BigTV English

No Smoking Day 2025: సిగరెట్ వ్యసనం నుంచి బయటపడాలా? ఈ చిట్కాలు మీ కోసమే!

No Smoking Day 2025: సిగరెట్ వ్యసనం నుంచి బయటపడాలా? ఈ చిట్కాలు మీ కోసమే!

No Smoking Day 2025 Deaddiction | ధూమపానం మన శరీరానికి చాలా హానికరం. సినిమాలు, టీవీ, కుటుంబం, స్నేహితుల ప్రభావంతో చిన్న వయసులోనే అనేక మంది సిగరెట్, బీడీ, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులకు బానిసలవుతున్నారు. ఈ అలవాటు మొదట సరదాగా ప్రారంభమైనా, తర్వాత వ్యసనంగా మారుతుంది. సిగరెట్ తాగడం వల్ల క్యాన్సర్, ఊపిరితిత్తుల రోగాలు, గుండె జబ్బులు వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయి. ఇది తాగేవారికి మాత్రమే కాకుండా, పొగ పీల్చే వారికి కూడా ప్రమాదకరం.


ఒకసారి స్మోకింగ్ అలవాటు కాస్తా వ్యసనంగా మారితే.. దాన్ని వదలడం చాలా కష్టమవుతుంది. ఈ దురలవాటు నుంచి బయటపడడం చాలా మంది కష్టంగా భావిస్తారు. కొంతమంది మానసిక వైద్యుల సాయం తీసుకుంటారు, మరి కొంతమంది చికిత్సలు ప్రయత్నిస్తారు. సిగరెట్, ధూమపానానికి వ్యతిరేకంగా ప్రతి సంవత్సరం మార్చి రెండవ బుధవారం “నో స్మోకింగ్ డే”గా నిర్వహిస్తారు. 2025లో కూడా మార్చి 12న నో స్మోకింగ్ డే జరుపుకుంటున్నారు.

సిగరెట్, ధూమపానాన్ని మానేయలాని భావించే వారికి కొన్ని సూచనలు:


ధూమపానం మానడం ఎలా?

  • ముందుగా మీకు మానసికంగా ధూమపానాన్ని వదిలివేయాలని బలంగా నిర్ణయించుకోండి.
  • ధూమపానం మానేస్తున్నట్లు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలియజేయండి.
  • మీరు ధూమపానం ఎందుకు మానాలని అనుకుంటున్నారో రాతపూర్వకంగా వ్రాయండి.
  • మీరు ధూమపానం వదలడానికి నిర్ణయించిన తేదీని ఖరారు చేసుకోండి. తేదీని వాయిదా వేయకండి.
  • మరో వ్యక్తి కూడా ధూమపానం మానడానికి ప్రయత్నిస్తున్నారంటే, వారి గురించి తెలుసుకోవడం మంచిది, మీరు ఒకరినొకరు తోడుగా ఉండొచ్చు.

Also Read: బరువు తగ్గేందుకు డైటింగ్, ప్రాణాలు కోల్పోయిన యువతి, ఆమె చేసిన తప్పు ఇదే!

వంటగది చిట్కా
సిగరెట్ మానడంలో మీ వంటగదిలో ఉంచిన కొన్ని మసాలాలు సహాయపడవచ్చు. నల్ల మిరియాలు, ఇందులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, నికోటిన్ కోరికలను తగ్గించడంలో సహాయపడతాయి. మార్కెట్‌లో నల్ల మిరియాల నూనె లభిస్తుంది, ఈ నూనెలో శరీరానికి డిటాక్సిఫికేషన్ చేసే గుణం
ఉంటుంది. ఈ నూనె పొగాకు కోరికను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
దీన్ని డిఫ్యూజర్ ద్వారా తీసుకుంటే, నల్ల మిరియాల వాసన సిగరెట్ కోరికను తగ్గిస్తుంది.
సిగరెట్ కోరికలు తగ్గడానికి నల్ల మిరియాల నూనెను మీ ఛాతీపై రుద్దడం కూడా ఉపశమనం కలిగిస్తుంది.
ఇంకా, మీరు నల్ల మిరియాలు వివిధ రీతిలో తీసుకోవచ్చు, ఉదాహరణకు సలాడ్లు, జ్యూస్‌లు, స్మూతీలు, లేదా లెమన్ టీల్లో జోడించవచ్చు. అయితే, మీరు ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

ధూమపానం మానేసే ముందు పాటించాల్సిన నియమాలు
సిగరెట్ పరిమాణాన్ని రోజూ తగ్గించండి.
ధూమపానం చేస్తున్నప్పుడు పఫ్‌ల సంఖ్యను, పొగాకు నమిలే సంఖ్యను తగ్గించండి.
లోతుగా ఊపిరి పీల్చకుండా ఉండండి.
సిగరెట్ కొనుగోలు చేసే దుకాణం వద్దకు వెళ్ళకండి.

