EPAPER

IND vs PAK: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ లో భారీ మార్పులు.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

IND vs PAK: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ లో భారీ మార్పులు.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

IND vs PAK: మహిళల టి20 ప్రపంచ కప్ 2024… టోర్నమెంట్ కు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే.. ఇందులో భాగంగానే ఐసీసీ కీలక ప్రకటన చేసింది. మహిళల టి20 ప్రపంచ కప్ కు సంబంధించిన షెడ్యూల్ ను తాజాగా కొంతమేర సవరించి.. రిలీజ్ చేసింది ఐసీసీ పాలక మండలి. వాస్తవానికి మహిళల టి20 ప్రపంచ కప్… తొలిత బంగ్లాదేశ్ లో జరగాల్సింది. కానీ బంగ్లాదేశ్ లో అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.


 

ప్రస్తుతం బంగ్లాదేశ్‌ లో రాజ్యాంగ సంక్షోభం నెలకొంది. రిజర్వేషన్ల కోసం… ప్రభుత్వంపైనే విద్యార్థులు అలాగే నిరుద్యోగులు తిరుగుబాటు చేశారు. ప్రధానినే దేశం నుంచి తరమికొట్టారు. అలాగే హిందువులపై కూడా బంగ్లాదేశ్ లో దాడులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో టి20 ప్రపంచ కప్ ను.. బంగ్లాదేశ్ లో కాకుండా… యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు మార్చేసింది ఐసీసీ. అంతేకాకుండా అక్టోబర్ మూడవ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ టి20 మహిళల ప్రపంచ కప్ కు సంబంధించిన షెడ్యూల్ ను కూడా కాస్త మార్చింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. మొదటగా బంగ్లాదేశ్ వర్సెస్ స్కాట్లాండ్ మహిళల జట్ల మధ్య అక్టోబర్ మూడవ తేదీన మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం… ఆతిథ్యం ఇవ్వబోతుంది.


ICC Women’s T20 World Cup 2024 schedule

భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య… మ్యాచ్ ఎప్పుడు అని ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే టీమిండియా షెడ్యూల్ ఒకసారి చూసుకున్నట్లయితే… మొట్టమొదటిగా న్యూజిలాండ్తో తలపడనుంది టీమిండియా మహిళల జట్టు. అక్టోబర్ 4వ తేదీన న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా మధ్య కీలక ఫైట్ జరగనుంది. అక్టోబర్ ఆరవ తేదీన టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ నిర్వహించనున్నారు.

ఐసీసీ మహిళల t20 ప్రపంచ కప్ 2024లో మొత్తం… 23 మ్యాచ్ లు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ అక్టోబర్ మూడవ తేదీన ప్రారంభమై… అక్టోబర్ 20వ తేదీ వరకు జరగనుంది. అంటే దాదాపు 20 రోజుల పాటు… ఈ మ్యాచ్ హడావిడి కనిపిస్తుంది. అంతేకాదు ఈ టి20 ప్రపంచ కప్ కు సంబంధించిన సెమీఫైనల్… అలాగే ఫైనల్ మ్యాచ్ల కోసం రిజర్వుడే కూడా ప్రకటిం చేశారు. ఇక ఈ టి20 మహిళల ప్రపంచ కప్ లో మొత్తం 10 జట్లు ఉన్నాయి. పది జట్లు ఉన్న నేపథ్యంలో అన్ని జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఎ లో టీమిండియా న్యూజిలాండ్ పాకిస్తాన్ శ్రీలంక అలాగే ఆస్ట్రేలియా జట్టు ఉన్నాయి. అటు గ్రూప్ బి లో ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా వెస్టిండీస్ స్కాట్లాండ్ మరియు బంగ్లాదేశ్ జట్టు ఉన్నాయి. ఏ గ్రూపులో అయినా మొదటి రెండు స్థానాలలో నిలిచిన జట్లు సెమీఫైనల్ కు వెళ్లనున్నాయి. సెమీఫైనల్ లో గెలిచిన జట్టు ఫైనల్ కు వెళ్తాయి.

Related News

Ind vs NZ Test Series: టీమిండియాకు తిరుగులేని రికార్డు… 24 ఏళ్లలో న్యూజిలాండ్‌ ఒక్కసారి గెలవలేదు !

IND vs NZ: న్యూజిలాండ్‌కు మరో ఎదురు దెబ్బ.. మరో ప్లేయర్ ఔట్‌ !

IND vs NZ 2024 Test Series: రేపటి నుంచే టెస్టు సిరీస్… హాట్‌స్టార్‌లో రాదు! ఫ్రీగా ఎలా చూడాలంటే..?

IPL 2025: ఢిల్లీకి షాక్‌.. వేలంలోకి రిషబ్‌ పంత్‌ ?

Team India: పాకిస్తాన్ దారుణ ఓటమి.. ప్రపంచ కప్ నుంచి టీమిండియా నిష్క్రమణ  

Babar Azam: 6 జంతువుల మాంసం తింటున్న బాబర్?

IPL 2025: అంబానీ బిగ్‌ స్కెచ్‌.. ముంబై ఇండియన్స్‌‌‌కు కొత్త కోచ్ నియామకం.!

Big Stories

×