BAN VS PAK: పాకిస్తాన్ క్రికెట్ జట్టు ( Pakistan cricket team )… రోజురోజుకు దిగజారి పోతోంది. ముఖ్యంగా 2025 సంవత్సరం పాకిస్తాన్ జట్టుకు ఏమాత్రం వచ్చిరానట్లే కనిపిస్తోంది. ఈ సంవత్సరంలో… పాకిస్తాన్ జట్టు వరుసగా ఓడిపోతుంది. కీలకమైన సిరీస్లను ఓడిపోవడమే కాకుండా… పరువు మొత్తం పోగొట్టుకుంటుంది పాకిస్తాన్ ( Pakistan cricket team ). ఇక లేటెస్ట్ గా… బంగ్లాదేశ్ గడ్డపై కూడా దారుణమైన పరాజయాన్ని ఎదుర్కొంది పాకిస్తాన్. ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో టెస్టులో కూడా ఓడిపోయింది. ఇందులో.. 125 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్… దారుణంగా ఓడిపోయింది.
Also Read: Ms Dhoni : యువత బేకార్ అయిపోయింది.. నా కూతురు కూడా… ఛీ.. ఛీ అంటూ ధోని సంచలన కామెంట్స్
30 పరుగులకే ఆరు వికెట్లు..
పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య ప్రస్తుతం మూడు టెస్టుల సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే… రెండు టి20 లు గెలిచిన బంగ్లాదేశ్ సిరీస్ కూడా కైవసం చేసుకుంది. ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ఢాకా వేదికగా రెండో టి20 మ్యాచ్ జరిగింది. ఇందులో… మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 133 పరుగులకు కుప్పకూలింది.
పాకిస్తాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి.. బంగ్లా బ్యాటర్లను కట్టడి చేయగలిగింది. అయితే ఆ తర్వాత 134 పరుగులు చేయాల్సిన… పాకిస్తాన్ జట్టు… చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలోనే 19.2 ఓవర్లలో…. 125 పరుగులకే కుప్పకూలింది పాకిస్తాన్. ఒక్క ఆటగాడు అంటే ఒక్క ఆటగాడు కూడా రాణించలేకపోయాడు. ఫహీం అష్రాఫ్ ఒక్కడే 32 బంతుల్లో 51 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇందులో నాలుగు సిక్సర్లతో పాటు నాలుగు బౌండరీలు ఉన్నాయి. ఇక మిగతా ఆటగాళ్లు ఎవరూ కూడా రాణించలేదు. మహమ్మద్ హరీష్, హసన్ నవాజ్, మహమ్మద్ నవాజ్ వీరందరూ డకౌట్ కాగా.. అలాగే సల్మాన్ మీర్జా జీరో పరుగులతో నాట్ అవుట్ గా ఉన్నాడు.
నలుగురు డక్ అవుట్
బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ ( Bangladesh vs Pakistan ) మధ్య జరిగిన మ్యాచ్ లో… 8 పరుగులతో దారుణంగా ఓడిపోయింది పాకిస్తాన్ టీం. అయితే చేజింగ్ చేసే క్రమంలో పాకిస్తాన్ ఆటగాళ్లు నలుగురు డక్ ఔట్ అయ్యారు. మహమ్మద్ హరీష్, హసన్ నవాజ్, మహమ్మద్ నవాజ్ వీరందరూ డకౌట్ అయ్యారు. ఫహీం అష్రాఫ్ ఒక్కడే 32 బంతుల్లో 51 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇది ఇలా ఉండగా… పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మొత్తం 3 t20 మ్యాచులు… జరుగుతున్నాయి. ఇందులో… మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టుపై ఏకంగా 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక ఇవాళ జరిగిన మ్యాచ్ లో 8 పరుగులతో విజయం సాధించింది బంగ్లా. ఇక చివరి టి20 మ్యాచ్ జూలై 24వ తేదీ గురువారం అంటే ఎల్లుండి జరగనుంది.
— Out Of Context Cricket (@GemsOfCricket) July 22, 2025