Bumrah-Harshit: టీమిండియా యంగ్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రానా గురించి క్రీడాభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. చాలా తక్కువ సమయంలోనే టీం ఇండియాలో తన స్థానాన్ని సూస్తిరం చేసుకున్నాడు హర్షిత్ రానా. బౌలింగ్ చేయడంతో పాటు లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగలడు. ఇతడు చాలా దూకుడుగా కనిపిస్తాడు. 2024 ఐపీఎల్ లో హైదరాబాద్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ ను ఔట్ చేసిన తర్వాత ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఆ తరువాత ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లోను ఇలాంటి ప్రదర్శన చేసి ఓ మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు.
Also Read: Telugu Titans: తెలుగు టైటాన్స్ అదిరిపోయే విజయం.. కోచ్ కు కన్నీళ్లు ఆగలేదు
2024 లో కలకత్తా నైట్ రైడర్స్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ సమయంలో కలకత్తా మెంటార్ గా ఉన్న గౌతమ్ గంభీర్.. ఆ తరువాత భారత జట్టుకు హెడ్ కోచ్ అయ్యాడు. ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ ప్రియ శిష్యుడు అయిన హర్షిత్ రానా ఇప్పటికే మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేయడమే కాదు.. వైఫల్యాలు ఎదురైనా జట్టులో వరుసగా అవకాశాలు దక్కించుకోవడం గమనార్హం. ఈ క్రమంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కోటాలో వచ్చినవాడు అంటూ అతడిని ట్రోల్ చేస్తూ ఉంటారు నెటిజెన్లు. ఇలా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఎదుర్కోవడమే కాకుండా తాజాగా.. టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా చేతిలో కూడా ట్రోల్ కి గురయ్యాడు.
ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా తో ఐదు టి-20 సిరీస్ కి సన్నద్ధమవుతోంది. భారత్ – ఆస్ట్రేలియా మధ్య నేటినుండి {అక్టోబర్ 29} తొలి టి-20 ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలో అక్టోబర్ 28న ప్రాక్టీస్ కోసం మైదానానికి బయలుదేరింది. ఈ క్రమంలో హర్షిత్ రానా తన బ్యాగ్ భుజాన వేసుకుని వెళుతున్న సమయంలో.. అతడి వెనకాలే వచ్చిన బూమ్రా హర్షిత్ రానా షూస్ వైపు తన చేతిని చూపించాడు. వైరల్ గా మారిన ఈ వీడియోలో హర్షిత్ రానా ధరించిన షూస్ విచిత్రంగా కనిపించాయి. ఆ షూస్ చూసిన నెటిజెన్లు తెగ నవ్వుకుంటున్నారు. దీంతో హర్షిత్ రానా ధరించిన షూస్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసినవారు బుమ్రా.. హర్షిత్ రానా పరువు తీసాడని కామెంట్స్ చేస్తున్నారు.
చాలా వేగంగా భారత క్రికెట్ తెరపైకి వచ్చిన హర్షిత్ ఇప్పటివరకు ఆడింది కేవలం 14 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు మాత్రమే. అతడు ఇప్పటివరకు అద్భుతమైన ప్రదర్శనలు కూడా ఏమీ చేయలేదు. కానీ అతి తక్కువ కాలంలోనే ఆల్ ఫార్మాట్ ప్లేయర్ గా ఎదిగాడు. ప్రస్తుతం భారత క్రికెట్ లో అన్ని ఫార్మాట్లు ఆడుతున్న అతి కొద్ది మందిలో హర్షిత్ రానా ఒకరు. ఇతడు 2022 నుండి జట్టులో ఉన్నాడు. నేరుగా టెస్టుల్లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్న హర్షిత్.. ఎంతో కీలకమైన ఆస్ట్రేలియా సిరీస్ లో తొలి టెస్ట్ ఆడాడు.
ఇప్పటిదాకా అతడు రెండు టెస్టుల్లో నాలుగు వికెట్లే తీశాడు. ఎటువంటి ప్రతిభ లేకుండానే జట్టులో కొనసాగుతున్నాడని.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అతడి వెనకాల ఉండడం వల్లే అవకాశాలు దొరుకుతున్నాయని విమర్శలు హర్షిత్ పై ఎక్కువ అయ్యాయి. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన 3 వన్డేల సిరీస్ లోని మూడవ వన్డేలో నాలుగు వికెట్లతో విజృంభించాడు. ఈ క్రమంలో రాబోయే కాలంలో హర్షిత్ రానా స్థిరంగా రానిస్తే పేసర్ల కొరతతో ఉన్న భారత్ కి ఓ మంచి బౌలర్ దొరికినట్లేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">