BigTV English

IND Vs AUS : నాగ్‌పూర్ టెస్టుపై భారత్ పట్టు.. రోహిత్ సెంచరీ.. మెరిసిన మర్ఫీ..

IND Vs AUS : నాగ్‌పూర్ టెస్టుపై భారత్ పట్టు.. రోహిత్ సెంచరీ.. మెరిసిన మర్ఫీ..

IND Vs AUS : నాగ్‌పూర్ టెస్టులో భారత్ పట్టు బిగిస్తోంది. రెండోరోజు భారతే పైచేయి సాధించింది. తొలిరోజు ఆస్ట్రేలియాను 177 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా…ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 77 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో రోజు కెప్టెన్ రోహత్ శర్మ అద్భుత పోరాటంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఆధిక్యం సాధించింది.


నైట్ వైచ్ మెన్ గా బరిలోకి దిగిన అశ్విన్ ( 23) జట్టు స్కోర్ 118 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. పూజారా ( 7), కోహ్లీ ( 12), సూర్య కుమార్ యాదవ్ (8) వెంటవెంటనే వెనుదిరిగారు. దీంతో భారత్ 168 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. 50 పరుగుల వ్యవధిలోనే ఇలా నలుగురు బ్యాటర్లు వెనుదిరగడంతో టీమిండియా కష్టాల్లో పడింది. అయితే రోహిత్ ఒంటరి పోరాటం చేస్తూ సెంచరీ సాధించాడు. రవీంద్ర జడేజాతో కలిసి సోర్క్ 200 పరుగులు దాటించాడు. భారత్ స్కోర్ 229 పరుగుల వద్ద హిట్ మ్యాన్ (120 ) అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే తొలి టెస్టు ఆడుతున్న కీపర్ కేఎస్ భరత్ (8) పెవిలియన్ బాట పట్టాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 7 వికెట్లు నష్టపోయి 321 పరుగులు చేసింది. ఈరోజు భారత్ మొత్తం 244 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజ్‌లో జడేజా, అక్షర్ పటేల్ ఉన్నారు.

హిట్ మ్యాన్ రికార్టులు…
భారత కెప్టెన్‌ రోహిత్ శర్మ టెస్టుల్లో 9వ శతకం కొట్టాడు. దాదాపు రెండేళ్ల టెస్టు సెంచరీ బాదాడు. ఇంతకుముందు 2021లో ఇంగ్లాండ్‌పై శతకం చేశాడు. ఆసీస్‌పై సెంచరీ సాధించిన రోహిత్‌ శర్మ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకొన్నాడు. అన్ని ఫార్మాట్లలో సెంచరీ సాధించిన భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. పాక్‌ కెప్టెన్ బాబర్ అజామ్‌, దక్షిణాఫ్రికా మాజీ సారథి ఫాఫ్‌ డుప్లెసిస్‌, శ్రీలంక మాజీ కెప్టెన్ తిలకరత్నె దిల్షాన్‌ మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. ఇప్పుడు వారి సరసన రోహిత్ చేరాడు. ఈ క్రమంలో ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ (42) సెంచరీల రికార్డును అధిగమించాడుఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ 43 శతకాలు చేశాడు. ఇందులో టెస్టుల్లో 9, వన్డేల్లో 30, టీ20ల్లో 4 సెంచరీలు ఉన్నాయి.


మెరిసిన మర్ఫీ..
ఆస్ట్రేలియా తరఫున టెస్టు క్రికెట్ లో అరంగేట్రం చేసిన టాడ్ మర్ఫీ అద్భుతంగా రాణించాడు. బ్యాటింగ్ డకౌట్ అయిన ఈ స్పిన్నర్.. భారత్ తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీశాడు. తొలి నాలుగు వికెట్లు అతడి ఖాతాలోనే పడ్డాయి. రాహుల్, అశ్విన్, పూజారా, కోహ్లీ …మర్ఫీ చేతికి చిక్కారు. కీపర్ భరత్ ను అవుట్ చేసి తొలి మ్యాచ్ లోనే 5 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా బౌలర్ల కమిన్స్ , లయన్ తలో వికెట్ తీశారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×