BigTV English

India’s Paralympic Champions: పారాలింపిక్స్ విజేతలకు.. మోదీ మార్క్ ఆతిథ్యం

India’s Paralympic Champions: పారాలింపిక్స్ విజేతలకు.. మోదీ మార్క్ ఆతిథ్యం

India’s Paralympic Champions: రాజకీయాలను డిఫరెంటుగా ప్లాన్ చేయడంలో మోదీని మించినవారు లేరని అంటారు. ప్రజలు ఎక్కడ ఎక్కువగా ఆకర్షితులవుతుంటే ఆయనక్కడ ప్రత్యక్షమవుతుంటారు. ఇటీవల టీ 20 ప్రపంచకప్ గెలిచిన క్రికెటర్లతో చిట్ చాట్ చేసిన మోదీ, తర్వాత ఒలింపిక్స్ విజేతలను అభినందించారు. చాలా సందర్భాల్లో ప్రత్యేకంగా ఫోన్లు కూడా చేసి మాట్లాడారు. అలాగే వినేశ్ ఫోగట్ ని ఓదార్చారు.


ఇప్పుడు పారాలింపిక్స్ లో భారత దేశ కీర్తి పతాకాన్ని ఘనంగా ఎగురవేసిన అథ్లెట్లకు ప్రధాని మోదీ ఆతిథ్యమిచ్చారు. ప్రత్యేకంగా వారిని పేరుపేరునా అభినందించారు. గురువారం ఢిల్లీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వారితో ముచ్చటించారు.

పతకాలు సాధించిన విజేతలను మోదీ కొనియాడుతూ కనిపించే 43 సెకన్ల వీడియోను క్రీడా మంత్రిత్వ శాఖ నెట్‌లో పోస్టు చేసింది. ఇందులో కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్‌ మాండవ్య, భారత పారాలింపిక్‌ కమిటీ (పీసీఐ) అధ్యక్షుడు దేవేంద్ర జఝారియా కూడా ఉన్నారు.


పారా అథ్లెట్లు తమ ఆనందాన్ని రకరకాలుగా వ్యక్తీకరించారు. 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన అవనీ లేఖరా ‘మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు’ అని రాసిన టీ-షర్ట్‌ను ప్రధానికి బహుమతిగా ఇచ్చింది. తెలుగమ్మాయి కాంస్యం సాధించిన జీవాంజి దీప్తిని ప్రధాని పలకరించారు.

Also Read: సరిపోయారు.. ఇద్దరికిద్దరూ! బాయ్ ఫ్రెండ్ తో హార్దిక్ మాజీ భార్య నటాషా

పలువురు ప్రధాని మోదీతో కలిసి ప్రత్యేకంగా ఫొటోలు దిగారు. మోదీని చూసిన ఆనందంలో అథ్లెట్లు ఉబ్బితబ్బిబ్బయ్యారు. కొందరు సరదాగా కూడా మాట్లాడారు. అంటే ప్రధానితో మాట్లాడుతున్నామన్నా బిడియం కూడా లేకుండా జావెలిన్‌ త్రోయర్‌ సుమిత్‌ అంటిల్‌ జోక్స్ వేసి మోదీని కూడా నవ్వించాడు.

ఇక్కడే మరో సరదా సంఘటన కూడా జరిగింది. పసిడి సాధించిన మరగుజ్జు జావెలిన్‌ త్రోయ ర్‌ నవ్‌దీప్‌ సింగ్‌.. తన మనసులో కోరికను మోదీకి తెలిపాడు. ఆయన కూడా ఏమిటి సంగతి? అని అడిగితే.. మీకు క్యాప్ ని బహుకరించాలని అనుకుంటున్నట్టు తెలిపాడు. దాంతో నవదీప్ పొట్టివాడు కావడంతో మోదీ ఏకంగా నేలపై కూర్చుండిపోయారు.

ఇప్పుడు నువ్వే టోపీ పెట్టమని అడిగారు. అంతేకాదు.. ఇప్పుడు నువ్వు నాకంటే పొడుగ్గా ఉన్నట్టు అనిపిస్తోందా’ అని నవ్వుతూ అన్నారు. దాంతో ఒక్కసారి నవ్వులు పువ్వులు పూశాయి. అనంతరం.. తను ఎడమ చేతితో త్రో చేస్తుంటాడు. దానిపై ఆటోగ్రాఫ్‌ ఇవ్వాలని మోదీని కోరాడు. వెంటనే మోదీ చకచకా సంతకం పెట్టారు.

అనంతరం ప్రధాని మోదీ ప్రతి అథ్లెట్‌ విజయగాథలను అడిగి మరీ తెలుసుకొన్నారు. వారందరికీ తప్పకుండా తన తరఫున మద్దతు ఉంటుందని, దేశ ప్రతిష్టను నిలిపిన మీరందరూ భరతమాత ముద్దుబిడ్డలని కొనియాడారు.

ఇటీవలే ముగిసిన పారిస్‌ పారాలింపిక్స్‌లో భారత్‌ 7 స్వర్ణ, 9 రజత, 13 కాంస్యాలతో మొత్తం 29 పతకాలు సాధించడమే కాదు.. ఓవరాల్‌గా 18వ స్థానంలో నిలిచింది.

Related News

India vs Pakistan, Final: పాకిస్థాన్ కు ఘోర అవ‌మానం..ఫోటో షూట్ కు సూర్య డుమ్మా…వేయిట్ చేస్తున్న స‌ల్మాన్ ?

Harshit Rana – Gambhir : టీమిండియాకు అస‌లు విల‌న్‌ హర్షిత్ రాణానే..గంభీర్ వ‌ల్లే ఈ చెత్త ప్లేయ‌ర్ ఆడుతున్నాడంటూ ట్రోలింగ్‌

IND VS PAK, Final: ఫైన‌ల్ కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ‌..అభిషేక్ శర్మ, పాండ్యా ఔట్ ?

Asia Cup 2025 : దాసున్ షనకా చేసిన ఈ ఒక్క డైవ్ శ్రీలంక కొంప ముంచింది.. జయ సూర్య లేచి మరి వార్నింగ్ ఇచ్చాడు

Dasun Shanaka Run Out: సూప‌ర్ ఓవ‌ర్ లో టీమిండియాకు అన్యాయం…రనౌట్ అయినా షనకా నాటౌట్‌..రూల్స్ ఏం చెబుతున్నాయి?

Pathum Nissanka Six: నిస్సంక భ‌యంక‌ర‌మైన సిక్స్‌…తుక్కు తుక్కైన‌ కారు..త‌ల‌ప‌ట్టుకున్న గంభీర్‌

IND Vs SL : ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ లో సూపర్ ఓవర్… ఎవరు గెలిచారంటే

Asia Cup 2025 : ఆసియా కప్ ఫైనల్స్ కు ముందు షాక్…సూర్య, రవూఫ్‌కు 30% ఫైన్

Big Stories

×