Hardik Pandya : భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చీలమండ గాయంతో ప్రపంచకప్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. హార్దిక్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వైట్-బాల్ సిరీస్.. డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాలో జరిగిన సిరీస్‌కి కూడా దూరమయ్యాడు. జనవరిలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టి20I సిరీస్‌కు అతను కోలుకుంటాడని భావించినప్పటికీ.. టీమిండియా ఈ ఆల్‌రౌండర్ సేవలను మళ్లీ కోల్పోవచ్చని పలు నివేదికలు తెలిపాయి.
హార్దిక్ తన చీలమండ గాయం నుంచి కోలుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అందువల్ల ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌ను దూరమవడమే కాకుండా, IPL 2024 సీజన్‌కు కూడా దూరంగా ఉండవచ్చని PTI నివేదించింది. “హార్దిక్ ఫిట్‌నెస్ స్థితిపై ప్రస్తుతానికి ఎటువంటి అప్‌డేట్ లేదు.. ఐపీఎల్ ప్రారంభమయ్యేలోపు అతను అందుబాటులో ఉంటాడా లేదా అనే పెద్ద ప్రశ్న మిగిలి ఉంది” అని బీసీసీఐ ప్రతినిధి PTIకి తెలిపినట్లు సమాచారం.
ఇది టీమిండియాకు, ముంబై ఇండియన్స్‌కు పెద్ద దెబ్బేనని చెప్పొచ్చు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే సిరీస్‌కు జట్టుకు నాయకత్వం వహించమని రోహిత్ శర్మను సెలక్టర్లు కోరే అవకాశం ఉంది. అయితే.. భారత కెప్టెన్ తన విరామ కాలాన్ని పొడిగించాలని అనుకుంటే, దక్షిణాఫ్రికాతో టి20I సిరీస్‌లో వైస్ కెప్టెన్‌గా ఎంపికైన రవీంద్ర జడేజా కెప్టెన్‌గా ఉండొచ్చు. అయితే, జడేజా ఇంగ్లండ్‌తో మొత్తం ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాల్గొననున్నాడు. అతని పనిభార నిర్వహణ పట్ల జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాడని తెలుస్తోంది. మరి జడేజా కెప్టెన్సీకి సుముఖంగా ఉన్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించిన రుతురాజ్ గైక్వాడ్ కూడా గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు.
ముంబై ఇండియన్స్ ఇటీవలే IPL 2024 సీజన్‌కు హార్దిక్‌ను తమ కెప్టెన్‌గా ప్రకటించారు. తద్వారా రోహిత్ 10 సంవత్సరాల సుదీర్ఘ పదవీకాలాన్ని నాయకుడిగా ముగించారు. గత నెల చివర్లో ముంబై.. గుజరాత్ టైటాన్స్ నుండి హార్దిక్‌ను ట్రేడ్ చేసుకున్నారు. దీంతో ముంబై ఇండియన్స్ శిబిరంలో ఆందోళన నెలకొంది.