ICC Champions Trophy: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( ICC Champions Trophy 2025 ) రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో… అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కీలక ప్రకటన చేసింది. కామెంటేటర్ల వివరాలను తాజాగా ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( International Cricket Council) . ఇంగ్లీష్, హిందీ, తెలుగు, భోజ్పూరి, కన్నడ, మరాటి, బంగ్లా, హరియాన్వి, తమిళ్ భాషలలో కామెంటేటర్లను ఫైనల్ చేస్తూ అధికారిక ప్రకటన చేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. అయితే ఈ లిస్టు లో… అన్ని దేశాల మాజీ క్రికెటర్లు, కొంత మంది సెలబ్రిటీలు ఉన్నారు.
ముఖ్యంగా ఇంగ్లీషులో సునీల్ గవాస్కర్ ( Sunil Gavaskar ) , రవి శాస్త్రి, దినేష్ కార్తీక్, మ్యాథ్యూ హెడెన్, లాంటి దిగ్గజ క్రికెటర్లు ఉండడం జరిగింది. ఇక హిందీ విషయానికి వస్తే… రాబిన్ ఉతప్ప, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, పలువురు పాకిస్తాన్ క్రికెటర్లు, సంజయ్ మంజరైకర్ లాంటి మాజీ క్రికెటర్లు కూడా హిందీలో వ్యాఖ్యానించనున్నారు. తెలుగు విషయానికి వస్తే… ఎం ఎస్ కే ప్రసాద్, అంబటి రాయుడు, హనుమ విహారి, తిరుమల శెట్టి సుమన్, ఆశిష్ రెడ్డి, ఆక్సాత్ రెడ్డి, కౌశిక్, కళ్యాణ్ కృష్ణ, యాంకర్ విద్య లాంటి ఎంతో మంది స్టార్లు ఉన్నారు. వీరందరూ తెలుగులో కామెంట్రీ ఇస్తారు.
ఇలా పైన చెప్పిన అన్ని భాష ల్లో… కామెంట్రీ చెప్పే వ్యక్తుల పేర్లను ఖరారు చేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. ఇది ఇలా ఉండగా.. చాంపియన్స్ ట్రోఫీ 2025 రేపటి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు… చాంపియస్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా… న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైట్ ఉండనుంది. ఈ రెండు జట్ల మధ్య… లాహోర్ లోని నేషనల్ స్టేడియంలో ఫైట్ ఉంటుంది.
భారత కాలమానం ప్రకారం మధ్యా హ్నం 1:30 గంటల తర్వాత… మ్యాచ్ మనం లైవ్ లో చూడవచ్చు. ఇక చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( ICC Champions Trophy 2025 ) మొత్తం… జియో హాట్ స్టార్ లో… మనం చూడవచ్చు. అలాగే స్టార్ స్పోర్ట్స్ లో కూడా తిలకించవచ్చు. ఇది ఇలా ఉండగా చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్… హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అంటే టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్ దుబాయిలో జరుగుతుంది. మిగిలిన మ్యాచ్ లన్ని పాకిస్తాన్లోని ఇతర స్టేడియాల్లో జరుగుతాయి. దీంతో.. ఇప్పటికే దుబాయ్ కి వెళ్ళింది టీమిండియా. టీమిండియా తన మొదటి లీగ్ మ్యాచ్… బంగ్లాదేశ్ తో ఆడ పోతుంది. టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య.. ఈనెల 20వ తేదీ అంటే ఎల్లుండి… మ్యాచ్ జరగనుంది. ఈనెల 23వ తేదీన అంటే ఆదివారం రోజున… టీమిండియా ( Team India ) వర్సెస్ పాకిస్తాన్ ( Pakisthan ) మధ్య ఫైట్ ఉంటుంది.