BigTV English

IND Vs PAK : భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై పిటిషన్‌.. సుప్రీం కోర్టు ఆగ్రహం

IND Vs PAK : భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై పిటిషన్‌.. సుప్రీం కోర్టు ఆగ్రహం

IND Vs PAK : ఆసియా క‌ప్ 2025లో భాగంగా సెప్టెంబ‌ర్ 14 టీమిండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మ‌ధ్య మ్యాచ్ దుబాయ్ వేదిక‌గా జ‌రుగ‌నుంది. ఈ నేప‌థ్యంలోనే ఆసియా క‌ప్ 2025లో సెప్టెంబ‌ర్ 14న భార‌త్-పాక్ మ్యాచ్ నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని సుప్రీంకోర్టులో ఓ పిటిష‌న్ దాఖ‌లు అయింది. అయితే సెప్టెంబ‌ర్ 14న మ్యాచ్ ఉండ‌టంతో త్వ‌ర‌గా విచార‌ణ చేప‌ట్టాల‌ని పిటిష‌న‌ర్ కోరారు. దీంతో సుప్రీంకోర్టు పిటిష‌నర్ పై మండిప‌డింది. విచార‌ణ చేప‌ట్ట‌డానికి అంత తొంద‌రేమి లేద‌ని పేర్కొంది. ఊర్వ‌శి జైన్ అనే విద్యార్థిని ఈ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అయితే ఈ మ్యాచ్ ప‌హ‌ల్గామ్ బాధితులు, సైనికుల మ‌నోబావాలు దెబ్బ‌తీస్తాయ‌ని ఆమె త‌లిపింది. ప‌హ‌ల్గామ్ లో పాకిస్తాన్ ఉగ్ర‌వాదులు దాడి చేయ‌డంతో టీమిండియా.. పాకిస్తాన్ తో జ‌రుగ‌బోయే మ్యాచ్ ని ర‌ద్దు చేయాల‌ని కొంద‌రూ, మ‌రికొంద‌రూ అస్స‌లు ఆడ‌కూడ‌ద‌ని ఇంకొంద‌రూ కామెంట్స్ చేస్తున్నారు.


Also Read : Asia Cup 2025 : టీమిడియా వర్సెస్ పాకిస్తాన్ కు కుల్దీప్ దూరం.. 4 వికెట్లు తీసినా వేటు పడాల్సిందే!

టీమిండియా Vs పాకిస్తాన్ మ్యాచ్ ని ర‌ద్దు చేయండి

ఈ నేప‌థ్యంలోనే సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేయ‌డంతో ఈ మ్యాచ్ పై ఉత్కంఠ నెల‌కొంది. అటు ఆట ప‌రంగా.. ఇటు పోటీ ప‌రంగా చాలా ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగనున్న‌ది.  వాస్త‌వానికి ఫిబ్ర‌వ‌రి 14న జ‌రిగిన ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడిలో 26 మంది భార‌తీయులు మ‌ర‌ణించారు. అయితే ఈ ఉగ్ర‌దాడి త‌రువాత పాకిస్తాన్ తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవ‌ద్ద‌ని భార‌త్ నిర్ణ‌యం తీసుకుంది. ఇది జ‌రిగిన కొద్ది నెల‌ల‌కే పాకిస్తాన్ తో భార‌త జట్టు మ్యాచ్ ఆడేందుకు సిద్ధం కావ‌డంతో తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ‌స్తోంది. తాజాగా కేత‌న్ తిరోక్ద‌ర్ అనే లాయ‌ర్ సెప్టెంబ‌ర్ 14న ఇండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మ‌ధ్య జ‌రిగే ఆసియా క‌ప్ 2025 మ్యాచ్ ను వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖ‌లు చేశాడు. ఈ మ్యాచ్ భార‌త రాజ్యాంగానికి వ్య‌తిరేకంగా జ‌రుగుతుంద‌ని.. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 21ని ఉల్లంఘించి ఉగ్ర‌వాద దేశంతో మ్యాచ్ ఆడుతుందంటూ త‌న పిటిష‌న్ లో పేర్కొన్నాడు అడ్వ‌కేట్.


ఇలాంటి స‌మ‌యంలో మ్యాచ్ ఆడ‌టం ఎంతవ‌ర‌కు స‌మంజ‌సం..?

మ‌రోవైపు” బీసీసీఐ ప్ర‌క‌టించిన ఈ క్రీడా విధానం అత్యంత క్రూర‌మైన‌ది., ప‌క్ష‌పాతం క‌లిగించేద‌ని.. కాశ్మీర్ లోయ‌లో పాకిస్తాన్ ఉగ్ర‌వాదులు, భార‌త పౌరుల‌ను అత్యంత దారుణంగా హ‌త‌మార్చారు. మార‌ణ‌కాండ సాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి స‌మ‌యంలో పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ ఆడ‌టం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం..? అని ఇది భార‌త పౌరుల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం చూపిస్తుంది. ఇది భార‌త పౌరుల హ‌క్కుల‌ను వ్య‌వ‌హ‌రించ‌డ‌మే.. భార‌త ప్ర‌జ‌ల ప్రాణాల‌కు ఏమైనా మేము లెక్క చేయం. కేవ‌లం డబ్బు కోసం, వినోదం కోసం మాత్ర‌మే బీసీసీఐ న‌డుస్తుంద‌నే త‌ప్పుడు మెసేజ్ ప్ర‌జ‌ల్లోకి వెళ్తుంది” అంటూ పిటిష‌న్ లో పేర్కొన్నారు. మ‌రోవైపు వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో బార‌త ఛాంపియ‌న్స్ జ‌ట్టు ఆడ‌లేదు.. కానీ ఆసియా క‌ప్ లో ఆడ‌టంలో ఆంత‌ర్యం ఏమిటో అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.

Related News

ICC : ఐసీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం…ఇక‌పై మహిళలే అంపైర్లు, మ్యాచ్‌ రిఫరీలు

Asia Cup 2025 : UAE తో డేన్వర్ భారీ డీలింగ్… ఇండియాను కాదని ఆసియా కప్ లోకి ఎంట్రీ

Gill-Sara : దొంగచాటుగా దుబాయ్ వెళ్లిన సారా.. గిల్ బ్యాటింగ్ చేస్తుండగా క్రౌడ్ లోంచే ?

Kavya Maran : ఈ ప్లేయర్లను వాడుకుని వదిలేసిన SRH కావ్య పాప?

Asia Cup 2025 : టీమిడియా వర్సెస్ పాకిస్తాన్ కు కుల్దీప్ దూరం.. 4 వికెట్లు తీసినా వేటు పడాల్సిందే!

Big Stories

×