ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీహార్ పై కేంద్రం సరికొత్త వరాల జల్లు కురిపిస్తోంది. అందులో భాగంగానే వందే భారత్, అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ లతో సహా నాలుగు కొత్త రైళ్లు ఆ రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నాయి. వీటిని సెప్టెంబర్ 15న ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ ఏడాది చివరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ రైళ్లు రాష్ట్ర వ్యాప్తంగా కనెక్టివిటీని మరింత పెంచనున్నాయి.
బీహార్ లోని జోగ్బాని- దానాపూర్ మధ్య ఈ కొత్త వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు అందుబాటులోకి రానుంది. ఈ రైలు ఫోర్బ్స్ గంజ్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించబడుతుంది. ఈ రైలు 08:10 గంటల్లో 453 కి.మీ. దూరాన్ని ప్రయాణిస్తుంది. ఈ రైలు సగటున గంటకు 55.47 కి.మీ. వేగంతో నడుస్తుంది.
అటు బీహార్ కు రెండు కొత్త అమృత్ భారత్ రైళ్లు కూడా అందుబాటులోకి రానునాయి. కొత్త అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు జోగ్‌బానీ నుంచి ఈరోడ్, సహర్సా- ఛెహర్తా (అమృత్‌సర్) మధ్య నడుస్తాయి. జోగ్ బానీ నుంచి ఈ రోడ్ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ వారానికి ఒకసారి నడుస్తుంది. ఇది 63.50 గంటల్లో 3,129 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. ఈ రైలు సగటున గంటకు 49.01 కి.మీ. వేగంతో నడుస్తుంది. సహర్సా నుంచి ఛెహర్తా అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ సుపాల్, సరాయ్ గఢ్, ఝంఝర్ పూర్, సీతామర్హి, రక్సౌల్, నర్కటియాగంజ్, గోరఖ్ పూర్, మొరాదాబాద్, అంబాలా కాంట్ రూట్ లో నడుస్తుంది.
రైలు నెం. 05531 నంబర్ గల సహర్సా-ఛెహర్తా అమృత్ భారత్ ప్రారంభోత్సవ స్పెషల్ రైలు.. సహర్సా నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు బయల్దేరుతుంది. సుపాల్ కు సాయంత్రం 4.00 గంటలకు చేరుకుంటుంది. సరాయ్ గఢ్ కు సాయంత్రం 4.40 గంటలకు చేరుకుంటుంది. నిర్మాలికి 5.15 గంటలకు చేరుకుంటుంది. ఝంఝర్ పూర్ కు 6.05 నిమిషాలకు చేరుకుంటుంది. సక్రికి 6.35 గంటలకు చేరుకుంటుంది. సిహోకు 9.25 గంటలకు చేరుకుంటుంది. సీతామర్హికి 8.45 గంటలకు చేరుకుంటుంది. రక్సౌల్ కు రాత్రి 10.25 గంటలకు చేరుతుంది. నర్కటియాగంజ్ కు 11.35కి చేరుతుంది. బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు ఛెహర్తా చేరుకుంటుంది.
Read Also: ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే 10 రైళ్లు ఇవే.. స్పీడ్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
అటు కతిహార్-సిలిగురి-కతిహార్ ఎక్స్ ప్రెస్ రైలును కూడా ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. వారంలోని అన్ని రోజుల పాటు అందుబాటులో ఉండే ఈ రైలును అరర్రియా కోర్ట్ రైల్వే స్టేషన్ నుంచి ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు 04:15 గంటల్లో 164 కి.మీ దూరాన్ని కవర్ చేస్తుంది. ఇది సగటున గంటకు 38.58 కి.మీ వేగంతో నడుస్తుంది.
Read Also: ఐజ్వాల్ కు తొలి రైలు.. జెండా ఊపి ప్రారంభించబోతున్న ప్రధాని మోడీ!