Big Stories

Rinku Singh Father on WC Selection: ఊరించి.. ఊరించి ఉసూరుమనిపించారు: రింకూ సింగ్ తండ్రి ఆవేదన

Rinku Singh Father Comments on T20 World Cup 2024 Selections: మొదటి నుంచి రింకూసింగ్ ని టీ 20 వరల్డ్ కప్ కి ఎంపిక చేస్తారనే హడావుడి మిన్నంటింది. అందుకు తగినట్టుగానే బీసీసీఐ కూడా రింకూ సింగ్ కి పలు అవకాశాలు కూడా కల్పించింది. ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్ ఆడే అనుభవాన్ని అందించాలని, ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన టెస్ట్ సిరీస్ కు అప్పటికప్పుడు ఎంపిక చేశారు. అలాగే సౌతాఫ్రికా తీసుకువెళ్లారు. అలాగే టీ 20 ప్రపంచకప్ ఆటగాళ్ల ఫొటో సెషన్ కి పిలిపించారు. దీంతో తన ఎంపిక తప్పదని, హండ్రడ్ పర్సంట్ అని అంతా అనుకున్నారు. కానీ అనుకున్నదొకటి, అయినది ఇంకొకటిగా మారింది.

- Advertisement -

రింకూ సింగ్ మానసిక స్థితి ఎలా ఉన్నా, ఇంట్లో తల్లిదండ్రులు మాత్రం హతాశుయులయ్యారు. అసలే పేదరికం కారణంగా వారి కొడుకు ఉన్నత స్థితికి వెళతాడనేసరికి, కోటి ఆశలతో ఉంటారు. తను ఫైనల్ జట్టుకి ఎంపిక కాలేదని తెలుసుకున్నాక రింకూ తండ్రి మాట్లాడుతూ విషయం తెలిసి, నా గుండె బద్ధలైందని అన్నాడు. కాకపోతే అంతర్జాతీయ స్థాయిలో ఆటంటే మాటలు కాదు, కానీ జట్టుతో ఉన్నాడు కదా.. అది సంతోషమే అన్నాడు.

- Advertisement -

అయితే రింకూ సింగ్ మాత్రం తల్లికి ఎంతో సర్ది చెప్పాడు. తను ఎంపిక కాకపోయినా సరే, జట్టుతో పాటు వెళతానని అన్నాడు. అంటే ఎక్స్ ట్రా ప్లేయర్ గా ఉంటాడన్న మాట. నిజానికి సెలక్టర్లు ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందంటే ప్రస్తుతం ఐపీఎల్ తన ప్రదర్శన అంత ఆకట్టుకున్నట్టుగా లేదు.  బెస్ట్ ఫినిషర్ గా స్థాయికి తగిన ఆట ఆడలేకపోతున్నాడు.

Also Read: ఎవరి కోసం రింకూని బలి చేశారు? ఇదో చెత్త సెలక్షన్: సీనియర్లు సీరియస్

ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన రింకూ సింగ్ కేవలం 123 పరుగులే చేశాడు. ఈ గణంకాలతోనే రింకూ సింగ్‌ను పక్కన పెట్టారని అంటున్నారు. మరోవైపు చెన్నయ్ నుంచి శివమ్ దుబె అద్భుతంగా ఆడి, మ్యాచ్ లను గెలిపిస్తున్నాడు. అందుకే తనకి సెలక్టర్లు ఓటు వేశారని అంటున్నారు. రింకూ సింగ్‌ను ఎంపికచేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంబటి రాయుడు, ఆకాశ్ చోప్రా, సునీల్ గవాస్కర్, ఇర్ఫాన్ పఠాన్ వంటి ఆటగాళ్లు సెలెక్టర్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

మొదటి నుంచి రింకూసింగ్ ని టీ 20 వరల్డ్ కప్ కి ఎంపిక చేస్తారనే హడావుడి మిన్నంటింది. అందుకు తగినట్టుగానే బీసీసీఐ కూడా రింకూ సింగ్ కి పలు అవకాశాలు కూడా కల్పించింది. ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్ ఆడే అనుభవాన్ని అందించాలని, ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన టెస్ట్ సిరీస్ కు అప్పటికప్పుడు ఎంపిక చేశారు. అలాగే సౌతాఫ్రికా తీసుకువెళ్లారు. అలాగే టీ 20 ప్రపంచకప్ ఆటగాళ్ల ఫొటో సెషన్ కి పిలిపించారు. దీంతో తన ఎంపిక తప్పదని, హండ్రడ్ పర్సంట్ అని అంతా అనుకున్నారు. కానీ అనుకున్నదొకటి, అయినది ఇంకొకటిగా మారింది.

Also Read: T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ టీమ్ ప్రదర్శనతో బెంబేలు..! ఇలా ఆడితే కప్పు ఎలా..?

రింకూ సింగ్ మానసిక స్థితి ఎలా ఉన్నా, ఇంట్లో తల్లిదండ్రులు మాత్రం హతాశుయులయ్యారు. అసలే పేదరికం కారణంగా వారి కొడుకు ఉన్నత స్థితికి వెళతాడనేసరికి, కోటి ఆశలతో ఉంటారు. తను ఫైనల్ జట్టుకి ఎంపిక కాలేదని తెలుసుకున్నాక రింకూ తండ్రి మాట్లాడుతూ విషయం తెలిసి, నా గుండె బద్ధలైందని అన్నాడు. కాకపోతే అంతర్జాతీయ స్థాయిలో ఆటంటే మాటలు కాదు, కానీ జట్టుతో ఉన్నాడు కదా.. అది సంతోషమే అన్నాడు.

అయితే రింకూ సింగ్ మాత్రం తల్లికి ఎంతో సర్ది చెప్పాడు. తను ఎంపిక కాకపోయినా సరే, జట్టుతో పాటు వెళతానని అన్నాడు. అంటే ఎక్స్ ట్రా ప్లేయర్ గా ఉంటాడన్న మాట. నిజానికి సెలక్టర్లు ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందంటే ప్రస్తుతం ఐపీఎల్ తన ప్రదర్శన అంత ఆకట్టుకున్నట్టుగా లేదు.  బెస్ట్ ఫినిషర్ గా స్థాయికి తగిన ఆట ఆడలేకపోతున్నాడు.

Also Read: ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్.. వన్డే, టీ20ల్లో టీమిండియా నెంబర్ 1.. కానీ..!

ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన రింకూ సింగ్ కేవలం 123 పరుగులే చేశాడు. ఈ గణంకాలతోనే రింకూ సింగ్‌ను పక్కన పెట్టారని అంటున్నారు. మరోవైపు చెన్నయ్ నుంచి శివమ్ దుబె అద్భుతంగా ఆడి, మ్యాచ్ లను గెలిపిస్తున్నాడు. అందుకే తనకి సెలక్టర్లు ఓటు వేశారని అంటున్నారు. రింకూ సింగ్‌ను ఎంపికచేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంబటి రాయుడు, ఆకాశ్ చోప్రా, సునీల్ గవాస్కర్, ఇర్ఫాన్ పఠాన్ వంటి ఆటగాళ్లు సెలెక్టర్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News