BigTV English

Harshit Rana : గంభీర్ రాజకీయాలు.. వీడొక్కడికే అన్ని ఫార్మాట్ లో ఛాన్స్.. తోపు ఆటగాళ్లకు అన్యాయమే

Harshit Rana : గంభీర్ రాజకీయాలు.. వీడొక్కడికే అన్ని ఫార్మాట్ లో ఛాన్స్.. తోపు ఆటగాళ్లకు అన్యాయమే

Harshit Rana : సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏ ఆటగాడు ఫామ్ లోకి వస్తాడని ఊహించడం కష్టం అని పలు సందర్భాల్లో చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఏ ఆటగాడు ఎప్పుడూ ఎంపిక అవుతాడో ఊహించడం కష్టం అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆసియా కప్ 2025 కోసం టీమిండియా టీమ్ ని ఒక్కసారి పరిశీలించినట్టయితే కొందరూ ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్ కనబరిచినప్పటికీ వారికి మాత్రం నో ఛాన్స్. అద్భుతమైన ఫామ్ లో ఉన్న ఆటగాళ్లను అస్సలు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదే అర్థం కావడం లేదని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. ప్రధానంగా ఆసియా కప్ 2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టు పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ అందరూ స్వాగతిస్తున్ననారు. కానీ వైస్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ పై కొందరూ నెగిటివ్ కామెంట్స్ చేస్తే.. మరికొందరూ పాజిటివ్ గా చెబున్నారు. ముఖ్యంగా కేకేఆర్ బౌలర్ హర్షిత్ రాణాను ఎంపిక చేయడాన్ని మాత్రం చాలా మంది తప్పు బడుతున్నారు.


Also Read : IND Vs PAK : ఆసియా కప్ కంటే ముందు పాకిస్థాన్ ను వణికిస్తున్న రికార్డులు…. టీమిండియాతో పెట్టుకుంటే మాడి మసి అయిపోవాల్సిందే..

వారి కంటే అతనే తోపు ఆటగాడా..? 


ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్ ని ఎంపిక చేయకపోవడం పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హర్షిత్ రాణా పై ట్రోలింగ్స్ చేస్తున్నారు. కేవలం కోల్ కతా కి చెందిన క్రికెటర్ హర్షిత్ రాణా మూడు ఫార్మాట్ల క్రికెటర్.. అద్భుతమైన ఫామ్ కనబరిచే ఆటగాళ్లు మాత్రం కేవలం ఒకే ఒక్క ఫార్మాట్ కి చెందిన క్రికెటర్లా..? అంటూ నిలదీస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ కేవలం వన్డేలకు మాత్రమే టీమిండియా తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కి కూడా అతన్ని ఎంపిక చేయకపోవడం గమనార్హం. మరోవైపు మహ్మద్ షమీ కూడా కేవలం వన్డేలకు మాత్రమే టీమిండియా తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అర్ష్ దీప్ సింగ్ కేవలం టీ-20లకు మాత్రమే పరిమితమయ్యాడు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కి ఎంపికైనప్పటికీ అతను బెంచ్ కే పరిమితమయ్యాడు.

అతని వల్ల ఆ ఆటగాళ్లకు అన్యాయమే..

టీమిండియా మరో క్రికెటర్ కే.ఎల్. రాహుల్ కేవలం టెస్ట్, వన్డే క్రికెట్ కి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రాహుల్ ఐపీఎల్ లో  ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు. అద్భుతంగా రాణించాడు. అయినప్పటికీ రాహుల్ ని ఆసియా కప్ 2025కి ఎంపిక చేయలేదు. కేవలం గంభీర్ కి ఫేవరేట్ అయిన హర్షిత్ రాణాని మాత్రం మూడు ఫార్మాట్లకు ఎంపిక చేయడం ఇప్పుడు గంభీర్ పై మండిపడుతున్నారు. గంభీర్ రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయనే చెప్పవచ్చు. మహ్మద్ సిరాజ్ ఇటీవలే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. కానీ అంత మంచి బౌలర్ ని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సెలెక్ట్ చేయలేదు. సిరాజ్ ని కాదని హర్షిత్ రాణా ను ఎంపిక చేయడంలో గంభీర్ పాత్ర కీలకమని పలువురు నెటిజన్లు గంభీర్ మండిపడుతున్నారు. మూడు ఫార్మాట్లలో ఆ ఆటగాడు ఒక్కడే మొనగాడు.. మిగతా ఆటగాళ్లు ఎవ్వరూ పనికిరారా..? గంభీర్ అంటూ ట్రోలింగ్స్ చేస్తున్నారు.

Related News

BCCI president: బీసీసీఐకి కొత్త బాస్.. ఇక టీమిండియాలో పెను మార్పులు!

IND Vs PAK : ఆసియా కప్ కంటే ముందు పాకిస్థాన్ ను వణికిస్తున్న రికార్డులు…. టీమిండియాతో పెట్టుకుంటే మాడి మసి అయిపోవాల్సిందే..

Tim David: సొంత దేశం వాళ్ళే ఛీ కొట్టారు.. కానీ ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్నాడు.. RCB ప్లేయర్ సక్సెస్ వెనుక కన్నీళ్లు

Sameer Rizvi : సమీర్ రిజ్వి అరాచకం… 9 సిక్సులు, 3 బౌండరీలతో రెచ్చిపోయాడుగా.. ఇదిగో వీడియో

Pro Kabaddi League 2025: నేటి నుంచి ప్రో కబడ్డీ లీగ్… తొలి వాచ్ తెలుగు టైటాన్స్ దే…టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలంటే

Big Stories

×