BigTV English

Hardik Pandya: ముంబై జట్టులో చేరి, కొబ్బరి కాయ కొట్టిన పాండ్యా..

Hardik Pandya: ముంబై జట్టులో చేరి, కొబ్బరి కాయ కొట్టిన పాండ్యా..

hardhik pandya update news


Hardik Pandya Sets Up Temple Inside Mumbai Indians Dressing Room(Sports news in telugu): ఐపీఎల్ సీజన్ 2024 ప్రారంభానికి ముందు ఒకొక్క సీనియర్ ఆటగాళ్లందరూ తమ తమ జట్లలోకి చేరుతున్నారు. ఆల్రడీ రిషబ్ పంత్ ఫిట్ నెస్ తో ఉన్నట్టు బీసీసీఐ ప్రకటించింది. తర్వాత ఏ ప్రకటనా లేకుండానే ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టులోకి వచ్చి చేరాడు. దీంతో జట్టు కొత్త కెప్టెన్‌కు ఫ్రాంచైజీ ఘన స్వాగతం పలికింది. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్  పాండ్యా ఫ్రాంచైజీ  ఆఫీసులో అడుగుపెట్టి మొదట దేవుడికి పూలమాల సమర్పించాడు, జట్టు ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ తో కలిసి కొబ్బరికాయ కొట్టి ఘనంగా పూజలు చేశాడు.

2023 వన్డే వరల్డ్ కప్ సంబర్భంగా హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు.అప్పటి నుంచి ఎన్సీఏలో ఉంటూ చికిత్స తీసుకున్నాడు. గాయం తగ్గిన తర్వాత ప్రైవేటు కోచ్ ల వద్ద ప్రాక్టీస్ చేశాడు. తర్వాత ఫిట్ నెస్ సర్టిఫికెట్ ను ఎన్సీఏ ఇచ్చిన తర్వాత ముంబై ఇండియన్స్ జట్టుతో కలిసి ముమ్మర ప్రాక్టీసు చేశాడు.


Read more:  ఐపీఎల్ లో పంత్ ఆడుతున్నాడు: బీసీసీఐ

ఐపీఎల్ 2024 సీజన్ లో ముంబై ఇండియన్స్‌ తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. మార్చి 24న అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. గత రెండు సీజన్లలో హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ కి  కెప్టెన్‌గా ఉన్నాడు. ఇప్పుడదే జట్టుపై రివర్స్ లో ఆడుతున్నాడు. ఇదే సృష్టి  వచిత్రం అంటే ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఏమీ చెప్పలేరు. నిన్న మిత్రుడు, నేడు శత్రువు అయిపోయాడని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా  ఉండగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఏం చేసిందంటే తమ అధికారిక ఎక్స్ సైట్ లో  హార్దిక్ పాండ్యా స్వాగత వీడియోను షేర్ చేసింది. దీంతో రోహిత్ శర్మ అభిమానులు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. ఫ్రాంచైజీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు కామెంట్లు చేస్తున్నారు. ఊరికినే రెచ్చగొట్టవద్దని వార్నింగులు ఇస్తున్నారు. ముందు ఆట ఆడి గెలిచిన తర్వాత అప్పుడు మీ డబ్బా కొట్టుకోండి అని హితవు పలుకుతున్నారు.

Related News

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

Big Stories

×