BigTV English

Hardik Pandya : T20 పూర్తిస్థాయి కెప్టెన్‌గా పాండ్యా?

Hardik Pandya : T20 పూర్తిస్థాయి కెప్టెన్‌గా పాండ్యా?

Hardik Pandya : T20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఘోర ఓటమి తర్వాత… భారత T20 జట్టులో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది… BCCI. ఇందులో భాగంగా కెప్టెన్సీ నుంచి రోహిత్‌ శర్మను తప్పించాలని BCCI భావిస్తున్నట్టు సమాచారం. అతని స్థానంలో పూర్తిస్థాయి T20 కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యాను నియమించాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దేశంలో శ్రీలంకతో జరగబోయే T20 సిరీస్‌కు ముందు BCCI ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించవచ్చని చెబుతున్నారు.


భారత T20 కెప్టెన్సీలో మార్పు చేసే సమయం అన్నమైందని… BCCI ఉన్నతాధికారి ఒకరు ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధృవీకరించారు. రోహిత్‌ ఇంకొన్నాళ్లు భారత T20 జట్టు కెప్టెన్‌గా కొనసాగాలని కొంతమంది పట్టుబడుతున్నా… అతని వయస్సు కారణంగా పని భారాన్ని తగ్గించాలని అనుకుంటున్నామని… టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొనసాగుతాడని BCCI ఉన్నతాధికారి వెల్లడించాడు. రెండేళ్ల తర్వాత జరిగే T20 వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేయాలని BCCI భావిస్తోందని… కీలక మార్పులు చేసే విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. T20ల్లో పూర్తిస్థాయి కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా సరైనోడని అందరూ భావిస్తున్నారని… స్వదేశంలో శ్రీలంకతో జరగబోయే T20 సిరీస్‌కు ముందు BCCI ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆ ఉన్నతాధికారి వెల్లడించాడు.

న్యూజిలాండ్‌తో T20 సిరీస్‌ ముగిశాక… వచ్చే ఏడాది జనవరిలో శ్రీలంకతో స్వదేశంలో T20 సిరీస్ లో తలపడనుంది… టీమిండియా. ఈ గ్యాప్ లో భారత జట్టు కేవలం వన్డే, టెస్టు సిరీస్‌ల్లో మాత్రమే ఆడనుంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న భారత T20 జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హార్దిక్‌ పాండ్యా… ఆ సిరీస్ లో ఏ మాత్రం రాణిస్తాడో చూసి… శ్రీలంకతో T20 సిరీస్‌​కు ముందు కెప్టెన్సీపై ఓ నిర్ణయానికి రానుంది… BCCI.


Tags

Related News

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీవర్షాలతో మునిగిపోయే జోన్స్ ఇవే

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Big Stories

×