
AFGHANISTHAN FAILURE STORY: వరల్డ్ కప్ లో సంచలనం నమోదైందని అందరూ అంటున్నారు. ఆఫ్గనిస్తాన్ గెలిచింది, ఇంగ్లండ్ ఓడిందని చెబుతున్నారు. కానీ అంతకుముందు ఆఫ్గాన్ ప్రపంచ కప్ మ్యాచుల్లో 14 వరుస ఓటములతో నిలిచి ఉందనే సంగతి చాలా తక్కువమందికే తెలుసు. 2015 ప్రపంచకప్ లో తొలిసారి ఆడిన ఆఫ్గాన్ స్కాట్లాండ్ పై విజయం సాధించింది. తర్వాత ఏ వరల్డ్ కప్ లోనూ విజయం సాధించలేదు. మళ్లీ 2023లో ఇదే గెలుపు… అది కూడా గత వరల్డ్ కప్ విజేత ఇంగ్లండ్ మీద గెలవడంతో ఆఫ్గాన్ టీమ్ ఇప్పుడు మంచి జోష్ మీద ఉంది.
నిజానికెంతో స్ఫూర్తిమంతంగా వారు ఆడారని అందరూ కొనియాడుతున్నారు. వీరిని చూసి అందరూ నేర్చుకోవాల్సినది ఎంతో ఉందని వ్యక్తిత్వ వికాస నిపుణులు వ్యాక్యానిస్తున్నారు. పరీక్షలో ఫెయిల్ అయ్యామని విద్యార్థులు, ఉద్యోగాలు రావడం లేదని నిరుద్యోగులు..ఈరోజున ఆఫ్గాన్ ని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని చెబుతున్నారు.
క్రీజులోకి రావడం రావడమే ఒక అదురు లేదు, బెదురు లేదు. ధైర్యంగా ఆడారు, అంతకన్నా ధైర్యంగా బౌలింగ్ చేశారు. ఈరోజు మ్యాచ్ లో వారెంతో ఆత్మవిశ్వాసంతో కనిపించారు. అదే వారి విజయానికి కారణమైంది. ఇది ప్రతీ ఒక్కరిలో ఉంటే గెలుపు దానంతటదే వస్తుందనడానికి ఈరోజు గెలిచి చూపించిన ఆఫ్గాన్ ఒక ఉదాహరణ అని క్రీడా పండితులు అంటున్నారు.
ఎప్పుడూ ఓడిపోతామనే భావనే మదిలోకి రానివ్వకూడదని చెబుతున్నారు. గెలవగలం, గెలుస్తామనే పాజిటివ్ ద్రక్పథంతో వెళితే రిజల్ట్ దానంతటదే వస్తుందని అంటున్నారు. మ్యాచ్ కి ముందు లేదా పరీక్షకి ముందు లేదా ఇంటర్వ్యూకి ముందు నెగిటివ్ గా మాట్లాడటం, మన గెలుపు మీద మనకే నమ్మకం లేనట్టు ఉండటం, జోక్స్ కట్ చేయడం లాంటివి చేస్తే, 50శాతం అక్కడే మానసికంగా ఓడిపోయినట్టు అని రవిశాస్త్రి చెబుతుంటాడు. చివరి వరకు గెలవగలమనే నమ్మకంతోనే ఉంటే…ధోనీలా అద్భుతాలు చేయవచ్చునని చెబుతున్నాడు. ఈరోజు ఆఫ్గాన్ మ్యాచ్ అందుకు ఉదాహరణ అని , ఇది ఆఫ్గాన్ ఫెయిల్యూర్ స్టోరీ అని నెటిజన్లు కితాబు ఇస్తున్నారు.