E-Paper
Advertisement

మాచర్లలోని సినిమా థియేటర్‌లో భారీ అగ్ని ప్రమాదం

మాచర్లలోని సినిమా థియేటర్‌లో భారీ అగ్ని ప్రమాదం
Advertisement

Macherla: పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక రామా టాకీస్ థియేటర్‌లో అర్థరాత్రి సమయంలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు సినిమా హాల్ మొత్తానికి వ్యాపించడంతో థియేటర్ పూర్తిగా దహనమైంది. థియేటర్ నుండి దట్టమైన పొగ, మంటలు రావడం గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో థియేటర్‌లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణ నష్టం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ అగ్ని ప్రమాదం వల్ల థియేటర్ లోపల ఉన్న స్క్రీన్, సీట్లు, విలువైన సౌండ్ సిస్టమ్ పూర్తిగా బూడిదయ్యాయి. సుమారు 70 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని థియేటర్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Advertisement

Also Read: ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పేలిపోయిన విమానం

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×