BigTV English

OTT Movie : 16 ఏళ్ల అమ్మాయి కిడ్నాప్ కేసులో అదిరిపోయే ట్విస్టులు… ఊహించని మలుమపులు

OTT Movie : 16 ఏళ్ల అమ్మాయి కిడ్నాప్ కేసులో అదిరిపోయే ట్విస్టులు… ఊహించని మలుమపులు

OTT Movie : ఇటలీలోని ఆల్ప్స్ పర్వతాల్లోని అవెచోట్‌ అనే ఒక చిన్న గ్రామం, పొగమంచుతో నిండి ఉంటుంది. 16 ఏళ్ల అన్నా లౌ కాస్ట్‌నర్ అనే అమ్మాయి, క్రిస్మస్‌కు రెండు రోజుల ముందు చర్చికి వెళ్తూ మాయమవుతుంది. ఈ గ్రామంలో ప్రఖ్యాత డిటెక్టివ్ వోగెల్ (టోని సెర్విల్లో) ఈ కేసును పరిష్కరించడానికి రంగంలోకి దిగుతాడు. కానీ అతడు వింత స్వభావం గల మనిషి. ఇతని ఇన్వెస్టిగేషన్ లో కొన్ని రహస్యాలు బయటపడతాయి. వోగెల్ తెలుసుకున్న నిజాలు ఏమిటి ? అన్నా లౌను కిడ్నాప్ చేసిన నేరస్థుడు ఎవరు? ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళితే

ఈ స్టోరీ ఇటలీలోని అవెచోట్‌ అనే గ్రామంలో జరుగుతుంది. ఇది పొగమంచుతో కప్పబడిన పర్వత ప్రాంతంలో ఉంటుంది. 16 ఏళ్ల అన్నా లౌ కాస్ట్‌నర్ మతపరమైన కుటుంబానికి చెందిన అమ్మాయి. ఇంటి నుండి చర్చికి వెళ్లే సమయంలో కనిపించకుండా పోతుంది. ఆమె తల్లిదండ్రులు తన గురించి ఆందోళన చెందుతారు. ఈ కేసు మీడియాలో కూడా సంచలనంగా మారుతుంది. ఈ కేసును వోగెల్ అనే వివాదాస్పద డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. వోగెల్ గతంలో ఒక కేసులో తప్పుడు అనుమానితుడిని అరెస్ట్ చేసి, అతని జీవితాన్ని నాశనం చేసిన చరిత్ర కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈ కేసు ఎలా హ్యాండిల్ చేస్తాడో అని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తారు.


వోగెల్ తన సహాయకుడు బోర్ఘి (లోరెంజో రిచెల్మీ)తో కలిసి గ్రామంలో విచారణ ప్రారంభిస్తాడు. అతను సాంప్రదాయ ఫోరెన్సిక్ పద్ధతులను పాటించకుండా, మీడియాను ఉపయోగించి పబ్లిక్ పై ఒత్తిడి పెంచి నేరస్థుడిని బయటకు రప్పించాలని చూస్తాడు. అతను స్థానిక పోలీసులను మారు వేషంలో దుస్తులు ధరించి, అడవుల్లో వెతకమని ఆదేశిస్తాడు. ఈ కేసు మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ కేసు విచారణలో, అతను స్థానిక హైస్కూల్ టీచర్ లోరిస్ మార్టినీ (అలెసియో బోని)ని ప్రధాన అనుమానితుడిగా గుర్తిస్తాడు. మార్టినీ ఇటీవల ఆ గ్రామానికి వచ్చి ఉంటాడు. అతని కారు అన్నా మాయమైన రోజు ఆమె ఇంటి సమీపంలో కనిపించింది. ఈ క్రమంలో మార్టినీని నేరస్థుడిగా నిర్ధారించడానికి ఆధారాలను మానిపులేట్ చేయడం ప్రారంభిస్తాడు వోగెల్. కానీ ఆధారాలు బలహీనంగా ఉంటాయి. అయితే

ఇప్పుడు స్టోరీ ఇప్పుడు ఒక మలుపు తిరుగుతుంది. వోగెల్ కి ఒక కారు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్ కి వెళతాడు . అక్కడ ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ ఫ్లోరెస్‌తో మాట్లాడుతూ, ఈ కేసు వివరాలను అతనితో చర్చిస్తాడు. అన్నాలౌ కేసుకి, 30 సంవత్సరాల క్రితం ఆ గ్రామంలో కనిపించకుండా పోయిన ఆరుమంది అమ్మాయిల కేసుకి సంబంధం ఉండవచ్చని వీళ్ళు అనుమానిస్తారు. చివరికి ఈ అన్నాలౌ ఏమౌతుంది ? ఈ కిడ్నాప్ లో అసలు సూత్రధారి ఎవరు ? గతంలో అమ్మాయిలు ఎందుకు మిస్ అయ్యారు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : జర్నలిస్ట్ ని టార్గెట్ చేసే మాఫియా … ఓటీటీలో కేక పెట్టిస్తున్నక్రైమ్ థ్రిల్లర్ సిరీస్

ఏ ఓటీటీలో ఉందంటే 

ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది గర్ల్ ఇన్ ది ఫాగ్’ (The Girl in the Fog). ఈ సినిమాకి డొనాటో కారిసీ దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. 2 గంటల 8 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 6.8/10 రేటింగ్ ఉంది. ఇందులో టోని సెర్విల్లో (ఏజెంట్ వోగెల్), అలెసియో బోని (ప్రొఫెసర్ లోరిస్ మార్టినీ), జీన్ రెనో (డాక్టర్ ఫ్లోరెస్), లోరెంజో రిచెల్మీ (బోర్ఘి), గలాటియా రంజీ (స్టెల్లా హోనర్), మిచెలా సెస్కాన్ వంటి నటులు నటించారు.

Related News

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

OTT Movie : పెళ్ళైన ట్యూషన్ టీచర్ పై ప్రేమ… సీక్రెట్ లెటర్ తో బండారం బట్టబయలు… IMDbలో 7.5 రేటింగ్

OTT Movie : తవ్వకాల్లో బయటపడే శవపేటిక… దుష్ట శక్తి విడుదలవ్వడంతో దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు డోంట్ వాచ్

OTT Movie : బాబోయ్ చావడానికెళ్లి ఇలా బుక్కయ్యాడేంటి… 12 జన్మలు, 12 సార్లు చావు… కల్లో కూడా చావు గురించి ఆలోచించరు

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : వరుడిని కోమాలోకి పంపే పెళ్లి కూతురు కోరిక… అంతలోనే మరో పెళ్ళికి సిద్ధం… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

OTT Movie : ఈ దెయ్యానికి అమ్మాయిలే కావాలి… ఒక్కో సీన్ కు గుండె జారిపోద్ది… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

Big Stories

×