BigTV English

FIFA Worldcup : ఫలించిన మెస్సి కల.. ఫుట్‌బాల్‌ ప్రపంచ విజేత అర్జెంటీనా.. ఫైనల్లో ఫ్రాన్స్‌పై విజయం..

FIFA Worldcup :  ఫలించిన మెస్సి కల.. ఫుట్‌బాల్‌ ప్రపంచ విజేత అర్జెంటీనా.. ఫైనల్లో ఫ్రాన్స్‌పై విజయం..

FIFA Worldcup : ఫుట్ బాల్ సూపర్‌స్టార్‌ మెస్సి కల సాకారమైంది. అర్జెంటీనా మూడున్నర దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. ఫిఫా వరల్డ్ కప్ ను అర్జెంటీనా కైవసం చేసుకుంది. అనేక మలుపులు తిరుగుతూ ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ను షూటౌట్లో 4-2తో ఓడించి టైటిల్ సాధించింది. అర్జెంటీనా తరఫున మెస్సి రెండు (23 నిమిషంలో, 108 నిమిషంలో ) గోల్స్‌ కొట్టాడు. డిమారియా (36వ నిమిషంలో) ఓ గోల్‌ సాధించాడు. ఫ్రాన్స్‌ తరఫున స్టార్‌ ఆటగాడు ఎంబాపె సంచలన ప్రదర్శనతో మ్యాచ్ ను ఉత్కంఠభరితంగా మార్చాడు. మొత్తం మూడు గోల్సూ (80వ నిమిషం, 81 నిమిషం, 118 నిమిషం ) కొట్టినా జట్టును గెలిపించుకోలేకపోయాడు. అర్జెంటీనా చివరిసారి 1986లో మారడోనా నేతృత్వంలో ప్రపంచకప్‌ సాధించింది. మొత్తంగా ఆ జట్టు మూడోసారి విజేతగా నిలిచింది.


ఫస్టాప్ అదుర్స్
ఫైనల్ లో మొదటి నుంచి అర్జెంటీనా అన్ని విభాగాల్లోనూ పూర్తిగా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. చురుగ్గా కదిలిన అర్జెంటీనా ఆటగాళ్లు ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఒత్తిడికి గురి చేశారు. సూపర్‌స్టార్‌ మెస్సి కాళ్లతో మాయ చేశాడు. ఫ్రాన్స్‌ ప్రథమార్థంలో దూకుడుగా ఆడలేకపోయింది. ఎంబాపె సహా ఫ్రాన్స్‌ ఫార్వర్డ్‌ల ప్రభావమే కనపడలేదు. అర్జెంటీనా ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ఫ్రాన్స్‌ జోరు పెంచడానికి ప్రయత్నించినా.. ప్రత్యర్థి అర్ధభాగంలో బంతిని నియంత్రణలో ఉంచుకోలేకపోయింది. దీంతో అర్జెంటీనా 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

సెకండాఫ్ టెన్షన్..టెన్షన్..
సెకండాఫ్ లో అర్జెంటీనా దూకుడుగా ఆరంభించింది. ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఎటాక్‌లు కొనసాగించింది. ఫ్రాన్స్‌ గోల్‌కీపర్‌కు పని కల్పించింది. క్రమంగా ఫ్రాన్స్‌ దూకుడు పెంచింది. 79 నిమిషాల తర్వాత కూడా అర్జెంటీనా 2-0తో ఆధిక్యంలో ఉండటంతో ఆ జట్టు గెలుపు ఖాయమే అనిపించింది. కానీ 97 సెకన్ల వ్యవధిలో ఆట స్వరూపమే మారిపోయింది. స్టార్‌ ఆటగాడు ఎంబాపె చకచకా రెండు గోల్స్‌ కొట్టి ఫ్రాన్స్‌ను పోటీలోకి తెచ్చాడు. ఫ్రాన్స్‌ జట్టు మెస్సి సేనను ఇంజురీ సమయంలో మరింత కలవరపెట్టింది. కానీ ఆ జట్టు ప్రయత్నాలను అర్జెంటీనా అడ్డుకోవడంతో ఆట అదనపు సమయానికి వెళ్లింది.


అదనపు సమయంలోనూ అదే ఉత్కంఠ
అదనపు సమయం కూడా మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. 108వ నిమిషంలో గోల్‌తో మెస్సి అర్జెంటీనాను తిరిగి ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. కానీ మరికొన్ని నిమిషాల్లో అదనపు సమయం ముగుస్తుందనగా అర్జెంటీనా పెనాల్టీని సమర్పించుకుంది. దాన్ని ఎంబాపె సద్వినియోగం చేయడంతో స్కోరు 3-3తో సమమమైంది. ఉత్కంఠను మరింత పెంచుతూ ఆట షూటౌట్‌కు దారి తీసింది.

షూటౌట్ సాగిందిలా..
షూటౌట్లో అర్జెంటీనా గోల్‌కీపర్‌ ఎమిలియానో మార్టినెజే హీరో గా నిలిచాడు. ఫ్రాన్స్‌ తరఫున మొదటి పెనాల్టీని ఎంబాపె సద్వినియోగం చేయగా.. ఆ తర్వాత అర్జెంటీనా తరఫున మెస్సి స్కోర్‌ చేశాడు. ఆ తర్వాత ఫ్రాన్స్‌ తరఫున కోమన్‌ (రెండో పెనాల్టీ), చౌమని (మూడో పెనాల్టీ) వరుసగా విఫలమయ్యారు. అర్జెంటీనా తరఫున రెండు, మూడో ప్రయత్నాల్లో డిబలా, పరేదెస్‌ విజయవంతం కావడంతో ఆ జట్టు 3-1తో ఆధిక్యంలో నిలిచింది. నాలుగో పెనాల్టీని సద్వినియోగం చేయడం ద్వారా కోలో మౌని ఫ్రాన్స్‌ ఆశలను (2-3) సజీవంగా ఉంచాడు. కానీ తర్వాత మాంటియల్‌.. ఫ్రాన్స్‌ గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించడంతో ప్రపంచకప్‌ అర్జెంటీనా సొంతమైంది.

హీరోలు వీరే
బంగారు బూటు (అత్యధిక గోల్స్‌)- ఎంబాపె (ఫ్రాన్స్‌)
బంగారు బంతి (ఉత్తమ ఆటగాడు)- మెస్సి
బంగారు గ్లోవ్స్‌ (ఉత్తమ గోల్‌కీపర్‌)- ఇ.మార్టినెజ్‌ (అర్జెంటీనా)
ఉత్తమ యువ ఆటగాడు- ఎంజో ఫెర్నాండెజ్‌ (అర్జెంటీనా)

Related News

Dhoni on Virat : కోహ్లీ పెద్ద జోకర్.. ధోని హాట్ కామెంట్స్ వైరల్!

Night watchman : టెస్ట్ క్రికెట్ లో అసలు నైట్ వాచ్మెన్ అంటే ఎవరు.. వాళ్ల డ్యూటీ ఏంటి

Shreyas Iyer: శ్రేయస్‌కు మరోసారి నిరాశే.. ఆసియా కప్‌ జట్టులో నో ఛాన్స్ ?

BCCI : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు BCCI బిగ్ షాక్…2027 వరల్డ్ కప్ కంటే ముందే కుట్రలు !

Sanju Samson – CSK : సంజూకు ఝలక్.. CSK లోకి అతను వచ్చేస్తున్నాడు!

Digvesh Rathi : దిగ్వేష్ ఒక్కడే పిచ్చోడు అనుకున్నాం.. కానీ వాడిని మించినోడు వచ్చాడు.. ఈ వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

Big Stories

×