BigTV English

Sai Sudharsan: మాంచెస్టర్ లో భారీ వర్షం… కవర్స్ ఉండగానే బ్యాటింగ్ చేస్తున్న సాయి సుదర్శన్

Sai Sudharsan: మాంచెస్టర్ లో భారీ వర్షం… కవర్స్ ఉండగానే బ్యాటింగ్ చేస్తున్న సాయి సుదర్శన్

Sai Sudharsan :   టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే… ఈ టోర్నమెంట్లో మూడు టెస్టులు పూర్తయ్యాయి. మరో రెండు టెస్టులు మాత్రమే మిగిలి ఉన్నాయి. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. ఈ నాలుగు టెస్ట్ మాంచెస్టర్ లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ అనే స్టేడియంలో.. జరగనుంది. అయితే రేపటి నుంచి మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో… ఈ మాంచెస్టర్ వేదికగా భారీ వర్షం కురుస్తోంది. ఇక వర్షం పడడంతో… టీమిండియా యంగ్ క్రికెటర్ సాయి సుదర్శన్… గ్రౌండ్ లో ఎంజాయ్ చేశాడు. గ్రౌండ్ పైన కవర్స్ కప్పి ఉంచినా కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.


మాంచెస్టర్ వేదికగా భారీ వర్షం

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రేపటి నుంచి నాలుగో టెస్ట్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు టెస్టులు పూర్తికాగా రేపటి నుంచి నాలుగో టెస్ట్ ప్రారంభం అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే మాంచెస్టర్ కు రెండు జట్లు చేరుకున్నాయి. నిన్నటి వరకు అక్కడ బాగానే ప్రాక్టీస్ చేశాయి జట్లు. అయితే ఇవాళ ప్రాక్టీస్ చేద్దామంటే మాంచెస్టర్ గ్రౌండ్ లో భారీ వర్షం కురిసింది. దీంతో కవర్స్ తో.. గ్రౌండ్ పూర్తిగా కప్పేశారు. రేపు కూడా వర్షం ఉండే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. ఒకవేళ వర్షం పడితే మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యే ప్రమాదం పొంచి ఉంది. భారీ వర్షం కురిస్తే ఒకరోజు ఆట లేకుండానే పోవచ్చు.


వర్షంలోనూ సాయి సుదర్శన్ బ్యాటింగ్

మాంచెస్టర్ గ్రౌండ్ లో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో కవర్స్ అన్నీ కప్పేశారు. గ్రౌండ్ కు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కవర్లతో సిబ్బంది కప్పేసింది. అయినప్పటికీ సాయి సుదర్శన్ మాత్రం గ్రౌండ్ లోకి వెళ్లి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేశాడు. చేతిలో బ్యాట్ లేకపోయినా కూడా… గాల్లో చేతులు ఊపుతూ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు నవ్వుకుంటున్నారు. మీ ప్రతాపం ఇంగ్లాండు పైన ఒరిజినల్ మ్యాచ్లో చూపించరా బాబు అంటున్నారు.

Also Read: BAN VS PAK: 4 గురు డకౌట్…30 పరుగులకే 6 వికెట్లు… పాకిస్థాన్ ఇజ్జత్ మొత్తం పాయె.. ఇక గంగలో దూకేయండి

మాంచెస్టర్ టెస్ట్ కోసం టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్

ఇంగ్లాండ్ XI: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (c), జామీ స్మిత్ (WK), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్
అంచనా వేసిన ఇండియా XI:

భారత్ (అంచనా XI): యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (c), రిషబ్ పంత్ (vc & wk), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్/శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, అన్షుల్ కాంబోజ్

Related News

Rohit Sharma: ఆస్పత్రిలో చేరిన రోహిత్ శర్మ…ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌..అస‌లు ఏమైంది

Asia Cup 2025 : నేటి నుంచి ఆసియా కప్ షురూ… ఈ జట్ల మధ్య మొదటి మ్యాచ్.. టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి

Virat Kohli: విరాట్ కోహ్లీని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నా… టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్‌!

Jacob Bethell : ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ కెరీర్ మార్చేసిన RCB… ఇక వీడి స్పీడు ఎవడు ఆపలేడు

Team India : ఫ్యాన్స్ కు అలర్ట్.. ఈ ఏడాది టీమిండియా ఆడబోయే మ్యాచ్ లు ఇవే

Asia Cup 2025 : ఆసియా కప్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన డేంజర్ ప్లేయర్లు వీళ్లే.. లిస్టులో మనోళ్లే అంతా

Big Stories

×