E-Paper
Advertisement

WPL 2024 Final Match Highlights: ఢిల్లీ జట్టు 64/0 కట్ చేస్తే..113 కి ఆలౌట్: ఏం మాయ జరిగింది..?

WPL 2024 Final Match Highlights: ఢిల్లీ జట్టు 64/0 కట్ చేస్తే..113 కి ఆలౌట్: ఏం మాయ జరిగింది..?
Advertisement

DC vs RCB WPL Final Highlights

DC vs RCB WPL Final Match Highlights: ఉమెన్స్ ఐపీఎల్ 2024 రెండో సీజన్ విజేతగా ఆర్సీబీ నిలిచింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ తీసుకుంది. 7 ఓవర్లు గడిచాయి. ఓపెనర్లు ఇద్దరూ బాగా ఆడుతున్నారు. కెప్టెన్ మెగ్ లానింగ్ (23), షఫాలి వర్మ (44) మంచి బిగినింగ్ ఇచ్చారు. ఢిల్లీ స్కోరు అప్పుడు 64 పరుగుల మీద ఉంది.  ఇంక ఆర్సీబీ పనైపోయిందని అంతా అనుకున్నారు. ఇలాగే ఉంటే ఢిల్లీ 180 పరుగులైనా చేస్తుందనుకున్నారు.

Advertisement

8వ ఓవర్ స్టార్ట్ అయ్యింది. సోఫీ మోలినిక్స్ బౌలింగ్. అంతవరకు బ్రహ్మాండంగా ఆడుతున్న షఫాలీ వర్మ లాంగ్ ఆన్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యింది. తర్వాత వచ్చిన జెమిమా, అలైస్ కాప్సీ వెంటవెంటనే అవుట్ అయిపోయారు. అంటే ఆ ఓవర్ లో కేవలం ఒక్క పరుగిచ్చి మూడు వికెట్లు టపాటపా పడగొట్టింది.

అదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అయ్యింది. తర్వాత శ్రేయాంక పాటిల్ పట్టు సడలనవ్వలేదు. 4 వికెట్లు పడగొట్టింది. అలా ఢిల్లీ క్యాపిటల్స్ ని ఎక్కడా కోలుకోకుండా ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.

Advertisement

Also Read: కప్ ఎగరేసుకుపోయిన బెంగళూరు.. ఉమెన్స్ ఐపీఎల్ విజేత ఆర్సీబీ..

వికెట్లు ఏమీ పడకుండా 7 ఓవర్లలో 64 పరుగులు చేసిన జట్టు, తర్వాత చూస్తే 18.3 ఓవర్లలో 49 పరుగులు చేసి ఆలౌట్ అయిపోయింది. పోనీ జాగ్రత్తగా ఆడి ఉన్నా, మిగిలిన 9 బాల్స్ లో కనీసం 20 పరుగులైనా వచ్చేవి కదాని సీనియర్లు వ్యాక్యానిస్తున్నారు.

ఎవరు చెప్పారో గేమ్ ప్లాన్ రాంగ్ ఆడారని అంటున్నారు. కనీసం చివరి వరకు ఆడి ఉంటే, ఆర్సీబీకి కొంచెం టెన్షన్ ఉండేది. వీళ్లు ఒత్తిడిలో పడి, ఆర్సీబీకి ఒత్తిడి లేకుండా చేశారని అంటున్నారు. చాలా సులువుగా మ్యాచ్ వదిలేసుకున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

సరే, వికెట్లు పడితే పడుతున్నాయి.. కనీం 20 ఓవర్లు ఆడాలనే కాన్సెప్ట్ మరిచిపోయారని చెబుతున్నారు. ఒకవేళ అలా సమయస్ఫూర్తితో ఆడి ఉంటే, నిజంగానే ఆర్సీబీకి మ్యాచ్ టైట్ అయ్యేదని అంటున్నారు. వాళ్లు కూడా అదే స్కోరు చేయడానికి ఆఖరి ఓవర్ వరకు తెచ్చుకున్నారని గుర్తు చేస్తున్నారు.

ఏమైతేనేం ఢిల్లీ క్యాపిటల్స్ పై బెంగళూరు 8 వికెట్ల తేడాతో గెలిచి కప్ పట్టుకుపోయింది. ఓటమి అనంతరం ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ కన్నీటి పర్యంతమైంది. తనని చూసి తోటి అమ్మాయిలు భావోద్వేగానికి గురయ్యారు. ఖండాంతరాలు వేరైనా అమ్మాయిలు, అమ్మాయిలే కదా.. వారికి బాధొచ్చినా తట్టుకోలేరని.. ఇదంతా పార్ట్ ఆఫ్ గేమ్ అంటూ నెటిజన్లు ఓదార్చుతున్నారు.

Tags

Related News

టీమిండియా-పాక్ మ‌ధ్య ఓ సిరీస్ నిర్వ‌హించండి..ICCకి షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న లేఖ

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

Big Stories

Advertisement
×