BigTV English

ICC World Cup 2023 : భారత సంతతి కుర్రాళ్ల హవా.. ఆ జట్లలో కీరోల్..

ICC World Cup 2023 : భారత సంతతి కుర్రాళ్ల హవా.. ఆ జట్లలో కీరోల్..

ICC World Cup 2023 : న్యూజిలాండ్ నెదర్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ సంతతికి చెందిన నలుగురు క్రికెటర్లు ఆడడం జరిగింది. న్యూజిలాండ్ తరఫున ఆడుతున్న రచిన్ రవీంద్ర.. గురించి ప్రస్తుతం తెలియని వారు ఉండరు. మొన్న ఇంగ్లాండ్ ..న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో అతని ఆట తీరు విశేషమైన అభిమానులను సంపాదించింది. మరో పక్కన నెదర్లాండ్ జట్టులో ఉన్న విక్రమ్‌జిత్ సింగ్, ఆర్యన్ దత్, తేజ నిడమనూరు …ఈ ముగ్గురు భారత సంతతికి చెందిన ఆటగాళ్లు కావడం మరొక విశేషం.


తేజ నిడమనూరు…ఇతను మన తెలుగు కుర్రాడే.. విజయవాడకు చెందిన తేజ చిన్నతనంలోనే ఫ్యామిలీతో న్యూజిలాండ్ లో సెటిల్ అయిపోయాడు. 2017 -19 మధ్య కాలంలో అతను ఆక్లాండ తరఫున దేశవాళీ క్రికెట్లో పాల్గొన్నాడు. ఇక ఆ తర్వాత న్యూజిలాండ్ కు వెళ్లిన తేజ కొంతకాలం ఒక క్రికెట్ క్లబ్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. గత ఏడాది వెస్టిండీస్ తో నెదర్లాండ్ తలపడిన మ్యాచ్ లో తేజ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

ఇక నెదర్లాండ్ ఓపెనర్ బ్యాట్స్మెన్ అయిన విక్రమ్‌జిత్ సింగ్.. భారత సంతతికి చెందిన మరొక ప్లేయర్. పంజాబ్ లోని చీమా ఖుర్ద్‌ లో 2003లో జన్మించాడు విక్రమ్‌జిత్ సింగ్. అయితే అతని తాత ఖుషి చీమా.. ఒక టాక్సీ డ్రైవర్ గా 1984లో నెదర్లాండ్స్ లో పనిచేసేవారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు తరచుగా భారత్ కు వస్తూ వెళ్తూ ఉండేవారు. కానీ విక్రమ్ కు 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతని కుటుంబం పూర్తిగా నెదర్లాండ్స్ లో సెటిల్ అయిపోయింది. 11 ఏళ్ల వయసులో క్రికెట్ పై మక్కువ చూపిన విక్రమ్ 15 సంవత్సరాలు వచ్చేసరికి నెదర్లాండ్స్ ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగాడు. 2019లో టీ20 ఫార్మాట్ లో రంగప్రవేశం చేసిన అతను గత ఏడాది మార్చిలో న్యూజిలాండ్ పై జరిగిన మ్యాచ్ తో వన్డే సిరీస్ లో అరంగేట్రం చేశాడు.


నెదర్లాండ్స్ స్పిన్నర్ ఆర్యన్ దత్ కుటుంబ మూలాలు కూడా భరత్ తో ముడిపడి ఉంది. 1980లో అతని తల్లిదండ్రులు పంజాబ్ ను వదిలి నెదర్లాండ్స్ కు వెళ్లి స్థిరపడ్డారు. 9 ఏళ్ల వయసులోనే క్రికెట్ పై మక్కువతో ఆడడం మొదలుపెట్టిన ఆర్యన్…13 ఏళ్ల వయసులో చండీఘడ్‌లో శిక్షణ కూడా తీసుకున్నాడు. 2021లో నెదర్లాండ్స్ ప్లేయర్ గా అరంగేట్రం చేసిన ఈ 20 ఏళ్ల కుర్రాడు.. ఇప్పటికే 27 మండేలు ,5 టి20 మ్యాచ్ లు ఆడాడు.

ఇక పేరులోనే రాహుల్ ని, సచిన్ ని కలిపి పెట్టుకున్న న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్.. తండ్రి రవి కృష్ణమూర్తి బెంగుళూరులో క్లబ్ లెవల్ క్రికెట్ ఆడేవాడు. ఉద్యోగరీత్యా న్యూజిలాండ్ కు వెళ్లి అక్కడ స్థిరపడిపోయిన రవి కృష్ణమూర్తికి క్రికెట్ అంటే ఎంతో మక్కువ. తండ్రి గైడెన్స్ లో క్రికెట్ లోకి అడుగుపెట్టిన రచిన్ కు అనూహ్యంగా బ్రాస్‌వెల్ గాయపడటంతో వన్డే వరల్డ్ కప్ 2023లో పాల్గొనే అవకాశం దక్కింది. అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ తొలి మ్యాచ్ లోనే మెరుపు శతకం సాధించి చెలరేగిపోయాడు.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×