Asia Cup 2025 : ఆసియా కప్ 2025 టీమిండియా తన తొలి మ్యాచ్ లో యూఏఈతో తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో 2.1 ఓవర్లు బౌలింగ్ వేసి 4 వికెట్లు తీసుకున్న కుల్దీప్ యాదవ్ టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా చాలా రోజుల తరువాత మైదానంలోకి దిగిన కుల్దీప్.. నాలుగు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే యూఏఈతో 4 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ పై కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 4 వికెట్లతో అదరగొట్టినప్పటికీ కుల్దీప్ యాదవ్ ను తదుపరి మ్యాచ్ లో పక్కన పెడుతారని మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ ముంజ్రెకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : Asia Cup 2025 : దుబాయ్ స్టేడియం లో టీమిండియా ఫ్యాన్స్ రచ్చ… రోహిత్, కోహ్లీ ప్లకార్డులతో
“ఎప్పుడైతే అతను అద్భుతంగా రాణిస్తాడో.. నెక్ట్స్ మ్యాచ్ లో చోటు కోల్పోతాడు. నేను జస్ట్ జో్ చేస్తున్నా. కానీ టీమిండియాలో అతని కెరీర్ చూస్తే.. ఇదే అర్థమవుతోంది. మంచి సత్తా ఉన్న ఆటగాడికి ఇలా జరుగుతోంది. అంత అతని తలరాత” అంటూ పేర్కొన్నారు సంజయ్ ముంజ్రెకర్. అతని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెప్టెంబర్ 14న పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ ఉండడా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి టీమిండియా యూఏఈతో ఆడిన జట్టులో ఫాస్ట్ బౌలర్లు అర్ష్ దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి వారు కనిపించలేదు. వాళ్లు వాటర్ బాయ్స్ గా కనిపించారు. అయితే పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో మాత్రం అర్ష్ దీప్ సింగ్ లేదా ప్రసిద్ధ్ కృష్ణలలో ఒకరిని తీసుకునే అవకాశం కనిపిస్తోంది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ల లో బుమ్రా కీలకంగా మారనున్నాడు.
బుమ్రా, హార్దిక్ పాండ్యా ఫాస్ట్ బౌలింగ్ వేసినప్పటికీ ఆల్ రౌండర్లు మాత్రమే కాకుండా ఒక ఫాస్ట్ బౌలర్ ని తీసుకునే అవకాశం ఉంది. దీంతో కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్ లో ఆడుతాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బ్యాటింగ్ పరంగా చూస్తే.. టీమిండియా అభిషేక్ శర్మ, శుబ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబె, అక్షర్ పేటేల్, హార్దిక్ పాండ్యా 8 మంది ఆల్ రౌండర్లతో టీమిండియా పటిష్టంగా ఉంది. బౌలర్లు బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ని తీసుకున్నారు. పాక్ తో మాత్రం కాస్త ఛేంజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. అలా ఛేంజ్ చేస్తే.. స్పిన్నర్లలో ఒకరిని తీసేసి ఫాస్ట్ బౌలర్లకు అవకాశం ఇవ్వాలి. ఒకవేళ అలా చేస్తే.. స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి లేదా కుల్దీప్ యాదవ్ లలో ఒకరిని తీసేసే ఛాన్స్ ఉంది. కానీ టీమిండియా ఎలాంటి ఛేంజ్ లేకుండా అదే టీమ్ ను కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. పాక్ తో మ్యాచ్ లో ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో వేచి చూడాలి.