BigTV English

Shubman Gill : గిల్ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా…. టీవీలో చూస్తూనే ప్రేమిస్తున్న యువతి

Shubman Gill : గిల్ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా…. టీవీలో చూస్తూనే ప్రేమిస్తున్న యువతి

Shubman Gill : టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో  గిల్ 147 పరుగులు చేసిన విషయం తెలిసిందే.  ముఖ్యంగా టీమిండియా బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇటీవలే తమ టెస్ట్ కెరీర్ కి ఒకరి తరువాత మరొకరూ కొద్ది రోజుల వ్యవధిలోనే వీడ్కోలు పలికారు. ఇక ఆ తరువాత  సెలెక్టర్లు యువ బ్యాటర్ శుబ్ మన్ గిల్ కి సారథ్య బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం గిల్ సేన ఇంగ్లాండ్ తో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తోంది. లీడ్స్ లోని హెడింగ్లీ మైదానంలో ఇవాళ నాలుగో రోజు మ్యాచ్ జరుగుతోంది. టీమిండియా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తోంది. ప్రస్తుతం కే.ఎల్. రాహుల్ 71 పరుగులు చేశాడు. బ్యాటింగ్ చేస్తున్నాడు. అలాగే  వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ 27 పరుగులు చేశాడు.


Also Read : rohit sharma: ఎలా ఉన్నారు ? హర్భజన్ కు తెలుగు నేర్పిస్తున్న రోహిత్.. వీడియో చూస్తే నవ్వుకోవాల్సిందే

గిల్ ను టీవీలో చూస్తూ..


ఇక టీమిండియా మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొలి ఇన్నింగ్స్ 101 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. సాయి సుదర్శన్ తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ గా వెనుదిరగగా.. రెండో ఇన్నింగ్స్ లో 30 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో స్టోక్స్ బౌలింగ్ లో ఔట్ కాగా.. రెండో ఇన్నింగ్స్ లో సైతం స్టోక్స్ బౌలింగ్ లోనే ఔట్ అయ్యాడు సాయి సుదర్శన్. ఇక కెప్టెన్ గిల్ తొలి ఇన్నింగ్స్ లో 147 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో 8 పరుగులకే ఔట్ అయ్యాడు. అయినప్పటికీ కెప్టెన్ గిల్ కి మాత్రం క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఓ యువతి ఏకంగా గిల్ ఇంగ్లాండ్ తో మ్యాచ్ ఆడుతున్న సమయంలో టీవీలో చూస్తూ ప్రేమిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గిల్ పై ప్రశంసల వర్షం.. 

సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా టీమిండియా రాణిస్తుందా..? అని అనుమానాలు కలుగుతున్న సమయంలో తొలి ఇన్నింగ్స్ లో కెప్టెన్ శుబ్ మన్ గిల్ సెంచరీ, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ సెంచరీ, యశస్వి జైస్వాల్ సెంచరీ చేసి టీమిండియా భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 41 పరుగుల తేడాతో 7 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 465 పరుగులు చేసింది.  48 ఓవర్లలో 159 పరుగులు చేసింది. కే.ఎల్. రాహుల్ 72, రిషబ్ పంత్ 31 పరుగులు చేేాశాడు. ప్రస్తుతం లంచ్ బ్రేక్ అయింది. లంచ్ బ్రేక్ సమయానికి ఇవాళ ఒక్క వికెట్ కూడా కోల్పోయింది.  ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ శుబ్ మన్ గిల్ పై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి టీమిండియా ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధిస్తుందో లేదో రేపటి వరకు ఎదురు చూడాల్సిందే.

Related News

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

Murli vijay : ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురితో విజయ్ సీక్రెట్ రిలేషన్.. సముద్రాలు దాటి!

Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Big Stories

×