Actress Arundhati Nair Severely Injured in Road Accident: ప్రముఖ నటి, హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డుప్రమాదానికి గురైంది. ప్రస్తుతం ఆమె చావు బ్రతుకుల మధ్య ఉందని, బ్రతకాలని పోరాటం చేస్తోందని ఆమె సన్నిహితులు తెలిపారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న అరుంధతి నాయర్ కు మెరుగైన చికిత్సకు మరిన్ని డబ్బు అవసరమవుతుందని, దాతలు సహాయం చేయాలని స్నేహితులు కోరారు.
ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అనంతరం ఆమె తన సోదరుడితో కలిసి బైక్ పై ఇంటికి వెళ్తుంది. అదే సమయంలో వేగంగా వచ్చి ఒక కారు వారి స్కూటీని ఢీ కొట్టడంతో ఇద్దరూ తీవ్రగాయాల పాలయ్యారు. ఆ యాక్సిడెంట్ లో గాయపడిన అరుంధతి ప్రస్తుతం చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. వెంటిలేటర్ పై చికిత్స పొందుతోంది. ఈ విషయాన్ని ఆమె స్నేహితురాలు, నటి గోపిక అనిల్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
“నా స్నేహితురాలు అరుంధతి ఒక యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి క్రిటకల్ గా ఉంది. వెంటిలేటర్ పై చికిత్స పొందుతోంది. మెరుగైన చికిత్స అందించేందుకు ఆమె కుటుంబానికి అంత స్థోమత లేదు. రోజువారీ ఆస్పత్రి బిల్లు కట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మేము మా వంతు సహాయం చేసినా.. అది సరిపోవడం లేదు. అరుంధతిని బ్రతికించుకునేందుకు మీరు కూడా మీకు తోచినంత సహాయం చేస్తే.. అది మెరుగైన చికిత్సకు ఉపయోగపడుతుంది.” అని పేర్కొన్న గోపిక.. బ్యాంక్ వివరాలను కూడా ఇచ్చింది.
Also Read: ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్.. వాళ్లదే హవా
కాగా.. అరుంధతి పొంగి ఎలు మనోహర్ అనే సినిమాతో 2014లో వెండితెరకు నటిగా పరిచయమైంది. విరుమాండికుమ్ శివానందికమ్, సైతాన్, పిస్తా, ఆయిరం పోర్కాసుకల్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. మలయాళ ఇండస్ట్రీకి ఒట్టకోరు కాముకన్ అనే చిత్రంతో పరిచయమైందామె. పద్మిని, డోంట్ థింక్ అనే వెబ్ సిరీస్ లలోనూ అరుంధతి నాయర్ నటించింది.