Gambhir Vs Agarkar: ఇంగ్లాండ్, ఐర్లాండ్ టి20 సిరీస్ లతో పాటు ఏషియన్ గేమ్స్ కోసం టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ నేపథ్యంలో సూర్య కుమార్ యాదవ్ పై వేటుపడగా… శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్సీ దక్కింది. అటు సూర్యకుమార్ యాదవ్ ను పూర్తిగా జట్టులో నుంచి తొలగించి… తిలక్ వర్మకు వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. అలాగే 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ కూడా సెలెక్ట్ అయ్యాడు. అయితే టీమిండియా జట్టును ప్రకటించే క్రమంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, బిసిసిఐ అధికారి దేవజిత్ సైకియా మాత్రమే మీడియా ముందుకు వచ్చారు. గౌతమ్ గంభీర్ మాత్రం రాలేదు. దీంతో గౌతమ్ గంభీర్ ప్రెస్ మీట్ కు దూరం కావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అజిత్ అగార్కర్, గౌతమ్ గంభీర్ మధ్య గొడవలు ఇప్పటికే మొదలయ్యాయని.. అందుకే ప్రెస్ మీట్ కు కూడా హాజరు కాలేదు అంటున్నారు.
టీమిండియా జట్టును ఎప్పుడు ప్రకటించిన కూడా.. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తో పాటుగా కచ్చితంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉంటారు. వీళ్ళిద్దరే దాదాపు ఏడాదిన్నరగా ప్రెస్ మీట్ లు పెట్టి.. జట్టును ప్రకటిస్తూ ఉన్నారు. మీడియా వాళ్లకు కూడా ఈ ఇద్దరు సమాధానం చెబుతూ ఉంటారు. మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ లాంటి ప్లేయర్లకు అవకాశం రాని నేపథ్యంలో.. స్వయంగా మీడియాతో గౌతమ్ గంభీర్ క్లారిటీ ఇచ్చేవారు. అయితే తాజాగా టీమిండియా జట్టును ప్రకటించినప్పుడు గౌతమ్ గంభీర్ మాత్రం ప్రెస్ మీట్ కు హాజరు కాలేదు. దీనికి ప్రత్యేక కారణం ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గౌతమ్ గంభీర్ అలాగే అజిత్ అగార్కర్ దాదాపు రెండు నెలలుగా గొడవలు జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ ప్రారంభం కంటే ముందే టీమిండియా టి20 జట్టుకు కొత్త కెప్టెన్ ను నియామకం చేయాలని, ఆ డ్యూటీని గౌతమ్ గంభీర్ తో పాటు అజిత్ అగార్కర్ కు అప్పగించారట.
ఈ క్రమంలో టీమిండియా టి20 కెప్టెన్ గా సంజు శాంసన్ పేరును గౌతమ్ గంభీర్ ప్రతిపాదించారని సమాచారం. శ్రేయస్ అయ్యర్ పేరును ఫైనల్ చేసి అజిత్ అగార్కర్ తన రిపోర్టును బీసీసీఐకి అప్పగించారట. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఏదో ఒకటి చేసి… శ్రేయస్ అయ్యర్ పేరును ఫైనల్ చేసేలా అజిత్ అగార్కర్ కుట్రకు తెర లేపినట్లు తెలుస్తోంది. బిసిసిఐ అధికారి సైకియాతో కలిసి ఈ కుట్రలకు తెర లేపారట. అయితే ఈ విషయం గ్రహించిన గౌతమ్ గంభీర్, ఆహ్వానం అందినప్పటికీ కూడా.. ప్రెస్ మీట్ కు హాజరు కాలేదని చెబుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య టెస్ట్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో పంజాబ్ వచ్చేసినట్టు ఆయన తప్పించుకున్నారట. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో ఉత్తగ ప్రచారం చేస్తున్నారు.
Also Read: Tanveer Ahmed: బాబర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభవ్ కంటే భయంకరంగా ఆడతాడు