BigTV English

Ind vs Nz Match : భారత్ కు కివీస్ సవాల్.. సెమీస్ గండం దాటేనా..?

Ind vs Nz Match :  భారత్ కు కివీస్ సవాల్..  సెమీస్ గండం  దాటేనా..?
Ind vs Nz Match

Ind vs Nz Match : ఇండియా-నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ తో మెగా టోర్నమెంట్ లో లీగ్ మ్యాచ్ ల ప్రధాన అంకం ముగిసింది. ఇక చివరి నాకౌట్ పోరాటానికి తెర లేచింది. ఇంతవరకు టీమ్ ఇండియా ఓటమన్నదే ఎరుగుని తిరుగులేని జట్టుగా నిలిచింది.


ఇక ఇప్పుడు జరగబోయే చివరి రెండు మ్యాచ్ లు ప్రాణాంతకమైనవి.. ఇక్కడెలా ఆడతారనేదానిపైనే 140 కోట్ల భారతీయుల ఆశలు ముడిపడి ఉన్నాయి. అందుకే ఒకసారి నాకౌట్ మ్యాచ్ ల్లో ఇండియా-న్యూజిలాండ్ మధ్య బలబలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అలాగే మొదటి సెమీ ఫైనల్ జరిగే ముంబై వాంఖడే స్టేడియం పిచ్ పరిస్థితి తెలుసుకుందాం.

ఇదే స్టేడియంలో లీగ్ దశలో ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఆ తర్వాత బౌలర్లకు అనుకూలించడంతో  శ్రీలంక 19.5 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. దీనిని బట్టి అర్థమైంది ఏమిటయ్యా అంటే ఇక్కడ టాస్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. టాస్ గెలిచామా? సగం విజయం సాధించినట్టేనని చెప్పాలి.


ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ చేసేవాళ్లకు మ్యాచ్ 25 ఓవర్ దగ్గర నుంచి పిచ్ మహా టర్న్ అవుతుందని అంటున్నారు. అప్పటికి సీనియర్లు గానీ అవుట్ అయి, చివరి ఐదు వికెట్లుగానీ మిగిలి ఉంటే, వెంటనే చాప చుట్టేయడం కామన్ అంటున్నారు. లీగ్ దశలో ఈ పిచ్‌పై నాలుగు మ్యాచ్‌లు జరిగితే మూడు సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. దీనిని బట్టే చెప్పవచ్చునని అంటున్నారు. లేదంటే ఆరోజు ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ మ్యాక్స్ వెల్ లా వీరదంచుడు దంచాలని అంటున్నారు.

పిచ్ పరిస్థితి ఇలా ఉంటే న్యూజిలాండ్-ఇండియా మధ్య ఐసీసీ నాకౌట్ మ్యాచ్ ల్లో 2016 నుంచి ప్రతీసారి ఇండియా ఓడిపోతూనే ఉంది. 2019 ప్రపంచకప్ సెమీఫైనల్స్ న్యూజిలాండ్ చేతిలో ఇండియా ఓటమిపాలైంది. దీనినెవరూ మరిచిపోలేరు. అలాగే  2021 ప్రపంచటెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ కూడా అదే పరిస్థితి ఎదురైంది.

ఇక టీ20 ప్రపంచకప్‌లో కూడా ఇదే అనుభవం చవి చూశారు. ఇక ఓవరాల్ గా కివీస్-ఇండియా మధ్య 117 వన్డేలు జరిగాయి. అందులో ఇండియా 59 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. కివీస్ 58 మ్యాచ్ ల్లో గెలిచింది. బలాబలాలు సమానంగానే ఉన్నాయి. ఇక ఆఖరి పది వన్డేలు చూసుకుంటే 5 ఇంట కివీస్ గెలిచింది. నాలుగు ఇండియా గెలిచింది. నాటి నుంచి నేటి వరకు రెండు సమానమైన జట్లుగానే ఉన్నాయి. ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే.

కాకపోతే ప్రస్తుతం 2023 వన్డే వరల్డ్ కప్ లో ఇండియా జట్టు అన్ని రకాలుగా అద్భుతంగా ఉంది. ఈసారి కివీస్ కి చెక్ పెట్టడం ఖాయమని అంటున్నారు. లీగ్ మ్యాచ్ లో కివీస్ ని ఓడించిన సంగతి మరువకూడదని అంటున్నారు. ఇది కూడా 20 ఏళ్ల తరువాత జరిగిన అద్భుతమనే అంటున్నారు.

ఎందుకంటే ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌పై ఇండియా 20 ఏళ్ల నుంచి ఇప్పటి వరకూ గెలవలేదు. తాజా టోర్నిలోనే మళ్లీ కివీస్ ను లీగ్ మ్యాచ్ లో ఓడించింది టీమిండియా. ఓవరాల్ గా న్యూజిలాండ్‌దే పైచేయి ఉంది. ఇప్పుడు తిరిగి నాకౌట్ దశలో న్యూజిలాండ్‌తో తలపడటం ఇండియాకు ఇబ్బందే కావచ్చంటున్నారు. ఆలెడ్రీ లీగ్ లో ఇండియా చేతిలో కివీస్ ఓడింది కాబట్టి, పాత సెంటిమెంట్స్ అన్నీ గాలికి కొట్టుకుపోయినట్టే అంటున్నారు.

Related News

Kashish Kapoor : ఒక నైట్ కు వస్తావా? అని అడిగాడు… టీమిండియా క్రికెటర్ పై హాట్ బ్యూటీ సంచలన ఆరోపణలు!

Women’s World Cup 2025 : చిన్నస్వామిలో మ్యాచ్ లు బ్యాన్.. తిరువనంతపురంకు షిఫ్ట్.. షాక్ లో RCB!

Kohli Beard : కోహ్లీకి తెల్ల గడ్డం… దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న అనుష్క శర్మ !

Salman Khan IPL Team RCB : జట్టును కొనబోతున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్?

Dewald Brevis : డెవాల్డ్ బ్రెవిస్ ఊచకోత.. ఏకంగా 8 సిక్స్ లతో రచ్చ..CSK ఇక తిరుగులేదు

Subhman-Anjini : టీమిండియా క్రికెటర్ తో అందాల తార ఎఫైర్… పబ్బులో అడ్డంగా దొరికిపోయారుగా

Big Stories

×