BigTV English

Yashasvi Jaiswal: రోహిత్, జడేజా ఇద్దరిని చూసి సిగ్గుపడ్డా: యశస్వి జైశ్వాల్!

Yashasvi Jaiswal: రోహిత్, జడేజా ఇద్దరిని చూసి సిగ్గుపడ్డా: యశస్వి జైశ్వాల్!

Rohit Sharma Mimics Yashasvi Jaiswal: రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో డబుల్ సెంచరీ చేసిన యశస్వి జైశ్వాల్ మాట్లాడుతూ.. ఆ ఇద్దరిని చూసి సిగ్గుపడ్డానని తెలిపాడు. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స‌లో త్వరగా అవుట్ అయిపోయాను. తర్వాత 33 పరుగులకే 3 వికెట్లు పడిపోయిన దశలో  కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా అద్భుతంగా ఆడారని అన్నాడు. 


నిజానికి చాలా సిగ్గనిపించింది. వారి ముందు తలెత్తుకోలేక పోయాను. సీనియర్లు ఇద్దరూ ఆడిన విధానం, నాలో స్ఫూర్తిని కలిగించిందని అన్నాడు.

సీనియర్ల నుంచి ఇవే  నేర్చుకోవాలని అన్నాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలా ఆడాలన్నదే ముఖ్యమని అన్నాడు. అందుకే సెకండ్ ఇన్నింగ్స్‌లో అంత జాగ్రత్తగా ఆడాను. క్రీజులో చాలాసేపు వికెట్టు కాపాడుకుంటూ ఆడాను. ఒక్కసారి పిచ్ స్వభావం తెలిసింది. పేసర్ల పేస్‌ని అంచనా వేశాను. స్పిన్‌ని పసిగట్టాను.


Read More: ఈసారి బుమ్రా అవుట్.. రెస్ట్ ఇవ్వనున్న బీసీసీఐ?

వీళ్లు పదేపదే ఇలాగే వేస్తున్నారని ఒక అంచనాకి వచ్చాక, ఎదురుదాడి చేశానని తెలిపాడు. నా అంచనా తప్పలేదు. వారు అలాగే వేశారు, నేనలాగే సిక్స్‌లు, ఫోర్లు కొట్టానని తెలిపాడు. కాకపోతే మూడోరోజు నాకు వెన్నునొప్పి ఎక్కువై రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగాను. నాలుగో రోజుకి సర్దుకుందని తెలిపాడు. అందుకే రెట్టించిన ఉత్సాహంతో డబుల్ సెంచరీ సాధించానని తెలిపాడు.

యశస్విని ఇమిటేట్ చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ

రాజ్‌కోట్ టెస్ట్‌లో 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్సర్లతో 216 పరుగులు చేసి యశస్వి జైశ్వాల్ అజేయంగా నిలిచాడు. అయితే డబుల్ సెంచరీ అనంతరం  గ్రౌండ్‌లో తనదైన శైలిలో గాల్లోకి ఎగిరి పంచ్‌లు ఇస్తూ, సంబరాలు చేసుకున్నాడు. తర్వాత ప్రేక్షకుల వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చాడు. 

డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ ఏం చేశాడంటే, యశస్విని చూసి సేమ్ అలాగే ఇమిటేట్ చేశాడు. ప్రేక్షకుల వైపు తను కూడా చూస్తూ.. ఫ్లైయింగ్ కిస్సెస్ ఇచ్చాడు. దీంతో అన్నిచోట్లా ఒక్కసారి నవ్వులు విరిశాయి. 

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×