ICC : ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ లో ఈ సారి అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు, మహిళలే ఉండనున్నారు. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 02 వరకు మొత్తం 5 వేదికల్లో ఈ మ్యాచ్ లు జరుగనున్నాయి. వాటి బెంగళూరు చిన్నస్వామి స్టేడియం, గువాహటి లోని ఏసీఏ స్టేడియం, ఇందౌర్ హోల్కర్ స్టేడియం, విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం, కొలొంబోని ప్రేమదాస స్టేడియంలో మ్యచ్ లు జరుగుతాయి. భారత్-శ్రీలంక సంయుక్తంగా ఈ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. గతంలో మహిళల టీ-20 వరల్డ్ కప్, కామన్వెల్త్ గేమ్స్ లో కూడా మహిళా అంఫైర్లు, రిఫరీలను నియమించారు.
ఈ మెగా టోర్నీ కోసం 14 మంది మహిళా అంపైర్లు, నలుగురు మహిళా మ్యాచ్ రిఫరీలను ప్రకటించింది. కాగా.. మహిళల వన్డే ప్రపంచకప్ చరిత్రలో మొత్తం మహిళా అధికారులనే నియమించడం ఇదే తొలిసారి. ఐసీసీ అధ్యక్షుడు జై షా ఈ చారిత్రక నిర్ణయం తీసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. మొత్తం మహిళా మ్యాచ్ అధికారుల ప్యానెల్‌ను చేర్చడం ఒక ప్రధాన మైలురాయి మాత్రమే కాదు.. క్రికెట్ అంతటా లింగ సమానత్వాన్ని పెంపొందించడానికి ICC యొక్క అచంచలమైన నిబద్ధతకు నిదర్శనం అని జైషా అన్నారు. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు శ్రీలంకతో తలపడుతుంది. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 2న జరుగుతుంది. భారత మహిళల క్రికెట్ జట్టు నాలుగో సారి వరల్డ్ కప్ కి ఆతిథ్యం ఇవ్వనుంది. గతంలో 1978, 1997, 2013 సంవత్సరాల్లో భారత్ ప్రపంచ కప్ నకు ఆతిథ్యం ఇచ్చింది. ఈ ఏడాది కూడా భారత గడ్డ పై వరల్డ్ కప్ జరగడం విశేషం.
ట్రూడీ ఆండర్సన్, షాండ్రే ఫ్రిట్జ్ , జి.ఎస్. లక్ష్మి, మిచెల్ పెరెరాలు మ్యాచ్ రిఫరీలు వ్యవహరించనున్నారు.
లారెన్ అగెన్‌బాగ్, కాండేస్ లా బోర్డే, కిమ్ కాటన్, సారా దంబనేవానా, షాతీరా జాకీర్ జెస్సీ, కెర్రిన్ క్లాస్టే, జననీ ఎన్, నిమాలి పెరెరా, క్లైర్ పోలోసాక్, బృందా రాఠీ, స్యూ రెడ్‌ఫెర్న్, ఎలోయిస్ షెరిడాన్, గాయత్రి వేణుగోపాలన్, జాక్వెలైన్స్.