ధూమపానం మానేసిన తర్వాత శరీరంలో కనిపించే మార్పులు
20 నిమిషాల్లో: హృదయ స్పందన రేటు సాధారణ స్థితికి వస్తుంది.
12 గంటల్లో: కార్బన్ మోనాక్సైడ్ స్థాయి సాధారణం అవుతుంది.
1-9 నెలల్లో: శ్వాస సమస్యలు తగ్గిపోతాయి, ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.
1 సంవత్సరంలో: గుండె జబ్బుల ప్రమాదం సగానికి తగ్గుతుంది.
5 సంవత్సరాల్లో: స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది.
10 సంవత్సరాల్లో: ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం సగానికి తగ్గుతుంది.
15 సంవత్సరాల్లో: గుండె జబ్బుల ప్రమాదం శూన్యం అవుతుంది.

ధూమపానానికి ప్రత్యామ్నాయాలు
పొగాకు త్రాగాలన్న కోరిక వచ్చినప్పుడు, చూయింగ్ గమ్స్ లేదా చాక్లెట్లను తీసుకోవచ్చు.
రోజుకు 8-10 గ్లాసులు నీళ్లు తాగండి. ఇది పొగాకు కోరిక తగ్గించడంలో సహాయపడుతుంది.
3-5 నిమిషాలు ధ్యానం చేయడం, మీరు శాంతియుతంగా ఉండటానికి సహాయపడుతుంది.
సంగీతం వినడం, వ్యాయామాలు చేయడం, చురుగ్గా నడవడం కూడా పొగాకు కోరిక తగ్గించడానికి సహాయపడతాయి.

ధూమపానం మానేసిన తర్వాత ఇవి తప్పనిసరిగా పాటించాలి..

  • పొగాకు ఇచ్చినప్పుడు, “వద్దు” అని చెప్పండి.
  • ఒత్తిడిని ఎదుర్కొనే మార్గాలను ప్రయత్నించండి, ఉదాహరణకు విశ్రాంతి, లోతైన శ్వాస, సంగీతం వినడం.
  • పొగాకు లేదా సిగరెట్ ను గుర్తు చేసే ఏ వస్తువులను మీ సమీపంలో ఉండనివ్వద్దు.
  • ఏకాగ్రత లోపించడం, చిరాకు, తలనొప్పి వంటి సమస్యలు తాత్కాలికమైనవి . ఇవి కొన్ని రోజుల్లోనే తగ్గిపోతాయి.  ఒకవేళ మీరు త్వరగా ఉపశమనం పొందాలన్నా.. వీటకి ప్రత్యామ్నాయ చికిత్సలు ఉన్నాయి.

ప్రతి సంవత్సరం భారతదేశంలో సిగరెట్ వలన 8,00,000 మరణాలు సంభవిస్తాయి. అలాగే 45 లక్షల కార్డియో వాస్కులర్ వ్యాధులు, 1.6 లక్షల నోటి క్యాన్సర్‌లు, 39 లక్షల క్రానిక్ పల్మనరీ వ్యాధులు నమోదు అవుతున్నాయి. కాబట్టి, ధూమపానం మానేసి ఆరోగ్యంగా జీవించండి. మీ కుటుంబంతో సుఖంగా ఉండండి, డబ్బును కూడా ఆదా చేసుకోండి.

Tags

Related News

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Health tips: గుండెల మీద ఎవరైనా కూర్చొన్నట్లు అనిపిస్తోందా? దానిని ఏమంటారో తెలుసా?

Navratri Fasting: నవరాత్రి ఉపవాస సమయంలో.. ఈ ఫుడ్ తింటే ఫుల్ ఎనర్జీ !

Fast Eating: టైం లేదని వేగంగా తింటున్నారా ? ఎంత ప్రమాదమో తెలిస్తే ఈ రోజే మానేస్తారు !

Dates Benefits: డైలీ రెండు ఖర్జూరాలు తింటే ? బోలెడు లాభాలు !

Big Stories

×