BigTV English

Rishabh Pant will Play IPL 2024: ఐపీఎల్ లో పంత్ ఆడుతున్నాడు: తెల్చిచెప్పేసిన BCCCI

Rishabh Pant will Play IPL 2024: ఐపీఎల్ లో పంత్ ఆడుతున్నాడు: తెల్చిచెప్పేసిన BCCCI

BCCI clears Rishabh Pant to play as wicketkeeper-batter


BCCI Clears Rishabh Pant Will Play IPL 2024: కారు ప్రమాదంలో మృత్యువు వరకు వెళ్లి తృటిలో తప్పించుకున్న రిషబ్ పంత్ ఐపీఎల్ లో ఆడనున్నాడని బీసీసీఐ ప్రకటించింది.
తను ఆరోగ్యంగా ఉన్నాడని, ఆటకు తగినట్టుగా ఫిట్ గా ఉన్నాడని ఎన్సీఏ రిపోర్ట్ ఇచ్చిందని బీసీసీఐ కీలక ప్రకటన చేసింది.
ఐపీఎల్ 17వ సీజన్ కు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు చేసింది. దీంతో రిషబ్ పంత్ ఐపీఎల్ ఆడేందుకు మార్గం సుగమం అయ్యింది.

పంత్ ఐపీఎల్ ఆడి నిరూపించుకోగలిగితే, టీ20 ప్రపంచకప్ లో టీమిండియాకు కలిసొచ్చే అంశం అవుతుందని సీనియర్లు అంటున్నారు. అలాగే జాతీయ జట్టులోకి వచ్చేందుకు తలుపులు తెరుచుకున్నట్టేనని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.


అయితే ఫిట్ గా ఉన్నా సరే, తను ఇటీవలే కీపింగ్ చేయడం మొదలుపెట్టాడు. అందువల్ల మేం కాస్త వేచి చూడాలని అనుకుంటున్నామని బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపాడు. మా మెడికల్ టీమ్ అతని గాయాల పురోగతిని, ఫిట్‌నెస్‌ను పరిశీలిస్తోంది. ఇప్పటికే అతని ఫిట్‌నెస్‌పై గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ‘అని జై షా తెలిపారు.

Also Read: ఒకే ఒక్కడు.. ఒకే జట్టులో 16 ఏళ్లు ఆర్సీబీలో కొహ్లీ ప్రయాణం

2022లో ఢిల్లీ నుంచి ఉత్తరఖండ్‌కు వస్తున్న సమయంలో రూర్కీ సమీపంలోని నర్సన్ సరిహద్దు వద్ద రిషబ్ పంత్ కారుకి ప్రమాదం జరిగింది. ఇందులో తీవ్ర గాయాల పాలై ఏడాది కాలం పాటు ఆసుపత్రిలోనే చికిత్స తీసుకున్నాడు. అప్పటి నుంచి అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు.

నెమ్మదిగా గడిచిన ఆరు నెలల నుంచి ప్రాక్టీసు చేస్తూ, నెమ్మదిగా ఫిట్ నెస్ సాధించాడు. దీంతో బీసీసీఐ చేసిన తాజా ప్రకటనపై పంత్ ఫ్యాన్స్, క్రికెట్ లవర్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఒకవేళ ఎప్పటిలా తను ఆడగలిగితే మళ్లీ టీమ్ ఇండియాలో తన స్థానానికి తిరుగు ఉండదని అంటున్నారు. మరొక వికెట్ కీపర్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన పనిలేదని ఇషాన్ కిషన్ ని దృష్టిలో పెట్టుకు చెబుతున్నారు.అప్పుడు తనకి ధ్రువ్ జురెల్ స్టాండ్ బై గా ఉంటాడని డిసైడ్ చేసేస్తున్నారు.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×