Wife praises Ashwin- Jadeja dedicates award to wife : క్రికెటర్ల భార్యలు ఇటీవల తరచూ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నారు. తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. రోహిత్ భార్యయితే ధైర్యంగా ముందుకొచ్చి ముంబై ఇండియన్స్ పై తిరుగుబాటు జెండా ఎగురవేసింది. బుమ్రా భార్య అయితే నెటిజన్లకు స్ట్రాంగ్ వార్నింగ్ లు ఇచ్చింది. ప్రస్తుతం అశ్విన్ భార్య ప్రీతి నారాయణన్ అయితే 500-501 వికెట్ల మధ్య ఎంతో టెన్షన్ పడినట్టు తెలిపింది.
అశ్విన్ 500 వికెట్లపై ఆమె మాట్లాడుతూ నిజానికి హైదరాబాద్ లోనే 500వ వికెట్టు వస్తుందని ఆశించి స్వీట్లు కొని పెట్టాం. కానీ రాలేదు. తర్వాత రెండో టెస్ట్ విశాఖలో రాలేదు. మూడో టెస్ట్ వరకు ఎదురుచూడాల్సి వచ్చింది. కానీ స్వీట్లు ముందే తేవడం వల్ల హైదరాబాద్ టెస్ట్ ముగిసిన వెంటనే ఫ్రెండ్స్, కాలనీలో వాళ్లకి, అపార్ట్ మెంట్ లో వాళ్లకి అందరికీ ఇచ్చేశాం. ముందుగానే సెలబ్రేషన్స్ చేసుకున్నట్టు చెప్పాం.
తర్వాత రాజ్ కోట్ లో ఒక్కసారిగా మా ఆనందం ఆవిరైపోయిందని అనిపించింది.
48 గంటలు ఎలా గడిచాయో కూడా తెలీదు. కానీ బీసీసీఐకి ఎప్పుడూ క్రతజ్నతగా ఉంటామని తెలిపింది. ఎందుకంటే తనని మ్యాచ్ మధ్యలోంచి పంపించడమే కాదు, స్పెషల్ ఫ్లయిట్ లో దగ్గరుండి చెన్నై పంపించారని, ఈ ఘటన ఎప్పటికీ మరువలేమని అన్నాది. అందుకనే 500 వికెట్లకి 501 వికెట్లకి మధ్య చాలా జరిగిందని చెప్పుకొచ్చింది.
Read more: యశస్విని ఇంక ఎక్కువ పొగడకూడదు.. రోహిత్ శర్మ..!
అందుకే తను 500 వికెట్లు తీసుకున్న రోజున మేం ఎవరం సంతోషంగా లేమని అంది. అలాగే అశ్విన్ ని చూసి మేమందరం చాలా గర్వపడుతున్నాం. తను సాధారణంగా కనిపించే అసాధారణమైన వ్యక్తి అని తెలిపింది.
ఈ అవార్డు నా భార్యకి అంకితం: రవీంద్ర జడేజా
రాజ్ కోట్ మ్యాచ్ లో రెండు విభిన్న పార్శ్వాలు బయటకి వచ్చాయి. అక్కడ అశ్విన్ భార్య మాట్లాడుతూ తనకి భర్తంటే ఎంతో అభిమానం, ప్రేమ అని తెలిపింది.
అదే రవీంద్ర జడేజా దగ్గరికి వచ్చేసరికి సీన్ రివర్స్ అయ్యింది. అంటే అక్కడ భార్య ఏం చేసిందంటే భర్త గురించి చెప్పింది. ఇక్కడ భర్త ఏంచేశాడంటే భార్య గురించి చెప్పాడన్నమాట.
రవీంద్ర జడేజా మూడో టెస్ట్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. దీనిని తన భార్య గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే రివాబాకు అంకితం ఇస్తున్నట్టు తెలిపాడు. ఇలా భార్యపై తనకున్న ప్రేమని మరోసారి వ్యక్తం చేశాడు.
‘రెండో ఇన్నింగ్ లో ఐదు వికెట్ల ఘనతను అందుకోవడం ప్రత్యేకంగా ఉంది. అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెంచరీ చేయడం మరింత సంతోషంగా ఉంది. ఒక ఆల్ రౌండర్ గా ఇలా రెండు పాత్రలు సమానంగా పోషించడం జీవితంలో మరిచిపోలేనిదని అన్నాడు.
నా హోమ్ గ్రౌండ్‌లో ఇది నాకు దక్కిన స్పెషల్ అవార్డు అని అన్నాడు. నిజానికి నా సక్సెస్ వెనుక, నా భార్య కష్టం ఎంతో ఉంది. తను మానసికంగా, ఎంతో ధృడంగా ఉంటుంది. తనని చూసి అంతే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తుంటానని తెలిపాడు.