Komali Prasad:కోమలి ప్రసాద్ (Komali Prasad).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో జన్మించిన ఈమె.. కర్ణాటకలోని బళ్లారిలో పెరిగింది. ప్రవర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జన్ పూర్తి చేసిన ఈమె.. వృత్తిరీత్యా వైద్యురాలు.. కానీ ఇండస్ట్రీలోకి రావాలనే కోరికతో 2016లో ‘నేను సీతాదేవి’ అనే తెలుగు చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ఆ తర్వాత 2020లో ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’, ‘సెబాస్టియన్ పి సి 524’ సినిమాలు చేసిన ఈమె.. లూజర్, లూజర్ 2 వంటి వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. అయితే ఇవేవీ కూడా ఈమెకు పెద్దగా గుర్తింపును అందించలేదు. కానీ ఇటీవల నాని (Nani ) హీరోగా నటించిన ‘హిట్ 3’ సినిమాలో వర్ష పాత్రలో కనిపించి.. తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది కోమలి ప్రసాద్.
నెటిజన్ ప్రశ్నకు కోమలి సమాధానం..
తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన ఈ ముద్దుగుమ్మ.. ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది. అసలు విషయంలోకి వెళ్తే.. “హిట్ ఫ్రాంఛైజీలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలో నటించినందుకు మీరు ఎప్పుడు బాధపడకండి. పోలీస్ గా నటించే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. మీరు అందులో సూపర్ గా నటించారు” అని పోస్ట్ పెట్టారు. దీనికి కోమలి కూడా అదే రేంజిలో సమాధానం తెలిపింది. “నేను హిట్ ఫ్రాంఛైజీలో నటించినందుకు ఎంతో సంతోషంగా ఉన్నాను. అందులోను ఒక స్టార్ హీరోతో పైగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించడం అనేది చాలా పెద్ద విషయం. అలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయి. ముఖ్యంగా ఈ ‘హిట్’ ఫ్రాంఛైజీతోనే నేను ఎంతోమందికి చేరువయ్యాను.
అలాంటి పాత్రల కోసం ఆశగా ఎదురు చూస్తున్నాను – కోమలి ప్రసాద్
ఈ పాత్ర చేసిన తర్వాత నేను విభిన్నమైన పాత్రలు కూడా పోషించగలను అనే నమ్మకం నాలో కలిగింది. ముఖ్యంగా ఐకానిక్ మార్షల్ ఆర్ట్స్ రివైంజ్ డ్రామా ‘కిల్ బిల్’ వంటి పూర్తిస్థాయి యాక్షన్ చిత్రాలలో నటించాలని అనిపిస్తోంది. అంతేకాదు ఇలాంటి పాత్రల కోసం ఆశగా ఎదురు చూస్తున్నాను” అంటూ కూడా కోమలి ప్రసాద్ చెప్పుకొచ్చింది. మొత్తానికి అయితే కోమలి ప్రసాద్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. దర్శక నిర్మాతలు ఈమె కోరికను దృష్టిలో పెట్టుకొని.. ఇలాంటి అవకాశం ఒకటి కల్పించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న హిట్ ఫ్రాంఛైజీ..
ప్రముఖ యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను (Shailesh kolanu) నూతన పరిచయంలో రూపొందిన చిత్రం ‘హిట్’. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 2020లో విశ్వక్ సేన్ (Vishwak sen)తో ప్రారంభమైన ఈ హిట్ ఫ్రాంచైజీ ఆ తర్వాత అడివి శేష్, నానిలతో రెండు మూడు భాగాలు వచ్చాయి. వీటిల్లోనే కోమలి పోలీస్ ఆఫీసర్ గా కనిపించింది. ఇక ఇప్పుడు హిట్ 4 కూడా రాబోతోంది. అయితే ఈసారి ఇందులో కోలీవుడ్ హీరో కార్తీ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.
also read:HBD Nagarjuna : 100 కోట్ల టార్గెట్ గా 100వ మూవీ… అందుకే ఈ ఆలస్యం