TV: చైల్డ్ ఆర్టిస్టులకు అటు సినిమాలలో.. ఇటు సీరియల్స్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ చైల్డ్ ఆర్టిస్టుల కోసమే సినిమాలు చూసేవాళ్ళు ఉంటారు. అంతేకాదు వీరి పాత్రలు చుట్టూ తిరిగే ఎన్నో సినిమాలు తెరపైకి వచ్చి మంచి విజయాన్ని కూడా అందుకున్నాయి. ఇకపోతే చైల్డ్ ఆర్టిస్టులకు అటు షూటింగ్ సెట్లో కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ తన కూతురుకి నరకం చూపించారు అంటూ ఒక తల్లి ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా సాక్షాలను కూడా ఆమె బయటపెట్టారు.
ఈ మేరకు చైల్డ్ ఆర్టిస్ట్ నిషిత (Nishita) తల్లి ప్రియ (Priya ) అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చిత్ర బృందంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. “నా కూతురుకి ఆరోగ్యం బాగా లేకపోయినా షూటింగ్ చేయించారని.. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపినా.. ఆఖరికి నా కూతుర్ని సీరియల్ నుంచి తీసేసి ఇంకొకరిని పెట్టుకున్నారు” అంటూ తన బాధను వెల్లడించింది నిషిత తల్లి ప్రియ. ఈ మేరకు ఒక వీడియోని కూడా పంచుకున్నారు ప్రియా.
ALSO READ:Bigg Boss 9: కెప్టెన్సీ టాస్క్.. ఇమ్మానుయేల్, భరణి పరువు తీసిన కామనర్!
చిన్నారి అని తెలిసి కూడా జాగ్రత్తలు తీసుకోలేదు..
ఆ వీడియోలో ఏముందనే విషయానికి వస్తే.. నిషితను గార్డెన్ ఏరియాలో లైట్స్ ఉన్న దగ్గర పడుకోబెట్టారు. అయితే అక్కడున్న లైట్స్ ద్వారా కరెంటు షాక్ రావడంతో ఆ పాప నిస్సహాయ స్థితిలో అరవడం మనం చూడవచ్చు. అక్కడ చుట్టూ అంతమంది ఉన్నా.. పట్టించుకోకపోవడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి. ఇక మరో సీన్ లో పాప భయపడుతున్నా సరే బలవంతంగా స్విమ్మింగ్ పూల్ లోకి లాగారు. పైగా పాప కోసం అక్కడ ఎటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. అక్కడితో ఆగకుండా ఆ పాపకి ఆరోగ్యం బాగాలేక బెడ్ పై ఉన్నా సరే విశ్రాంతి లేకుండా షూటింగ్ కి రమ్మని.. అనారోగ్యంతోనే సెట్ కి వచ్చి షూట్ చేసింది అని , తన కూతురు చేసిన త్యాగాలను ఆ తల్లి చెప్పుకొచ్చింది.
నా కూతురికి నరకం చూపించారు..
పైగా చిన్న పాప అని చూడకుండా చాలా నరకం చూపించారని, ఏప్రిల్ నుండి రెమ్యూనరేషన్ ఇవ్వకుండా ఆపేసారని, పని చేయించుకుని డబ్బులు ఇవ్వకపోగా.. 150 ఎపిసోడ్ల తర్వాత చిన్నారిని తొలగించి ఇంకొకరిని తీసుకున్నారు అంటూ ఆ తల్లి తెలిపింది. ఆమె మాట్లాడుతూ..” మీరు నా కూతుర్ని రీప్లేస్ చేయగలరేమో కానీ.. ఆమె టాలెంటును కాదు. నెలల తరబడి టిఆర్పి కోసం నా కూతుర్ని వాడుకున్నారు. ఇప్పుడేమో ఎక్స్పెన్సివ్ కిడ్ అని పక్కన పెట్టేశారు. ఈ సీరియల్ కోసమే ఎన్నో ప్రాజెక్ట్లు కూడా మేము వదులుకున్నాము. ఇప్పుడు ఒక్క మాటైనా చెప్పకుండా తీసేశారు” అంటూ నిషిత తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు పాపను ఇబ్బంది పెట్టిన ఆ సీరియల్ నిర్మాత ఫోటోని కూడా చూపించింది ప్రియా. ఇకపోతే నిషిత కన్నడలో ‘ లక్ష్మీ నివాస’ అనే సీరియల్ లో నటించింది. ఇందులో ఈ పాప పోషించిన ఖుషీ పాత్ర ఈమెకు మంచి ఇమేజ్ అందించింది.
?utm_source=ig_web_copy_link