఫ్గానిస్తాన్ బౌలర్లలో ముజీబుల్ రెహ్మాన్ 3 , రషీద్ ఖాన్ 2, మహ్మద్ నబీ 2 వికెట్లు పడగొట్టారు.ఈ మ్యాచ్ లో ఆల్ రౌండర్ ప్రదర్శనకు ముజీబుర్ రెహ్మాన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. పాయింట్ల పట్టికలో చూసుకుంటే ఇంగ్లండ్ రెండు మ్యాచుల్లో ఓటమి పాలై 5వ స్థానంలో ఉంది. ఆఫ్గానిస్తాన్ కూడా రెండు మ్యాచులు ఓడి 6వ స్థానంలో ఇంగ్లాండ్ వెనుకే ఉంది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×