BigTV English

Rinku Singh : లక్ అంటే రింకూదే… ఎంగేజ్మెంట్ కాగానే… భార్య నుంచి కోట్ల ఆస్తులు కొట్టేశాడు !

Rinku Singh : లక్ అంటే రింకూదే… ఎంగేజ్మెంట్ కాగానే… భార్య నుంచి కోట్ల ఆస్తులు కొట్టేశాడు !

Rinku Singh : క్రికెటర్ రింకూసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవలే అతను సమాజ్ వాది పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ తో నిశ్చితార్థం జరిగింది. వీరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. అఖిలేష్ యాదవ్, జయ వంటి రాజకీయ పెద్దలు హాజరయ్యారు. మరోవైపు ప్రముఖ క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ కూడా హాజరయ్యారు. వీరి నిశ్చితార్థంలో చేసిన డ్యాన్స్ వీడియో తెగ వైరల్ అయింది. ఇక ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ముఖ్యంగా మొన్న ఎంగేజ్మెంట్ కాగానే అన్ని ఆస్తులు… తన భార్య నుంచి కొట్టేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


Also Read : Cricket History : అసలు క్రికెట్ గార్డ్, హెల్మెట్ ఎలా వచ్చాయి.. ఎప్పుడు తీసుకువచ్చారో తెలుసా

క్రికెటర్ రింకూ సింగ్.. ఎంపీ ప్రియా సరోజ్ ఎంగేజ్ మెంట్ జూన్ 08న లక్నోలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగింది. అదేవిధంగా వీరిద్దరూ నవంబర్ లో వివాహం చేసుకోనున్నారు. వీరిద్దరి పెళ్లి విషయం ఈ ఏడాది జనవరిలో తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని ఎంపీ ప్రియా తండ్రి.. సమాజ్ వాద్ పార్టీ ఎమ్మెల్యే తూఫానీ సరోజ్ ధృవీకరించారు. రింకూ, ప్రియాల పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని ఆయన తెలిపారు. 27 ఏళ్ల రింకూసింగ్ భారత టీ-20 జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ ఉత్తర ప్రదేశ్ క్రికెటర్ టీమిండియా తరపున 30 టీ-20లు, రెండు వన్డేలు ఆడాడు. అలాగే 26 ఏళ్ల ప్రియా ప్రస్తుతం యూపీలోని మచిలీ షాహర్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీ గా కొనసాగుతున్నారు. ప్రియా సరోజ్ ఎంపీ మాత్రమే కాకుండా ఆమె న్యాయవాది వృత్తిలో కూడా కొనసాగుతున్నారు. 


దాదాపు 300 మంది అతిథుల సమక్షంలో వీరి ఎంగేజ్ మెంట్ కార్యక్రమం జరిగింది. నిశ్చితార్థంలో ముఖ్యంగా ట్రెడిషనల్ డ్రెస్ లో రింకుసింగ్.. ప్రియా సరోజ్ ఇద్దరూ కనిపించారు. 300 మంది సమక్షంలోనే రింగ్ లు మార్చుకున్నారు. నవంబర్ 187న వారణాసిలో వీరి పెళ్లి జరుగనుంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. రింకు సింగ్ కి భారీగానే సమాజ్ వాది పార్టీ పార్లమెంట్ సభ్యులు ప్రియా సరోజ్ కుటుంబం కట్నం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎంగేజ్ మెంట్ కాగానే కోట్లాది ఆస్తులు కట్టబెట్టినట్టు తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ లో ఉన్న ఖరీదైన ప్లాట్ తో పాటు బంగారం, అలాగే నగదు కూడా ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని మచిలీ షాహర్ నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రియా సరోజ్. ఇక ఎంగేజ్ మెంట్ కోసం రింకూ సింగ్  ప్రత్యేక ఉంగరం తయారు చేయించాడు. ముంబై నుంచి ఓ స్పెషల్ రింగ్ తెప్పించాడు రింకూ. దీని ఖరీదు దాదాపు రూ.2.5లక్షలు అని సమాచారం. అదేవిధంగా రింకూ కి   కోత్ కతా నుంచి ఓ డిజైనర్ రింగ్ తెప్పించింది ప్రియా. ఎంగేజ్ మెంట్ కాగానే భార్య కుటుంబం నుంచి భారీగానే ఆస్తులు కొట్టేశాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.

?igsh=amV5bTBuM21ncnc5


Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×