Yuzvendra Chahal: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా మరికాసేపట్లో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals vs Mumbai Indians) మధ్య మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ఉంది. ఈ క్రమంలో ఇందులో రాజస్థాన్ విజయం సాధిస్తే.. పంజాబ్ కింగ్స్ ఇంటికి వెళుతుంది. అదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ బరిలో నిలుస్తుంది. అటు రాజస్థాన్ ఓటమిపాలైతే.. పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది. ఇలాంటి క్రమంలో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఫలితంపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది.
ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ క్రికెటర్లతో పాటు అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఎలాగైనా ముంబై ఇండియన్స్ గెలవాలని పూజలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ ( Shreyas Iyer) కీలక కామెంట్ కూడా చేశారు. దేవుడి దయతో ముంబై ఇండియన్స్ విజయం సాధిస్తుందని నిన్న మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత ప్రకటన చేశారు శ్రేయస్ అయ్యర్. ఇక లేటెస్ట్ గా పంజాబ్ కింగ్స్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ కూడా తన స్టైల్లో స్పందించారు. ఇవాల్టి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేస్తే… రోహిత్ శర్మ ఖచ్చితంగా డబుల్ సెంచరీ చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi) డకౌట్ కావడం గ్యారెంటీ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal ). తాను చెప్పినట్లుగా కచ్చితంగా జరుగుతందని వెల్లడించారు. దీంతో యుజ్వేంద్ర చాహల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ లో ఎక్కువగా అవకాశం రియాన్ పరాగ్ సేనకు ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ముంబై ఇండియన్స్ పై కష్టపడి గెలిస్తే సరిపోతుంది. నేరుగా రాజస్థాన్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. అదే పంజాబ్ ప్లే ఆప్స్ కు వెళ్లాలంటే చాలా కష్టపడాలి. ఇవాళ ముంబై చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడితేనే… పంజాబ్ కు అవకాశాలు ఉంటాయి. ప్రస్తుత ఫాం ప్రకారం ముంబై ఇండియన్స్ ను ఓడించడం చాలా సులభం. కానీ ముంబై వాంఖడే స్టేడియం వేదికగా మ్యాచ్ జరుగుతుంది కాబట్టి.. ముంబై ఇండియన్స్ ను తక్కువగా అంచనా వేయకూడదు. వైభవ్ సూర్య వంశీ, యశస్వి జైస్వాల్ ఇద్దరూ క్లిక్ అయితే రాజస్థాన్ ను తట్టుకోవడం కష్టమే. మరి ఇవాళ ఏం జరుగుతుందో చూడాలి.