Asia Cup 2025 : ఆసియా కప్ 2025లో భాగంగా భారత్ వర్సెస్ యూఏఈ మధ్య రెండు జట్లకు తొలి మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ టోర్నీలో తొలి మ్యాచ్ అప్గానిస్తాన్ వర్సెస్ హాంకాంగ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ సమయంలో UAE జట్టు ఆటగాళ్లు డేన్వర్ కంపెనీ కి చెందిన ధరించారు. దీంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వాస్తవానికి డేన్వర్ కంపెనీ ఇండియాతో కూడా కుదుర్చుకుంటానని చెప్పింది. కానీ ఉన్నట్టుండి యూఏఈతో డీల్ కుదర్చుకోవడంతో అంతా దీని గురించే చర్చించుకుంటున్నారు. ఇండియా కంటే యూఏఈ డబ్బులు అంతగా ఏమి ఖర్చు చేయదు. కానీ డెన్వర్ కంపెనీతో యూఏఈ డీల్ కుదుర్చుకోవడం గమనార్హం. దీనిపై రకరకాల చర్చలు జరగడం విశేషం.
Also Read : Gill-Sara : దొంగచాటుగా దుబాయ్ వెళ్లిన సారా.. గిల్ బ్యాటింగ్ చేస్తుండగా క్రౌడ్ లోంచే ?
డేన్వర్ ఇండియాని కాదని UAE తో భారీ డీలింగ్ చేసుకుంది. యూఏఈకి భారీ డబ్బులు ఇస్తోంది డెన్వర్. మరోవైపు టీమిండియా (Team India) కి ప్రస్తుతం స్పాన్సర్ షిప్ లేదనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రమోషన్ బిల్లు రెగ్యులేషన్ ఆఫ్ ఆన్ లైన్ గేమింగ్ బిల్లు 2025 అమలులోకి వచ్చిన నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) తమ జట్లకు జెర్సీ స్పాన్సర్ గా ఉన్న ప్రధాన గేమింగ్ ప్లాట్ ఫామ్ డ్రీమ్ 11 (Dream 11) తో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నది. అయితే తాజాగా బీసీసీఐ (BCCI) టీమిండియా జెర్సీ స్పాన్సర్ షిప్ రేట్లను అమాంతం పెంచేసింది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్ల జెర్సీలకు అధికారికంగా స్పాన్సర్ లేకుండా పోయారు. ఈ ఏడాది అక్టోబర్ లో వెస్టిండీస్ తో జరిగే టెస్ట్ సిరీస్ సమయానికి టీమిండియా (Team India) స్పాన్సర్ షిప్ తో ఒప్పందం కుదుర్చుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఇండియన్ బ్యాంకింగ్ లకు షాక్ ఇస్తోంది. ఈ తరుణంలోనే ఈనెల 09న టీమిండియా స్పాన్సర్ షిప్ కోసం భారత క్రికెట్ బోర్డు టెండర్లను ఆహ్వానించింది. అయితే ఆసక్తి ఉన్న కంపెనీలు సెప్టెంబర్ 16 లోపు దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ డెడ్ లైన్ విధించింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అంటే ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ క్రికెట్ బోర్డు అని చెప్పవచ్చు. బీసీసీఐ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే..? 2019లో బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ 6059 కోట్లు కాగా.. 2025 ప్రస్తుతం వరకు రూ.20680 కోట్లకు చేరుకోవడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. కేవలం 6 సంవత్సరాల్లోనే ట్రిపుల్ కంటే కాస్త ఎక్కువ పెరగడంతో షాక్ అవుతున్నారు.ఆరేళ్లలో 14,627 కోట్లు సంపాదించడం విశేషం. ఇక బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు కావడంతో ప్రపంచ క్రికెట్ మొత్తాన్నే శాసిస్తుంది. . ముఖ్యంగా ఐపీఎల్ బీసీసీఐ దశ, దిశనే మార్చేసిందని చెప్పవచ్చు. ప్రపంచంలో ఏ క్రికెట్ బోర్డు కూడా ఇంత రిచ్ కాదు అని నెటిజన్లు చర్చించుకోవడం విశేషం. ఇంత తక్కువ సమయంలో బీసీసీఐ ఇంత రిచ్ గా కావడానికి కారణాలు ఏంటి..? అని ప్రశ్నలు సంధించుకోవడం గమనార్హం.