BigTV English

Bumrah:- గుడ్ న్యూస్.. బూమ్రా రెడీ.. వరల్డ్ కప్‌ నాటికి పూర్తి ఫిట్‌నెస్

Bumrah:- గుడ్ న్యూస్.. బూమ్రా రెడీ.. వరల్డ్ కప్‌ నాటికి పూర్తి ఫిట్‌నెస్

Bumrah:- బీసీసీఐ నోట్లో చెక్కెర పోసేంత తీపి కబురు చెప్పింది. బూమ్రా కోలుకున్నాడు. ఫిట్‌నెస్ కోసం కసరత్తు మొదలుపెట్టాడు. వచ్చే వరల్డ్ కప్‌కు జట్టులోకి వచ్చేస్తాడు. ఇండియన్ బౌలింగ్ సెగ్మెంట్లో బూమ్రా చాలా కీలకం. మ్యాచ్‌ను టర్న్ చేయగల బౌలర్ తను. ఈ వరల్డ్ కప్‌కు బూమ్రా లేకుండా ఆడాలా అని ఇప్పటి వరకు అనుమానాలు ఉండేవి. ఇప్పుడు బీసీసీఐ చెప్పేసింది. బూమ్రా గెటింగ్ రెడీ అని.


వెన్ను కింద భాగంలో తీవ్రనొప్పితో అల్లాడిన జస్‌ప్రీత్‌ బుమ్రాకు..  న్యూజిలాండ్‌లో సర్జరీ జరిగింది. ఆ తరువాత ఆరు వారాల పాటు పూర్తిగా రెస్ట్ తీసుకున్నాడు. సర్జరీ సక్సెస్ అయిందని, నొప్పి నుంచి పూర్తిగా కోలుకున్నాడని వైద్యులు, ఇటు బీసీసీఐ కూడా తెలిపింది. ఇప్పుడు నేషనల్ క్రికెట్‌ అకాడమీలో అడుగుపెడుతున్నాడు. ఎక్స్‌పర్ట్స్ సమక్షంలో మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెడుతున్నాడు బూమ్రా.

ఇక శ్రేయస్‌ అయ్యర్‌ కూడా వరల్డ్ కప్ వరకు రెడీ అవుతాడని బీసీసీఐ ప్రకటించింది. వచ్చే వారం శ్రేయస్ అయ్యర్‌కు సర్జరీ జరగనుంది. అయ్యర్ కూడా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. సర్జరీ తరువాత కనీసం రెండు మూడు వారాల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండనున్నాడు. ఆ తరువాత నేషనల్ క్రికెట్ అకాడమీలో అడుగుపెడతాడు.


అటు స్పీడ్‌స్టర్ బూమ్రా, ఇటు బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్.. జట్టులోకి వస్తే.. వచ్చే వరల్డ్ కప్‌ నాటికి టీమిండియా మరింత స్ట్రాంగ్ అవుతుందని బీసీసీఐ తెలిపింది. మొత్తానికి వరల్డ్ కప్ నాటికి పరిస్థితులన్నీ టీమిండియాకు అనుకూలంగా మారబోతున్నాయి.

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×