Big Stories

Hardik Pandya Fined: ఈసారి డబల్.. రూ. 24 లక్షల ఫైన్.. పాండ్యా ఏంటిది?

Hardik Pandya Fined ₹ 24 Lakh After Team’s Second Slow over Rate Offence: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకి ఈ సీజన్ ఏదీ కలిసి రావడం లేదు. కానీ ఎంతో మొండి ధైర్యంతో మాత్రం ముందుకు వెళుతున్నాడు. కాలమే అన్నిటికి సమాధానం చెబుతుందని అనుకుంటున్నాడు. ఎప్పుడు తన ఆట గాడిన పడుతుందో అప్పుడు మళ్లీ తనకి పూర్వ వైభవం వస్తుందని నమ్ముతున్నాడు.

- Advertisement -

ఇకపోతే లక్నోతో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా మరోసారి జరిమానా ఎదుర్కొన్నాడు. ఇప్పటికే ఓటములతో తలబొప్పి కడుతుంటే వాటికి తోడు ఇవి ఒకటాని అంతా తలలు పట్టుకుంటున్నారు. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటాను పూర్తి చేయకపోవడంతో రిఫరీ జరిమానా విధించాడు. గతంలో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఆల్రడీ ఒకసారి రూ.12 లక్షలు ఫైన్ కట్టడం వల్ల, ఈ సారి అది డబుల్రూ అయ్యింది. అందుకే 24 లక్షలు కట్టాల్సి వచ్చింది. అంతే కాదు ముంబై టీమ్ సభ్యుల మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించినట్టు మ్యాచ్ రిఫరీ ప్రకటించాడు.

- Advertisement -

ఈ పరిస్థితిపై నెట్టింట పలు కామెంట్లు వినిపిస్తున్నాయి. అసలు పాండ్యాకి ఏమైంది? అని  ప్రశ్నిస్తున్నారు. జట్టులో అందరినీ కలుపుకొని వెళ్లకుండా అంతా తన సొంత పెత్తనంతో వ్యవహరించాలంటే సాధ్యమవుతుందా? అని అంటున్నారు. ఇప్పటికే ఏళ్ల తరబడి ముంబై ఇండియన్ టీమ్ లో చాలామంది పాతుుకుపోయి ఉన్నారని గుర్తు చేస్తున్నారు.

Also Read: ఊరించి.. ఊరించి ఉసూరుమనిపించారు.. రింకూ సింగ్ తండ్రి ఆవేదన

వాళ్లని ఒక్కసారి లేపడం అంత ఈజీ కాదని చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు రోహిత్ శర్మ, బుమ్రా వీళ్లంతా ఉన్నారు. వీరికి ఎక్కడెక్కడో మూలాలు ఉంటాయి. స్నేహాలు ఉంటాయి. అభిమానాలుంటాయి. పాండ్యా ఈరోజు వచ్చి ఇక్కడ వీరిని గిల్లుతుంటే, మంట అక్కడ పుడుతుంది. దాంతో వాళ్లు, ఇప్పుడు కొత్తగా వచ్చి, మావాళ్లనే  అంటాడా? అని పైనుంచి ఫ్యూజులు పీకేస్తుంటారు. ఇవి అండర్ కరెంటుగా ప్రతి సంస్థలో ఉంటాయి. ఇక్కడ వీరిని అంటే సంబంధం లేనివాళ్లు పాండ్యాని తిడుతుంటారు.

ఎవడిని టచ్ చేస్తే ఏ గదిలో.. ఏ లైటు వెలుగుతుందో తెలీదు. తనకి ముంబైతో అనుబంధం ఉంది. ఆటగాడిగా ఉండటం వేరు. పెత్తనం చేసే కెప్టెన్ గా వెళ్లడం వేరు. అందుకే ఒక ఏడాది కూల్ గా ఉండి, తన టీమ్ ని ఒకటి సెట్ చేసుకుని, అప్పుడు తన ఒరిజినాలిటీని బయటకు తీయాలని సలహాలు, సూచనలు నెటిజన్లు ఇస్తున్నారు. లేదంటే ఇలాగే మైండ్ ఎక్కడో ఉంటుంది. గ్రౌండులో మాత్రం ఫైన్లు కట్టుకుంటూ వెళ్లాలని చెబుతున్నారు.

Also Read: MI vs kkr Preview IPL 2024: ముంబైకి చావో రేవో.. నేడు కోల్ కతాతో మ్యాచ్

ఈసారి మరొక మ్యాచ్ లేట్ చేస్తే, ఏకంగా ఒక మ్యాచ్ నిషేధానికి పాండ్యా గురవుతాడు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి సీక్వెన్స్ గా వస్తుంటే ముంబై ఫ్రాంచైజీకి తలనొప్పులు మొదలవుతాయి. పాండ్యాకు లీడర్ షిప్ క్వాలిటీస్ లేవని అనుకుంటుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని సీనియర్లు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News