BigTV English

IND vs ENG First Test : తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు భారీ లీడ్.. మూడో రోజే ముగిస్తారా?

IND vs ENG First Test : తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు భారీ లీడ్.. మూడో రోజే ముగిస్తారా?
Cricket news today telugu

IND vs ENG First Test updates(Cricket news today telugu):


హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ లో 190 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఓవర్ నైట్ స్కోర్ 421/7 తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా మరో 15 పరుగులకే చివరి 3 వికెట్లు కోల్పోయింది. జడేజా (87), బుమ్రా (0), అక్షర్ పటేల్ (44) వికెట్లను ఒక్క పరుగు కూడా జోడించకుండా చేజార్చుకుంది. ఒకదశలో 7 వికెట్ల నష్టానికి 436 పరుగులతో ఉన్న టీమిండియా అదే స్కోర్ వద్ద ఆలౌట్ అయ్యింది.

స్పిన్నర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై ఇంగ్లాండ్ పార్ట్ టైమ్ బౌలర్ జో రూట్ 4 వికెట్లను పడగొట్టాడు. రెండో రోజు ఆటలో యశస్వి జైస్వాల్, శ్రీకర్ భరత్ వికెట్లను పడగొట్టిన రూట్.. మూడోరోజు ఉదయం జడేజా, బుమ్రాలను వరస బంతుల్లో పెవిలియన్ కు చేర్చాడు. ఇంగ్లాండ్ స్పిన్నర్లు రేహన్ అహ్మద్, టామ హార్ల్టీ రెండేసి వికెట్లు తీశారు. లీచ్ కు ఒక వికెట్ దక్కింది. మొత్తం 9 మంది టీమిండియా బ్యాటర్లను స్పిన్నర్లే అవుట్ చేశారు. రవిచంద్రన్ అశ్విన్ రనౌట్ అయ్యాడు.


తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ను భారత్ బౌలర్లు 246 పరుగులకే కట్టడి చేశారు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 436 పరుగులు చేయడంతో 190 పరుగుల లీడ్ లభించింది. స్పిన్ కు అనుకూలిస్తున్న ఈ పిచ్ పై ఇంగ్లాండ్ బ్యాటర్లు క్రీజు నిలబడటం అంత ఈజీ కాదు. ఈ మ్యాచ్ మూడో రోజే ముగిసినా ఆశ్చర్యపడనవసరంలేదు. ఇప్పటికే మ్యాచ్ పై భారత్ పట్టు బిగించింది. స్పిన్నర్లు చెలరేగితే టీమిడింయా విజయం లాంఛనమే.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×