E-Paper
Advertisement

NZ vs NED: న్యూజిలాండ్ జోరు.. నెదర్లాండ్స్ పై భారీ విజయం..

NZ vs NED: న్యూజిలాండ్ జోరు.. నెదర్లాండ్స్ పై భారీ విజయం..

NZ vs NED: వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ,నెదర్లాండ్ జట్లు తలపడ్డాయి. అక్టోబర్ 5న ఇంగ్లాండ్ తో తలపడిన న్యూజిలాండ్ ప్రారంభ మ్యాచ్ లోనే విజయ ఢంకా మోగించింది. మరోపక్క 6వ తారీకు పాకిస్తాన్ తో తలపడిన నెదర్లాండ్స్ జట్టు చిత్తుచిత్తుగా ఓడిపోయింది. దీంతో జరిగిన మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు .. ఎవరు ఓడుతారు అని ఉత్కంఠత నెలకొంది. అందరూ ఊహించినట్లే న్యూజిలాండ్ వరుసగా రెండో మ్యాచ్ లో కూడా విజయం సాధించింది.

మొదటి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ పై గత వరల్డ్ కప్ ప్రతీకారాన్ని తీర్చుకున్న న్యూజిలాండ్ అదే జోరును ఈరోజు నెదర్లాండ్స్ పై కూడా ప్రయోగించింది. రెండవ మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై ఏకంగా 99 పరుగుల భారీ మెజారిటీతో విజయకేతనం ఎగురవేసింది. దీంతో రెండు వరుస విజయాలు సాధించి వరల్డ్ కప్ పాయింట్ టేబుల్ లో న్యూజిలాండ్ టీం టాప్ లోకి దూసుకు వెళ్తుంది. ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలిత బౌలింగ్ ఎంచుకుంది. మరోపక్క పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ కూడా బౌలింగ్ నే ఎంచుకుంది. అయితే జరిగిన మ్యాచ్ లో మాత్రం టాస్ నెదర్లాండ్స్ గెలిచింది.

మొన్న టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటే కలిసి రాలేదు కదా. ఈసారి బ్యాటింగ్ ఎంచుకున్న బాగుండేదేమో.. కానీ ఈసారి కూడా నెదర్లాండ్స్ బౌలింగే ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగుల స్కోర్ సాధించింది. ఆ తర్వాత చేజింగ్ కు దిగిన నెదర్లాండ్స్ 223 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అయితే జరిగిన మ్యాచ్ లో గమ్మత్తైన విషయం గమనించారా.. న్యూజిలాండ్ 322 చేయగా నెదర్లాండ్ దాని రివర్స్ 223 కి ఆల్ ఔట్ అయింది. బహుశా ఇలాంటి ఇన్సిడెంట్ ఇంతవరకు ఎక్కడా జరిగి ఉండదేమో.

న్యూజిలాండ్ తరఫున ఓపెనర్ విల్ యంగ్ 70 పరుగులు సాధించగా,రచిన్ రవీంద్ర 51 రన్స్ చేసి హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక టామ్ లేథమ్ 53, డారిల్ మిచెల్ 48 రన్స్ చేసి టీమ్స్ స్కోర్ ముందుకు నడిపించారు. ఇక లాస్ట్ లో మిచల్ సాంట్నర్ 17 బంతులలో 3 ఫోర్లు ,2 సిక్స్ లు బాది మెరుపు బ్యాటింగ్ తో 36 రన్స్ చేశాడు. ఇక ఆ తరువాత స్కోర్ వెనక పరుగులు పెట్టడం నెదర్లాండ్స్ వంతు అయింది. ఆరంభం నుంచి ఎక్కడ గెలిచేలా కనిపించకుండా ..నెదర్లాండ్స్ రెగ్యులర్ ఆటతీరు కనబరిచింది.

ఆట మొదలైనప్పటి నుంచి వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చిన నెదర్లాండ్స్ టీమ్ లో కొలిన్ అకెర్‌మ్యాన్ 69 రన్స్ చేసి కాస్తయినా పరువు నిలబెట్టాడు. ఐసీసీ వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో నెదర్లాండ్స్ కు ఇది వరుసగా రెండవ పరాజయం కాగా న్యూజిలాండ్ కు ఇది వరుసగా సెకండ్ విక్టరీ. ఒకదాని తర్వాత ఒకటి వరుస విజయాలతో జోరు మీద ఉన్న న్యూజిలాండ్ టీం తిరిగి అక్టోబర్ 13 శుక్రవారం నాడు బంగ్లాదేశ్ తో తలపడనుంది. మరి ముచ్చటగా జరిగే ఈ మూడవ మ్యాచ్ లో కూడా విజయం సాధిస్తుందా లేక అజేయం గా కొనసాగుతున్న న్యూజిలాండ్ గెలుపు పరంపరకు బ్రేక్ పడుతుందా చూడాలి.

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×